Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Teacher's day: బడి, బాధ్యత, భవిష్యత్తుని పరిచయం చేసిన గురువులు

Teacher’s day: బడి, బాధ్యత, భవిష్యత్తుని పరిచయం చేసిన గురువులు

"సర్వేపల్లి నా కృష్ణుడు": మహాత్మా గాంధీ

ఒకరోజు నేను దేశ పూర్వాధ్యక్షుడిని అవుతాను. కానీ ఎప్పటికి మాజీ విద్యావేత్తను కాను (One day I will become former president but I will never become ex academician) అన్నారు సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు. చదవడమన్నా, చదువు చెప్పడ మన్నా అంత ఇష్టం. ఉపరాష్ట్రపతిగా రెండుసార్లు, రాష్ట్రపతిగా ఒకసారి రాజ్యాంగ పదవుల నిర్వహణకు ముందు సుదీర్ఘకాలం అధ్యాపక వృత్తిలో కొనసాగారు. దేశంలోని అనే క ప్రతిష్ఠాత్మక కళాశాలల్లో, విశ్వవిద్యాలయాలలో పాఠా లు చెప్పారు. వివిధ విశ్వవిద్యాలయాలకు ఉపకులపతిగా సేవలు అందించారు. ప్రతి చోట విద్యార్థుల మనసులపై చెరగని ముద్రవేశారు.
సర్వేపల్లి తనకు కృష్ణుడు అన్నారు గాంధీజీ. ‘మీరు నా ఉపాధ్యాయుడు’ అని కీర్తించారు పండిట్‌ నెహ్రూ. యుగపురుషుడు, జ్ఞాన మహర్షి.. మన సర్వేపల్లి రాధా కృష్ణన్‌. గురువులకే గురువు ఆయన. దేవుడు, గురువు పక్క పక్కనే ఉంటే నేను మొదట గురువుకే నమస్కరిస్తా అన్నారు మహానుభావుడు కబీర్‌ దాస్‌. ఎందుకంటే.. ఆయన భగ వంతుడు అని మొదట తనకు చెప్పింది గురువే కాబట్టి అని వివరించారు. సమాజంలో గురువుకు ఉన్న స్థానం అంత గొప్పది. ‘గు’ అంటే చీకటి, ‘రు’ అంటే పోగొట్టేది అని అర్థం. అంటే మనలో అజ్ఞాన పొరలు తొలగించి, జ్ఞాన దీప్తిని వెలిగించేవాడు గురువు అన్నమాట. అలాంటి గురు వును దైవం కంటే మిన్నగా ఆరాధించే సంస్కృతి మనది. ఏటా సెప్టెంబర్‌ 5ను ‘టీచర్స్‌ డే’ (ఉపాధ్యాయ దినోత్స వం) గా నిర్వహించుకుంటాం.
గురువులకే గురువు సర్వేపల్లి.. ఆయన జీవితం ఓ స్ఫూర్తి పాఠం. తరతరాలుగా, యుగయుగా లుగా సనాతన భారతీయ విచారధారలోని పరమార్థ విష యాల్ని ప్రపంచానికి సూటిగా, సులభంగా, స్పష్టంగా తెలియ జెప్పిన ధీమంతుడు, ధీశాలి సర్వేపల్లి. హృద యాన్ని, మేధను సమపాళ్లలో పండించిన ప్రజ్ఞాశాలి ఆయ న. తత్వశాస్త్రానికి సాహిత్య మాధుర్యం చేకూర్చిన మహా రచయిత రాధాకృష్ణన్‌. ఆధునిక సమాజానికి ఎలాంటి గురువు అవసరమో, గురువు ఎలా ఉండాలో ఆయన స్వీ యచరిత్రలో స్పష్టంగా వివరించారు. బోధ గురువులు, బాధ గురువుల లక్షణాలను ప్రస్తావించారు.
గురువును దేవుడితో సమానంగా చూస్తూ గురుదేవో భవ అనేది భారతీయ సంప్రదాయం. టీచర్లను గౌరవించ డానికి కొన్ని దేశాల్లో ప్రత్యేకమైన రోజుల్లో గురు పూజోత్స వాలు నిర్వహిస్తారు. గురు దినోత్సవానికి సెలవు ఇవ్వడం కొన్ని దేశాల్లో సంప్రదాయంగా వస్తోంది. సెప్టెంబర్‌ 5వ తేదీన మన దేశంలో టీచర్స్‌ డే నిర్వహించుకుంటున్నాం. అంటే, అది గురు పూజోత్సవం రోజన్న మాట. అది భారత రెండవ రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ పుట్టినరోజు. 1962లో భారత రాష్ట్రపతిగా పదవీ బాధ్యతులు చేపట్టిన రాధాకృష్ణన్‌ వద్దకు కొంత మంది విద్యార్థులు, మిత్రులు వెళ్లారు. పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడానికి అను మతి ఇవ్వాలని వారు రాధాకృష్ణన్‌ కోరారు. అందుకు సమాధానంగా ఆయన – ప్రత్యేకంగా తన పుట్టిన రోజు జరపడానికి బదులు సెప్టెంబర్‌ 5వ తేదీన టీచర్స్‌ డే నిర్వ హిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు.
