ఈ ఏడాది వేసవి కాలం మరీ తీవ్రంగా ఉండబోతోందంటూ భారత వాతావరణ శాఖ (ఐ.ఎం.డి) పదే పదే హెచ్చరిస్తోందంటే అందుకు కారణం లేకపోలేదు. ఈసారి వేసవి దాదాపు జూలై వరకూ కొనసాగడ మే కాకుండా, గత ఏడాది కంటే కొన్ని డిగ్రీలు ఎక్కువగా వేడిని విరజిమ్మే అవకాశం ఉంది. దేశంలోని అనేక ప్రాంతాలు సాధారణ స్థితి కంటే ఎక్కువగా గరిష్ఠ స్థాయి ఉష్ణోగ్రతలను అనుభవిస్తాయంటూ ఆ శాఖ గత వారం హెచ్చరించింది. మార్చి-మే నెలల మధ్య కాలాన్ని ఈ శాఖ గరిష్ఠ స్థాయి ఉష్ణ కాలంగా అది అభివర్ణించింది. కొన్ని వాయవ్య రాష్ట్రాలలో మాత్రం సాధారణ ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉ ంది. వాస్తవానికి ప్రతి రుతువులోనూ కాస్తంత చల్లగా ఉండే ఈ రాష్ట్రాలలో కూడా ఎండ వేడిమి కొద్ది గా పెరగడం వల్ల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యే సూచనలున్నాయి. మిగిలిన భారతదేశంలో ఉష్ణో గ్రతలు కనీ వినీ ఎరుగని స్థాయిలో పెరగడం వల్ల, అంటే సాధారణ 45 డిగ్రీల సెల్షియస్ స్థాయి నుంచి మరింతగా పెరగడం వల్ల ప్రజలకు అనేక కష్టనష్టాలు ముంచుకొచ్చే ప్రమాదం ఉంది.
గత మార్చిలోనే వాతావరణ శాఖ వేడిగాలులు, వడగాలులకు సంబంధించి హెచ్చరికలు జారీ చేయడం ప్రారంభించింది. ప్రతి నెలా ఉష్ణోగ్రతలు ఎలా ఉండ బోతున్నాయన్నది ప్రాంతాల వారీగా తెలియజేసింది. ఎల్ నీనో ప్రభావం తీవ్రతరం కావడం వల్లే వాతావరణ శాఖ ఆందోళన చెందుతోందని, ప్రజలకు మామూలు కంటే ముందుగా హెచ్చరికలు జారీ చేయడానికి ఇదే కారణమని అర్థం చేసుకోవాల్సి ఉంది. ఎల్ నీనో ప్రభావమంటే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడమన్నమాట. ముఖ్యంగా భూమ ధ్య రేఖకు దగ్గరగా ఉన్న సెంట్రల్ పసిఫిక్ ప్రాంతంలో ఉష్ణోగ్రత తీవ్రంగా పెరగడం వల్ల అనేక దేశాల లో ఉష్ణోగ్రతలు మామూలు కంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు పెరగడం, వడగాలులు వీచడం జరుగు తుంది. సాధారణంగా అత్యధిక శాతం వర్షాలు కురిసే వాయవ్య భారతదేశంలో ఈ ఏడాది బాగా తక్కువ స్థాయిలో వర్షాలు కురవడం ఈ ఎల్ నినో ప్రభావమేనని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఎల్ నీనో విజృంభించినప్పుడల్లా భారత దేశంలోనే కాక, అనేక చుట్టుపక్కల దేశాలలో జూలై-సెప్టెంబర్ నెలల మధ్య వర్షాభావం ఏర్పడి, దుర్భిక్షం తాండవం చేసింది.
పసిఫిక్ ప్రాంతంలోని కొన్ని దేశాలలో మాత్రం తటస్థ వాతావరణం ఏర్పడవచ్చు. అంటే ఎల్ నినో ప్రభావం గానీ, దానికి వ్యతిరేకమైన లా నీనా ప్రభావం గానీ ఉండక పోవచ్చు. మార్చి-ఏప్రిల్ నెలల్లోనే 15 శాతం ప్రభావాన్ని కనబరుస్తున్న ఎల్ నినో క్రమంగా బలపడి మే-జూలైల మధ్య 55 శాతం ప్రభావాన్ని చూపించే ప్రమాదం ఉంది. దీని తీవ్రత గురించి వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు ప్రజలను హెచ్చరిస్తూనే ఉంటుంది. భారత వాతావరణ శాఖ ఇలా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ఉండడానికి కారణం అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు అప్రమత్తంగా ఉండేందుకే. ఈ హెచ్చరికలను ఆధారం చేసుకు ని డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా అప్రమత్తమై, ప్రభుత్వాలకు తగిన సూచనలు, ముందు జాగ్ర త్త చర్యలను అందజేస్తూ ఉంటుంది. ఈ అథారిటీ 2016 నుంచి ఈ విధంగా వడగాడ్పుల హెచ్చరికల ను జారీ చేస్తోంది. అంతేకాదు, వడగాడ్పుల సమయంలో ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరంగా నివేదికలు, మార్గదర్శకాలను జారీ చేయడం కూడా జరుగుతోంది.
విచిత్రమేమిటంటే, ఈ నివేదికలు, మార్గదర్శక సూత్రాలు, హెచ్చరికలన్నీ చెవిటి వాడి ముందు శం ఖం ఊదిన చందంగానే మిగిలిపోతున్నాయి. సెంటర్ ఫర్ పాలసీ రిసెర్చ్క చెందిన నిపుణులు దేశవ్యాప్తంగా అధ్యయనం జరిపినప్పుడు, ఇందులోని అనేక మార్గదర్శక సూత్రాలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదనీ, పైగా ఇందులో కొన్ని సిఫారసులు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా లేవనీ అర్థమైంది. అత్య ధిక ఉష్ణోగ్రతలకు సంబంధించిన జాగ్రత్తలనే పదే పదే చెప్పడం జరుగుతోంది తప్ప గాలిలో తేమ గురించి, రాత్రిళ్లు వేడి వాతావరణం గురించి ఎక్కడా ప్రస్తావించడం లేదు. ఇక ముందస్తు చర్యలు తీసుకో వడానికి అవసరమైన నిధులు ఈ శాఖల వద్ద లేకపోవడం విచారకర విషయం. నిజానికి, వడగాడ్పులకు సంబంధించిన వాతావరణ హెచ్చరికలను కూడా వర్షాకాలం, తుపానులు, గాలివానల గురించిన హెచ్చ రికలతో సమానంగా పరిగణించడం అన్నది ఎక్కడా జరగడం లేదు. అంతేకాదు, ముందస్తు జాగ్రత్త చర్యలకు సంబంధించి, రక్షణ చర్యలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం పూర్తిగా కొరవడింది.