Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Swadesi Movement and Handloom role: స్వదేశీ ఉద్యమంలో చేనేత కీలక పాత్ర

Swadesi Movement and Handloom role: స్వదేశీ ఉద్యమంలో చేనేత కీలక పాత్ర

జాతీయ చేనేత దినోత్సవం 1905 సంవత్సరంలో ప్రారంభమైన స్వదేశీ ఉద్యమాన్ని స్మరించుకోవడానికి కూడా ఈ రోజు జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది చేనేత కార్మికులు మరియు చేతివృత్తుల వారికి జీవనోపాధిని అందించే భారతదేశ ఆర్థిక వ్యవస్థలో చేనేత పరిశ్రమ గణనీయమైన పాత్ర పోషించింది, పోషిస్తుంది.
ఈ రోజున, చేనేత ఉత్పత్తుల అందాలను ప్రదర్శించడానికి మరియు వాటిని కొనుగోలు చేయడానికి ప్రజలను ప్రోత్సహించడానికి వివిధ కార్యక్రమాలు మరియు ప్రదర్శనలు నిర్వహిస్తారు. భారతదేశ దేశీయ సంస్కృతిని కాపాడటంలో చేనేత నేత కార్మికులు పోషించే పాత్రను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం.అత్యంత గొప్ప పాత్రపోషించే ది అని చెప్పవచ్చును.
జాతీయ చేనేత దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 7న జరుపుకొనే. ఈ రోజును శతాబ్దాలుగా భారతదేశ వస్త్ర పరిశ్రమకు వెన్నెముకగా నిలిచిన చేనేత కార్మికులకు ప్రత్యేకం గా బావించ వచ్చు. ప్రస్తుతం ఈ ప్రాముఖ్యత మరింత పెరిగింది ఎందుకంటే ప్రపంచం పెరుగుతున్న పర్యావరణ సంక్షోభాన్ని మరియు స్థిరత్వం గురించి పెరు గుతున్న ఆందోళనలను ఎదుర్కొంటోంది. చేనేత నేయడం పవర్‌ లూమ్స్‌ (మరమగ్గాలు)అనేది యంత్రంతో తయారు చేయబడిన వస్త్రాలకు పర్యావరణ అనుకూలమైన మరియు స్థిరమైన ప్రత్యామ్నాయం.
భారతదేశంలోని లక్షలాది చిన్న-స్థాయి చేనేత కార్మి కుల జీవనోపాధికి మద్దతు ఇస్తుంది. పారిశ్రామికీకరణ మరియు సామూహిక ఉత్పత్తి పెరుగుదల అనేక మంది చేనేత కార్మికుల జీవనోపాధికి ముప్పు తెచ్చిపెట్టింది మరియు చాలామంది తమ చేతివృత్తిని విడిచిపెట్టి ఇతర పనిని కనుగొనవలసి వస్తుంది. కావున జాతీయ చేనేత దినోత్స వం ఈ సంవత్సరం నుండి చేనేత ద్వారా తయారు చేసే వస్త్రాల ఉత్పత్తి మనుగడను పరిరక్షించడానికి మరియు దానిని సజీవంగా ఉంచే నేత కార్మికులకు మద్దతు ఇవ్వడా నికి ఈ రోజు ప్రత్యేకత.
2015లో భారత ప్రధాని నరేంద్ర మోడీ చెన్నైలో మొదటి జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించినప్పుడు ఈ రోజును తొలిసారిగా జరుపుకున్నారు. 1905లో కల కత్తాలో బాల గంగాధర్‌ తిలక్‌, లాలా లజపత్‌ రాయ్‌, మరియు బిపిన్‌ చంద్ర పాల్‌ వంటి ప్రముఖ నాయకులు ప్రారంభించిన స్వదేశీ ఉద్యమం జ్ఞాపకార్థం ఆగస్ట్‌ 7వ తేదీని ఎంచుకున్నారు. ఈ ఉద్యమం బ్రిటీష్‌ పాలన నుండి స్వాతంత్య్రం కోసం భారతదేశం యొక్క పోరాటంలో ముఖ్యమైన పాత్ర పోషించిన చేనేత వస్త్రాలతో సహా భారతీయ -నిర్మిత వస్తువులను ఉపయోగించాలని సూచించింది.
భారతదేశంలో చేనేత నేయడం గురించిన మొట్టమొదటి సూచనలలో ఒకటి ఋగ్వేదంలో చూడవచ్చు, ఇది సుమారు క్రీ. పూ 1500 నాటిది. పత్తి, పట్టు మరియు ఉన్ని నుండి వస్త్రాన్ని నేయడం, అలాగే సహజ వర్ణ ద్రవ్యాలను ఉపయోగించి బట్టలకు రంగులు అద్దడం గురించి వివరిస్తుంది.
శతాబ్దాలుగా, చేనేత పరిశ్రమ అభివృద్ధి చెందుతూనే ఉంది, చేనేత కార్మికులు కొత్త పద్ధతులు, నమూనాలు మరియు సామగ్రిని సృష్టిస్తూ వారి ప్రత్యేకతను, నైపుణ్యాన్ని అభివృద్ధి చేశారు, చేస్తున్నారు.
