Sunday, February 8, 2026
Homeఎడిటోరియల్ / బహుళTelangana Politics: ఇది నివురుగప్పిన నిశ్శబ్ధం

Telangana Politics: ఇది నివురుగప్పిన నిశ్శబ్ధం

Revanth Reddy Governance: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఆనందం ఇంకా పూర్తిగా తీరకముందే ఆ పార్టీ ఇప్పుడొక అసౌక ర్యవంతమైన వలయంలో చిక్కుకుని, కొట్టుమిట్టా డుతున్నట్టు కనిపిస్తున్నది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తరువాత ఉద్యమ పార్టీ పదేళ్ల పరిపాలనతో విసిగి వేసారిన సామాన్యుడు మార్పు కోరి, కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టాడు. ఇలా ఏర్పడ్డ ప్రభు త్వంపై సహజంగానే ప్రజల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రెండేళ్ల పాలన పూర్తయినా ఎన్నికల హామీల్లో కేవలం ఉచిత బస్సు ప్రయా ణం తప్పితే వేరే ఏదీ సంపూర్ణంగా అమలులోకి రాని దుస్థితి.

- Advertisement -

పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 60 శాతం స్థానాలే దక్కించుకుంది. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ పంచాయతీ ఎన్నికలను క్లీన్‌ స్వీప్‌ చేస్తుంది. కానీ కాంగ్రెస్ ఆ స్థాయి విజయమేమీ దక్కలేదు. బీఆర్‌ఎస్పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉన్నా దాన్ని ఓట్ల రూపంలో మార్చుకోలేని అశక్తత రాష్ట్ర కాంగ్రెస్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సర్వం ఒడ్డితే గానీ కంటోన్మెంట్‌, జూబ్లీపోల్స్​‍ సొంతం చేసుకోలేక పోయింది. అసలు ప్రభుత్వం నడుస్తున్నట్టా లేక కొనసాగుతున్న దన్న భ్రమల్లో ఉన్నామా అనే భావన ఏర్పడుతున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అసలేమనుకుంటున్నారు? ఇంత గందరగో ళాన్ని చూస్తున్న ప్రజల మనసుల్లో ఏముందన్నదే ఇప్పుడు తెలం గాణ రాష్ట్రంలో సమాధానం కోసం ఎదురుచూస్తున్న ప్రశ్న.

పట్టాలెక్కేదెప్పుడు?

పాలన మారుతుంది, ప్రజా సంక్షేమం పట్టాలెక్కుతుంది, ప్రజ ల వద్దకే పాలన, ప్రజలు మెచ్చే పాలన వస్తుందన్న ప్రజల ఆశలు సహజం గానే పెరిగాయి. రెండేళ్లు పూర్తి చేసుకు న్నా అవి ఇప్పటికీ అడియాశలుగానే మిగిలాయన్న విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. ప్రస్తుతం తెలంగాణలో మం త్రి సచివాలయంలో కనిపించడు. ఎమ్మెల్యేని యోజకవర్గంలో అందుబా టులో ఉండడు. ఎంపీలు ఢిల్లీలో బిజీ. ప్రజాపాలన అంటూ చెప్పుకుంటున్న సర్కారు పెద్దలకు ఈ దృశ్యం ఒక ప్ర మాదకరమైన సంకేతం. ఇప్పటికైనా కళ్లు తెరవ కపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇంకా హనీమూన్‌ పీరియడ్‌ భ్రమలో నే ఉన్న ప్రభుత్వం, ప్రభుత్వ పెద్దలు ఎంత తొందరగా తేరుకుంటే అంత మంచిది.

