Sunday, July 7, 2024
Homeఓపన్ పేజ్Tagore: రవీంద్రుని గీతాంజలి

Tagore: రవీంద్రుని గీతాంజలి

మనదేశంలో మహాకవులెందరున్న విశ్వ కవి మాత్రం ఒక్కరే. ఆయనే రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ తన సాహిత్య రచన లో గీతాంజలి (ఇంగ్లీష్‌) కావ్యానికి 1913లో అత్యంత ప్రతిష్టా త్మకమైన నోబెల్‌ బహుమతి వచ్చింది. ఇది భారత సంస్కృతిని ప్రపంచానికి చాటాయి. ఠాగూర్‌ రచనలు సర్వ సమానత్వ సౌబ్రాతృ త్వ భావనలకు ప్రాణం పోశాయి.
మొదట బెంగాల్‌ భాషలో ఉన్న గీతాంజలి ని ఇంగ్లాండ్‌కి నౌక ప్రయాణం చేస్తూ ఇంగ్లీషులోకి ఠాగూర్‌ అనువదించడం జరిగింది. గీతాంజలి ఇంగ్లీషులోకి అనువాదం చేయడానికి విలియంబట్లర్‌ ఎట్స్‌ సహాయం చేసినాడు. అనేక భాషల్లోకి అనువాదమైన ఈ రచన వందలకొద్ది అనువాదం చేశారు అను వాదకులు. ప్రస్తుత సమీక్ష బెంధాళం. క్రిష్ణారావు గారు గీతాం జలి తెలుగు అనువాద సాయంతో గీతాంజలిలో ఒక ప్రేమ రచన, భక్తి రచన,మానవత్వపు రచన శ్రమైక్య జీవన రచన. రసస్వాదన చేయగల ప్రతి హృదయానికి హత్తుకో గల ఏదో ఒక లోతైన భావం అందులో దొరుకుతుంది. నాకు అంతం లేకుండా చేశావు నీ సంతోషం కోసం అనే మొదటి వాక్యంలోనే అద్భుత మైన భా వం ను అందించాడు. అంతులేని జీవిత తాత్వి కతను సుందరంగా చెప్పి భారతీయ దార్శనికతను ప్రపంచానికి చాటి చెప్పాడు. భారతీయ పునర్జననం గురించి ఆలోచనపరులను మరింతగా ఆలోచింపజేశాడు. భక్తి భావనను అంతర్గతంగా చెప్పిన రవీం ద్రుడు దేవుడు ఓ మానవుడిని ఆట బొమ్మగా చేసి తన సంతోషం కోసం ఆడే క్రీడగా ఈ జీవిత సారాంశ మును చెప్పినాడు.
సున్నితమూ సుందరము అయిన
నా జీవన పాత్రను అప్పుడప్పుడు
ఖాళీ చేస్తూనే మళ్లీ మళ్లీ తోణికిసలాడిస్తున్నాడు
నవజీవన చైతన్యంతో
రాడికల్‌ డిక్షనరీ పదాలైన చైతన్యం, నవ అనే పదాలు చమత్కారంగా వాడి అదే పదాలతో నవజీవన చైతన్యం అనే పదప్రయోగం చేసి అందరిని ఆశ్చర్య పరిచాడు. జీవనం అనే పదానికి పాత్రను జోడించి జీవన పాత్రగా మార్చి ఇక్కడ మె ప్పించాడు. అన్నీ కోల్పోయి విచారంలో బతుకు బండి లాగి స్తున్న జీవులకు ధైర్యం చెప్పి దేవుడు ఉన్నాడు అనే భరోసా ఇచ్చాడు.
అసత్యాన్ని అల్లంత దూరంలో
నిలిపి వేస్తాను ఈ మనసులో
కాలు పెట్టనివ్వకుండా!
నువ్వు నా మనో మందిరంలో
జ్ఞాన జ్యోతిని వెలిగించి న సత్యానివి!
దేవుడు సత్యం అని చెప్పిన సత్యాన్వేషి, సదా సత్యవాక్కు తన కవిత్వంలో పలికించాడు.
