మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ఇద్దరూ ఇద్దరే. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, ఐటి, పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్, ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావులది రాజకీయ ప్రస్థానం ప్రత్యేకం. కేసీఆర్ సాదించిన రికార్డుల వలె వీళ్లిద్దరూ అనేక రికార్డులు సాధిస్తున్నారు. కేసీఆర్ వ్యూహాన్ని, ఆదేశాలను అమలు చేస్తారు. ఎన్నిక ఏదైన గెలుపే లక్ష్యంగా ముందుకు దూసుకుపోతున్నారు. అధినేత కేసీఆర్ అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు. పార్టీ, ప్రభుత్వంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ప్రజల ఆకాంక్షల అనుగుణంగా పనిచేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో, పార్టీ నేతలను సమన్వయం చేస్తూ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్నారు. హరీష్ రావు, కేటీఆర్ లు కృష్ణార్జునుల్లా ముందుకు వెళుతున్నారు. ఎన్నికల ప్రచారంలో సుడిగాలి పర్యటనలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఒక వైపు కేసీఆర్ నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటూ అధికారం దిశగా ప్రజల్ని సన్నద్ధం చేస్తున్నారు. హుస్నాబాద్ నుండి మొదలైన కేసీఆర్ ఎన్నికల ప్రచారం రోజుకు మూడు చొప్పున ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే సుమారు 60 కి పైగా సభల్లో పాల్గొన్నారు. ఇటు కేటీఆర్, హరీష్ రావులు పక్షుల్లా రాష్ట్రమంతా పర్యటిస్తూ రోడ్ షోల్లో పాల్గొంటున్నారు. బీ ఆర్ ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో జనం నుండి పెద్ద ఎత్తున స్పందన లభిస్తుంది. కాంగ్రెస్, బిజెపి పార్టీల కంటే హై స్పీడ్ లో కారు జోరు పెరిగింది.
కేటీఆర్ @ లక్ష మెజార్టీ రికార్డు దిశగా..
సిరిసిల్ల ఎమ్మెల్యేగా 2009 లో మొదటి సారిగా ఎన్నికై కేటీఆర్ వరసగా నాలుగు సార్లు ఘన విజయం సాధించారు. మంత్రిi కేటీఆర్ సిరిసిల్ల నుంచి మూడోసారి వరుసగా భారీ మెజారిటీ సాధించారు. 2009లో కేవలం 171 ఓట్లతో గెలిచిన ఆయన 2010 ఉప ఎన్నికల్లో ఏకంగా 68,220 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో 53,004 ఓట్లు మెజార్టీ, 2018లో 89,009 ఓట్ల మెజారిటీతో రికార్డు నమోదు చేశారు. ఈ ఎన్నికల్లో లక్ష మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. ఇప్పటికే కేటీఆర్ దిశ నిర్దేశంతో సిరిసిల్ల పార్టీ పార్టీ నేతలు, కార్యకర్తలు, యువత ప్రచార రంగంలోకి దిగింది. ఇప్పటికే కేసీఆర్ ప్రచారం నిర్వహించారు. సిరిసిల్ల బంగారు తునక లా అభివృద్ది సాధించింది. సాగు నీటి రిజర్వాయర్లు, అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలతో సిరిసిల్ల ను కేటీఆర్ ముందుకు తీసుకపోతున్నారు. చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రిగా విజయం సాధించారు. రాష్ర్టంలో ఐటి రంగంలో , పట్టణాభివృద్ధి లో అనేక విజయాల్ని సొంతం చేసుకున్నరు. ప్రవేటు రంగాల్లో దాదాపు ఇప్పటి వరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా 30 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వచ్చాయి. వివిధ దేశాల్ని తిరుగుతూ పెట్టుబడుల ప్రవాహాన్ని హైదరాబాద్ కు రప్పిస్తున్నారు. కేటీఆర్ గొప్ప విజన్ తో రాష్ట్రం యువత జీవితాల్లో వెలుగులా కొండంత భరోసా ఇచ్చింది. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో కేటీఆర్ కృషి ఎంతో ఉంది. తెలంగాణ గుండె కాయ హైదరాబాద్. వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు వస్తున్నాయంటే కేటీఆర్ కృషికి నిదర్శనం.