ఆ రోజును భారతదేశంలో సెలవు దినంగా ప్రకటించ లేదు. ఆ రోజున ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అదే గురు పూజోత్సవాలు. ఆ రోజున విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్తారు. కానీ రోజువారీ బోధనలు, కార్య క్రమాలు కాకుండా పాఠశాలల్లో ఉత్సవాలు జరుగుతాయి. చాలా పాఠశాలల్లో విద్యార్థులు ఉపాధ్యాయుల అవతా రాలు కూడా ఎత్తుతారు. ఉపాధ్యాయుల పాత్ర పోషించి తమ పాఠశాల ఉపాధ్యాయుల నుంచి ప్రశంసలు అందు కుంటారు.
ఆధ్యాత్మిక బోధకుడికి, భౌతిక విషయాలు బోధించే ఉపాధ్యాయుడికి మధ్య తేడా ఉంది. ఆధ్యాత్మిక గురువు తన శిష్యుడి ఆలోచనల నుంచి భ్రమలు తొలగించి ఆధ్యా త్మిక దిశగా మళ్లిస్తాడు. దేవుడు, గురువు ఇద్దరు ఎదురుగా ఉంటే ముందు ఎవరికి నమస్కరించాలని సందేహం తలె త్తితే తాను ముందుగా గురువునే ఎంచుకుంటాననే భావన భారతీయ సంప్రదాయంలో ఉంది. గురు బ్రహ్మ, గురూర్‌ విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్‌ పరబ్రహ్మ అం టారు. అంటే, గురువు పరబ్రహ్మ స్వరూపమనని భారతీ యుల విశ్వాసం.
తల్లిదండ్రులు జన్మనిస్తే పిల్లల భవిష్యత్తును తీర్చి దిద్దేది, వారి ప్రవర్తనను రూపు దిద్దేది ఉపాధ్యాయులే. భావి భారత పౌరులను తీర్చి దిద్దేది కూడా వారే. ఉపా ధ్యాయులు దేశానికి ఉత్తమ పౌరులను అందించే సేవకు లు. అందువల్ల ఉపాధ్యాయులను గౌరవించడం, సత్కరిం చడం దేశాన్ని గౌరవించడం.
గురువు గొప్పదనం
మహాభారతం అరణ్య పర్వంలోని యక్షప్రశ్నల ఇతి వృత్తంలోని అంశం.. యక్షుడు ‘మనిషి మనీషి ఎలా అవు తాడు?’ అని ధర్మరాజును ప్రశ్నిస్తాడు. అప్పుడు ధర్మరాజు ‘అధ్యయనం వల్ల, గురువు ద్వారా’ అని బదులిస్తాడు. గు రువుకు ఉన్న శక్తి అంతటి గొప్పది. అధర్వణ వేద సంప్ర దాయం ప్రకారం చదువు ప్రారంభించే ముందు శిష్యుడు మొదటగా ఇష్టదేవతా ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత ‘స్వస్తినో బృహస్పతిర్దదాతు’ అని గురువును స్మరిస్తాడు.
గురువు ఎలా ఉండాలి?
ఒక గురువు ఎలా ఉండాలో భారతీయ సనాతన ధర్మం స్పష్టంగా సూచించింది. గురువుకు ఉండాల్సిన లక్ష ణాలు, గురువు గొప్పదనం గురించి స్కాంద పురాణంలో వివరించారు. ఈ పురాణంలోని ఉమామహేశ్వర సంవా దం ‘గురుగీత’గా ప్రసిద్ధి పొందింది. ఇందులో గురువు అని ఎవరిని పిలవాలి? ఆయన అవసరం ఏమిటి? శిష్యు డు ఎలా ఉండాలి? తదితర ఎన్నో విషయాల్ని పరమేశ్వ రుడు పార్వతీదేవికి స్వయంగా వివరిస్తాడు.
గురువు శాంతంగా ఉండాలి. మంచి వేషం (డ్రెస్సిం గ్‌) ధరించాలి. సదాచారం (ప్రవర్తన) పాటించాలి. మంచి బుద్ధి, మంత్రతంత్రాల (పాఠ్యాంశాలుగా చెప్పుకోవచ్చు)పై చక్కని అభినివేశం ఉండాలి. నిగ్రహ, అనుగ్రహ సామ ర్థ్యాలు కలిగి ఉండాలి. ఈ లక్షణాలన్నీ గురువుకు ఉండా లని పరమేశ్వరుడు చెబుతాడు. ప్రస్తుత సమాజానికి నిజం గా కావాల్సిన గురువు ఇలాంటి వాడే.
చాణక్యుడు చేతిలో రూపుదిద్దుకున్న శిల్పం చంద్ర గుప్తమౌర్యుడు. సమర్థ రామదాసు తయారుచేసిన వీర ఖడ్గం శివాజీ. రామకృష్ణ పరమహంస అందించిన ఆధ్యా త్మిక శిఖరం వివేకానందుడు. భారతీయ గురుశిష్య శక్తికి వీళ్లు ఉదాహరణలు మాత్రమే. ఆదిదేవుడితో మొదలైన గురుపరంపర వేదవ్యాసుడితో సుసంపన్నమైంది. భారతీ య సంస్కృతిలో నేటికీ అది కొనసాగుతూనే ఉంది. సనా తన ధర్మాన్ని పరంపరాగతంగా పరిరక్షిస్తున్న ఆ గురుదే వులను స్మరించుకుంటూ.. నేటి పిల్లలను పావన నవజీవన బృందావన నిర్మాతలుగా, రాబోవు తరం దూతలుగా తీర్చిదిద్దడానికి ఘనమైన అడుగులు వేద్దాం..
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు..

  • సభావట్‌. కళ్యాణ్‌
    ఏబీవీపీ రాష్ట్ర నాయకులు.
    9014322572
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News