యద్రూపే నా తద్రూపం నిశ్చితం
తద్రూపం నా అభి చరతి.
వేదసారాన్ని కవిత్వంలో అంతర్గతంగా చెప్పి నాడు.
నాగానానికి ఆభరణాలు లేవు
అందమైన అలంకరణలు లేవు
శోభని సొమ్ముల్ని పరిత్వజించింది నా గానం
ఎవరికి అర్థం కాని పదాలు వాడి
అలంకరణలు వాడి సందులు సమాసాలు వాడి
సాహిత్యాన్ని చట్టంలో బంధించిన అక్షరాలతో స్వేచ్ఛ గీతాలు పాడించాడు.
నేను కవినన్న నా అహం
అంతరించింది నీ సమక్షంలో‘ అంతటి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ అక్షరాలు అంటుంటే, వారి
కవితానిరాడంబరతకు అద్దం పడుతుంది.
పైడితేరీష్‌ బాబు అనే కవి అన్నట్టు గ్లోబు ముందు పెట్టుకొని
గ్లోబల్‌ థింకర్‌లు అనుకునే కుహన మేధావులు ఉన్న ప్రపంచంలో అంతటి విశ్వకవి రవీంద్రుడు ఓ ఈగోలెస్‌ పర్సనాలిటీ.
గగనం మూలుగుతుంది. గాయపడిన బాధితునిలా
చక్కటి పదాల పొందిక ఈ కావ్యంలో ప్రతిధ్వనిస్తాయి.
యాత్ర పూర్తి చేయక ముందే
దారి భత్యం ఖర్చు అయిన యాత్రికుడు
గీతాంజలిలో ఉన్న ఈ పదాలు సామాన్య జనం లో ఓ నానుడిగా మారింది .
నా ధనగారంలోనే నేను బంధీని
త్రేంచలేని ఈ సంకెళ్ళకు రూపశిల్పిని నేనే
మితిమీరిన ధనదాహం తో మానవ జీవితం
ఖైదీ జీవితంగా మారిపోయింది అనే భావం అపురూపంగా చెప్పినాడు.
నీ సంకల్పాన్ని నెరవేర్చేఆ ప్రేమ సంకెళ్లని
తెగిపోనియకుంట ఉంటే చాలు
ఈ పదాలలో ప్రేమ గొప్పతనం ప్రేయసి ప్రియుల అనుబంధంను. అక్షరాలలో పండించాడు. శ్రీశ్రీ మరో ప్రపంచం గురించి చెప్పిన రవీంద్రుడు సరి కొత్త ప్రపంచంను చెప్పిన మార్పు కోసం ప్రయత్నించు వ్యక్తులు ఆశా ఆద్వేత వాదులు.
అదిగో చూడు అతడు ఎక్కడ ఉన్నాడో!
కఠిన మైన నేలని నాగలి తో దున్ని
తన సేద్యం తో సారవంతం చేస్తున్న
కర్షకుడున్నచోట – రహదారిని రూపొందించడానికి
శ్రామికుడు రాళ్లు కొట్టిన చోట కొలువై ఉన్నాడు అతడు.
గీతాంజలి, మహాప్రస్థానం అనేవి ఆశా అద్వైత అభ్యుదయ కవిత్వం, ఇది తిరుగులేని నిజం.
గీతాంజలి రచన – మరో రామాయణం
గీతలెన్నో చెరిపిన – మరో భగవద్గీత
ఖచ్చితంగా చెప్పాలంటే – మరో ఖురాన్‌
భావాలలో – మరో బైబిల్‌.
గీతాంజలి అనేది ప్రతి ఒక్కరి హృదయ మందిరంలో ఉండ వలసిన పుస్తకం నేటి సమాజ పోకడలకు జీవనతాత్వికతను చెప్పే ఓ వికసించిన పుష్పం. అందుకే అక్షరాలకు బానిసల మవుదాం, అక్షరాల్లో లేని సమానత్వం అక్షరభావాలతో సరిదిద్దుదాం.

– సాదే సురేష్‌
9441692519

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News