ఇప్పుడు జరగబోతున్న ఎన్నికలో సిఎం కేసీఆర్ నాయకత్వంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. పార్టీలోకి పాత ఉద్యమ నాయకులు, విద్యార్థి ఉద్యమ నాయకులను చేర్చుకుంటూ ఉద్యమ కాలపు ఉదృతం ప్రచారంలో దూకుడుగా ఉండబోతుంది. విద్యార్థి, యువత సమ్మేళనాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. రోడ్ షో లతో పాటు హైదరాబాద్ నగరంలో అన్ని వర్గాలతో కేటీఆర్ సమావేశం అవుతూ మళ్ళీ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు కోసం పొద్దంతా పల్లెలు, పట్టణాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం చేస్తూ పూట హైదరాబాద్ నగర వాసులతో ముచ్చేటిస్తున్నారు. యువతతో కేటీఆర్ కున్న క్రేజ్ వేరు. సోషల్ మీడియాలో ఎప్పటికపుడు కేటీఆర్ రెస్పాండ్ అవుతారు. క్షణక్షణం ప్రచార పర్వం కొనసాగుతోంది.
లక్ష్యం @ లక్షా యాభై వేలు..
హ్యాట్రిక్ రికార్డు దిశగా ట్రబుల్ షూటర్ హరీష్..
ట్రబుల్ షూటర్ మంత్రి తన్నీరు హరీష్ రావు లక్ష్యం లక్షా యాభై వేల దిశగా సాగుతుంది. సిద్దిపేట అసెంబ్లీ నుండి వరసగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా డబుల్ హ్యాట్రిక్ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఏడవసారి బరిలో నిలిచి రికార్డు తిరగరాయనున్నారు. 2018 ఎన్నికల్లో లక్షా 18వేల 699 ఓట్ల రికార్డు మెజార్టీతో ఘన విజయం సాధించారు. రాష్ట్రంలో అత్యధిక రికార్డు సృష్టించిన నాయకునిగా నిలిచారు. ఈ సారి మెజార్టీ లక్షా యాభై వేలు ఇవ్వాలని సిద్దిపేట నియోజక ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కృషి చేస్తున్నరు. సిద్దిపేట నియోజక వర్గంలో చాలా గ్రామాల్లో హరీష్ రావును రికార్డు మెజార్టీ గెలిపించాలని తీర్మానాలు చేస్తున్నారు.
తెలంగాణ కోసం ఉద్యమ సమయంలో బీ ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ సిద్దిపేట శాసన సభకు రాజీనామా చేశారు. అప్పటికే బీ ఆర్ ఎస్ అలియన్స్ లో కాంగ్రెస్ ప్రభుత్వం హరీష్ రావు మంత్రి వచ్చింది. కేసీఆర్ మెదక్ పార్లమెంట్ నుండి గెలిచిన నేపథ్యంలో సిద్దిపేట శాసన సభ నియోజక వర్గం నుంచి రాజీనామా చేసి మంత్రి హరీష్ రావు అవకాశం కల్పించారు. అప్పటి ఉప ఎన్నికల్లో సిద్దిపేట ఎమ్మెల్యేగా ముత్యంరెడ్డిపై 25 వేల మెజారిటీ హరీష్ రావు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అప్పటి నుండి వరసగా 6 సార్లు సిద్దిపేట శాసన సభ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా రికార్డు మెజార్టీలతో విజయం సాధిస్తూ వస్తున్నారు.
మంత్రి హరీశ్ రావు 2004 లో 25 వేల మెజార్టీ సాధించగా రెండవ1982 సారి 2008 ఉప ఎన్నికల్లో 58,935, 2009లో 64,677, 2010 ఉప ఎన్నికల్లో 95,858, 2014లో 93,328 మెజారిటీ సాధించారు. అయితే లక్ష మెజార్టీ దగ్గరికి వచ్చి ఆగిపోయింది. ఈ సారి లక్ష దాటి రికార్డు సృష్టించాలని అనుకున్నారు. 2018 ఎన్నికల్లో ఆయన ఆధిక్యత లక్ష ఓట్లు దాటింది. ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి భవాని (కాంగ్రెస్ )పై 1,18,699 ఓట్ల మెజార్టీతో గెలిచి తిరుగులేని ఆధిక్యం సాధించి రాష్ట్రంలో రికార్డుల రారాజుగా నిలిచారు.