కనిపించని మీనాక్షి నటరాజన్‌ మార్క్​‍

ఒకవైపు బీసీ నినాదం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నది. మరోవైపు కేబినెట్‌ లో చోటు దక్కని నేతలు అసంతృప్తితో ఉన్నారు. పదవులు దక్కిన వారిలో అధి కారంతో కూడిన అహంకారం కనిపిస్తున్నది. కార్యక ర్తలను సంయమనం చేసుకోలేకపోవడమనేది కాంగ్రెస్లో స్పష్టంగా కనిపిస్తున్నది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జిగా మీనాక్షి నటరాజన్‌ వచ్చిన తొలినాళ్లలో ఆమె గురించి మీడియాలో వచ్చిన కథనాలకు, ఆమె చేతలకు పొంతనే లేదు. కొండా సురేఖ ఎపిసోడ్‌ మొదలు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కపై వచ్చిన ఆరోపణల వరకు ఎక్కడా ఆమె జోక్యమే కనపడలేదు. బీసీ నాయకుడిగా ప్రజా బాహుళ్యంలో ఒకింత పేరు న్న మహేష్‌ కుమార్‌ గౌడ్‌ పీసీసీ అధ్య క్షుడిగా ఉండి కూడా పార్టీ-ప్రభుత్వం మధ్య సమన్వయం చేసిం దేమీ కనపడలేదు. గాంధీభవన్‌లో అడపాదడపా ఒకరిద్దరు మంత్రు లతో ముఖాముఖి కార్యక్రమాలు ఏర్పాటు చేయటం తప్ప చెప్పుకో దగ్గ కార్యక్రమాలేవీ ఆయన తరఫున జరిగింది లేదు.

స్వపక్షంలోనే విపక్షం

తెలంగాణలో మొత్తం 2,996 వార్డుల్లో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టే ఈ ప్రభుత్వం దశ-దిశ మారుతుం దని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. సాధారణంగానే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఇది ఇప్పుడు ఇంకొంచెం శృతిమించినట్టు అనిపిస్తున్నది. పార్టీ కార్యక్రమాలకు కొందరు మంత్రులు డుమ్మా కొడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై కొందరు బాహాటంగానే అసహనం ప్రదర్శిస్తున్నారు. ఒక మంత్రి తన శాఖ పరిధిలో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పఠాన్‌చె రులో ఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే దాన్ని స్థానిక సీని యర్‌ నాయకుడు ప్రెస్మీట్‌ పెట్టి మరీ నిప్పులుచెరిగాడు. ఇటు వంటి పరిణామాలు ఏ ప్రభుత్వానికీ మంచి సంకేతం కాదు.

ఇది సరిపోనట్టు.. ఈ మధ్య సీఎం క్యాంప్‌ ఆఫీస్ వేదికగా ‘రెడ్‌ జోన్‌’ ప్రచారం ఒకటి ఊపందుకున్నది. ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరును స్థానికంగా ఓ ప్రైవేట్‌ సర్వే ద్వారా తెలుసుకుని పనితీరు బాగాలేని వారు రెడ్‌ జోన్‌లో ఉన్నారని, ఈసారి మళ్లీ వారికి టికెట్‌ లభిం చటం కల్ల అంటూ లీకులు వైరల్‌ అవుతున్నాయి. ఇది కాంగ్రెస్ నేతల మనసుల్లో ఒకింత భయాన్ని, మరికొంత అంసతృప్తిని రగిలిస్తోంది.

మూడేళ్లకు జరగనున్న సార్వత్రిక ఎన్నికల గురించి అసలు ఇప్పుడు సర్వేలు చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఆ పార్టీ అంతర్గత వ్యవహారమే కానీ.. గోప్యంగా ఉంచాల్సిన విషయాన్ని ఇలా లీకులిచ్చి, ఆయా నాయకులను భయపెట్టి, దారి కి తెచ్చుకునే వ్యూహంగా పార్టీలో కొత్త సంప్రదాయం మొదలైందని కాంగ్రెస్ నేతలే వాపోతున్నారు. పార్టీపై పట్టు పెంచుకునేందుకు చేస్తున్న ఈ ఫీట్లు పాత కాపుల్లో అస హనాన్ని పెంచుతున్నాయి. అందుకే సీనియర్‌ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి వంటి వారికి రోజురోజుకీ మంత్రులు, నేతల నుంచి మద్దతు పెరుగుతున్నది.

అదే కోటరీ ఇంకెన్నాళ్లు?