చేనేతన్నకు ఉపాధి కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేనేత (పవర్‌ లూమ్‌) కార్మికుల ఉపాధి కోసం చేపట్టిన ఒక అద్భుతమైన ఆలోచనతో పెను మార్పులు తీసుకువచ్చిన పథకమే ‘బతుకమ్మ చీరలు’ తయారుచేయడం
తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల ప్రాంతంలో చేనేత వృత్తిపై ఆధారపడిన వారి సంఖ్య చాలా ఎక్కువ. రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాల్లో ఒక నూతన పథకం ద్వారా వారికి ఉపాధి కల్పించడానికి పెద్దపీట వేసింది. నేటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. బతుకమ్మ చీరలతో వారికి ఎంతో ఆసరాగా నిలిచింది. గతంలో సిరిసిల్ల ప్రాంతంలో మరమగ్గాలపై నేస్తున్న గుడ్డలపై లాభాలు అంతంతమాత్రంగానే ఉండే టివి. చాలీచాలని కూలీ కారణంగా ఆర్ధిక పరిస్థితులు దెబ్బ తినేవి. చేసేందుకు ఉపాధి లేక సిరిసిల్ల నేతన్నలు ఇతర ప్రాంతాలకు ఏండ్ల తరబడి వలస వెళ్లేవారు. తల్లో చోట, కొడుకో చోట, పండుగ పబ్బాలకు మాత్రమే సిరిసిల్లకు వచ్చేవాళ్లు. ఈ వాస్తవ జీవితాలను గమనించిన ప్రభుత్వం చేనేత కార్మికులకు సరైన జీవన ఈ విధానం కోసం ఒక భరోసా కల్పించాలని నిర్ణయించుకొని అందులో భాగంగా బతుకమ్మ చీరెల తయారి పథకాన్ని ఆమల్లోకి తెచ్చి అక్కడి కార్మికుల జీవితాల్లో వెలుగులు చూడాలని తలపెట్టిన కార్యక్రమం దిగ్విజయమయ్యిందనవచ్చు దానికి ప్రత్యక్ష సాక్ష్యం సిరిసిల్ల ప్రాంతంలోని కార్మికులు, యజమానులలో ఆనందమే… ఇలాంటి ఆలోచనత్మక కార్యక్రమాల ద్వారా చేనేతకు ఉపాధి కల్పిస్తూ దేశ ప్రగతికి వెన్నదన్నుగా నిలిచిన చేనేత కార్మికుడికి భరోసా కల్పించినది తెలంగాణ ప్రభుత్వం.
చేనేత, ప్రసిద్ధి చెందిన ఒక కుటీర పరిశ్రమ పద్మశాలీ, దేవాంగ, తొగట, తొగటవీర క్షత్రియ, పట్టుశాలి, జాండ్ర, స్వకులసాలి, కైకాల, కుర్ణి, కర్ణ భక్తులు, కరికాల భక్తులు, భవసార క్షత్రియ, నీలి, నీలకంఠ, నెస్సి, కురిమిచెట్టి, కత్రి, సెంగుందంల కుల వృత్తి. ఈ పరిశ్రమకు అనుసంధానంగా మరికొన్ని చేతి పనులు వృత్తులు ఉన్నాయి. పడుగు (వార్పు), పేక (ఫిల్లింగ్‌ థ్రెడ్‌)లు ఒకదానితో ఒకటి అను సంధానించబడే విధానాన్ని నేత అంటారు. నిలువు వరుస దారాలను కలిపి ‘పడుగు’ అని, అడ్డు వరుస దారాలను కలిపి ‘పేక’ అని పిలుస్తారు. అందులో చేతితో మగ్గంపై నేతనేసే విధానాన్ని చేనేత అంటారు
చేనేత వస్త్రాల్లో ముఖ్యంగా కాటన్‌, సిల్క్‌, ఉన్ని, భాదీ, పట్టు వస్త్రాలు వస్తాయి. నేతన్నకు చవకగా అందరికీ అందుబాటులోకి తేవడం, పరిశ్రమలు నెలకొల్పడానికి ఆర్ధిక చేయూతను ఇవ్వడం, వస్త్ర ఉత్పత్తులకు సరైన మార్కెట్‌ సౌకర్యాలు కల్పించడం, ప్రభుత్వాల కనీస బాధ్యతగా గుర్తించాలి. నేతన్న ఉత్పత్తుల్లో చీరలు, పంచెలు, కాటన్‌ దుస్తులు గృహ వస్త్ర ఉత్పత్తులు, దుప్పట్లు, శాలువాలు, కండువాలు, లాంటివి అనేకం వస్తాయి. చేనేత నూలును భారీ వస్త్రంగా, మిల్లులో ఒడికిన నూలును హాండ్లూమ్‌ ఫాబ్రిక్గా వద్ద ఉత్పత్తులు అందుబాటులోకి వస్తున్నాయి. ఒడిసా ఇక్కత్‌, ఆంధ్రప్రదేశ్‌ కలంకారి, గుజరాత్‌ ఉత్పత్తు లకు అనాదిగా విశేష ఆదరణ కొనసాగుతున్నది. చేనేత హస్తకళలను ఆదరిస్తూ, అందమైన హుందాగా కనిపించే చేనేత వస్త్రాలను సగర్వంగా ధరిస్తాం. చేనేత ఉత్పత్తుల మనుగడకు సహకరిద్దాం..
-డా. చిటికెన కిరణ్‌ కుమార్‌
ఇంటర్నేషనల్‌ బెనెవోలెంట్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ సభ్యుడు
9490841284

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News