ఇప్పుడు ఒక వైపు రాష్ట్రంలో బీ ఆర్ ఎస్ అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహిస్తూనే.. మరో వైపు సిద్దిపేట నియోజక వర్గంలో ప్రచారం ముమ్మరం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నారు. దీంతో పాటు నియోజకవర్గంలో 30 వేల మంది యువతతో ప్రత్యేక నెట్ వర్క్ తయారు చేశారు. ఎప్పటికప్పుడు ఈ టీమ్ నియోజక వర్గంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తూ ప్రతి సమాచారాన్ని మంత్రి హరీష్ రావుకు అందిస్తూ ఆయన రికార్డు విజయం గెలువాలని కృషి చేస్తున్నరు. ఈ సారి గత రికార్డును తిరగ రాసే విధంగా లక్షా యాభై వేల రికార్డు మెజారిటీతో విజయ ఢంకా మోగించనున్నారు. అయితే రికార్డుల కోసం కాదు కానీ కేసీఆర్ ఇచ్చిన నమ్మకాన్ని నిలబెడుతూ, ప్రజల కోసం పని చేస్తున్న కాబట్టి సిద్దిపేట ప్రజలు అందిస్తున్న దీవెనలే రికార్డు మెజార్టీలు అంటుంటారు హరీష్. మంత్రిగా, పార్టీ నాయకుడిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో ఎంత బిజీ ఉన్న సిద్దిపేటకు నిరంతరం అందుబాటులో ఉంటారు. ప్రజల్లో నాలుకలా హరీష్ రావు నిలిచారు. మాస్ లీడర్ గా గుర్తింపు పొందారు. సంక్షోభాలు వస్తె ట్రబుల్ షూటర్ గా ప్రత్యేక్షమై పరిష్కారం చూపిస్తారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట గుర్తుకు రాగానే డైనమిక్ ఎమ్మెల్యే హరీష్ రావు ఉన్నాడు అని చెబుతుంటారు. నా నమ్మకాన్ని హరీష్ నిలబెట్టి సిద్దిపేట నియోజక వర్గానికి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లుతున్నాడని సిఎం కేసీఆర్ అనేక సందర్భాల్లో అన్నవి మనం వింటున్నాం. అనాడు సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న సిఎం కేసీఆర్ ఎట్లయితే ప్రజల కోసం నిరంతరం కృషి చేశారో అలాగనే సిఎం కేసీఆర్ ఆశీస్సులతో, సిద్దిపేట ప్రజల దీవెనలతో సిద్దిపేటను రాష్ట్రానికి మోడల్ గా నిలిచేలా శక్తి వంచన లేకుండా కృషి చేశారు. సిద్దిపేట జిల్లా, గోదావరి నీళ్ళు, రైలు కల నెరవేరింది. రంగనాయక సాగర్ రిజర్వాయర్,
మెడికల్ కాలేజీ, వెయ్యి ఇండ్ల డబుల్ ఇండ్లు, కోమటి చెరువు, జిల్లా కలెక్టరేట్, కమిషనరేట్ వంటి తో పాటు సిద్దిపేట పట్టణం, నియోజక వర్గంలో అన్ని గ్రామాల్లో ప్రగతి సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీ ఆర్ ఎస్ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేస్తున్నారు. గజ్వేల్, మెదక్ తదితర నియోజక వర్గాలకు ఇంఛార్జి గా, రాష్ట్రంలో అన్ని నియోజక వర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తూనే ఇటు సిద్దిపేటలో లక్షన్నర మెజార్టీ సాధించి గత రికార్డు బద్దలు కొట్టే విధంగా ప్రచార వ్యూహ రచన చేశారు. ఇప్పటికే నియోజక వర్గంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు, పార్టీ అభిమానులు, యువ టీమ్, మహిళలు, పార్టీ సోషల్ మీడియా టీమ్ లు హరీష్ రావు లక్షా యాభై వేల రికార్డు మెజారిటీ దిశగా దూసుకుపోతోంది. పెద్ద ఎత్తున గ్రామాల్లో రికార్డు విజయంతో హరీష్ రావును గెలిపించాలని అన్ని గ్రామాల్లో అన్ని కులాల ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేస్తున్నారు. ఏదీ ఏమైనా హరీష్ రావు లక్షన్నర భారీ మెజార్టీతో రికార్డు దిశగా దూసుకుపోతున్నారు.
చిటుకుల మైసారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ వ్యాసకర్త
సెల్:9490524724