పాలనలో పట్టు, పాలనా వ్యవహారాల్లో స్పష్టత, ఆయా విభా గాల పనితీరు సమీక్షలు.. ఇవన్నీ ఓ పద్ధతి ప్రకారం జరిగి, ప్రభు త్వం గాడిలో పడాలి. దానికి అధికార యంత్రాంగం ఇతోధిక సహ కారం అందించాలి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న కాలం నుంచి ప్రస్తుత ప్రత్యేక రాష్ట్రం వరకు ఎన్నడూ చూడని విధంగా అధికారులు-మంత్రుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తున్నది. మున్సిపల్‌ పరిపాలనకు సం బంధించి భూవినియోగ మా ర్పు గురించి మున్సిపల్‌ అధి కారులు ఇచ్చిన జీవోకు చట్ట బద్ధత లేదు.

చట్టంలో పొందు పరచని పదాలను కొత్తగా ప్ర భుత్వ ఉత్తర్వులలోకి తీసుకు రావటం ద్వారా ఓ కొత్త సం ప్రదాయానికి తెరలేపారు. దీ ని గురించి ప్రశ్నిస్తే స్పందిం చిన అధికారే లేరు. ఏ ప్రభు త్వాన్నయితే రేవంత్‌ విమ ర్శిస్తూ వచ్చారో.. ఆ ప్రభు త్వమే వెనకేసుకొచ్చిన మందీ మార్బలాన్ని, అధికారులను తన కోటరీలో ఉంచుకుని ఇప్పుడు పాలన కొనసాగిస్తుం డటం ఆశ్చర్యానికి గురిచేస్తు న్నది. నోట్‌ఫైల్‌ దశలోనే స మాచారం లీక్‌ కావటం, చట్ట వ్యతిరేకంగా జీవోలు వెలువ రించడం… ఇలా పాలనలో తప్పటడుగులు వెలుగు చూస్తూనే ఉన్నాయి.

వైరల్‌ వ్యవహారం

ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. ప్రభుత్వం, ప్రభుత్వ పెద్దల ద్వంద్వ వైఖరి గురించి తెలంగాణ సమాజం మాట్లాడు కుంటున్నది. ఉదాహరణకు ఇంగ్లిష్‌ గురించే మాట్లాడదాం, ఉన్నత చదువు గురించే మాట్లాడుదాం. సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ఉస్మా నియా యూనివర్సిటీ వేదికగా ప్రసంగించారు. ఇంగ్లిష్‌ భాష, ఉన్నత చదువులను ప్రస్తావించారు. భాష అనేది కమ్యూనికేషన్‌ మాత్రమేనని, పరిపాలనా సామర్థ్యానికి గీటురాయి కాదని అన్నా రు.

ఇంగ్లిష్‌ రాకపోయినా భయపడొద్దని, బాధ పడాల్సిన అవసర మే లేదని సభా ముఖంగా విద్యార్థులకు వివరించారు. ఇది ఆ మధ్య సోషల్‌ మీడియాలో కూడా బాగా వైరల్‌ అయింది. ఇప్పుడు సీన్‌ కట్‌ చేస్తే.. ఇదే ముఖ్యమంత్రి హార్వర్డ్‍ వెళ్లి తాను ఒక సర్టిఫైడ్‌ లీడర్‌గా శిక్షణ తీసుకుని ఒక ధ్రువీకరణ పత్రం కూడా అందుకుని వచ్చారు. ఇటువంటి పరస్పర భిన్నమైన అంశాలు ఈ ప్రభుత్వంలో ప్రతిరోజు అడుగడుగునా కనిపిస్తున్నాయి. ఇలాంటి చేష్టలు పున రావృతం కాకపోవడమే ఈ సర్కారుకు శ్రీరామరక్ష. ఇక్కడ సీఎం హార్వర్డ్‍ వెళ్లి సర్టిఫికెట్‌ తెచ్చుకోవటం తప్పుపట్టాల్సిన విషయం కానేకాదు కానీ అంతకుముందే ఉస్మానియా వేదికగా పరస్పర విరుద్ధ ప్రకటన చేయటం విమర్శలకు దారితీస్తున్నది.

రేవంత్‌ ప్రోగ్రెస్ రిపోర్ట్‍

రేవంత్‌ పాలనపై ఓ సర్వే ఆసక్తికర విషయాలు వెలుగులోకి తెచ్చింది. అంశాలవారీగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలను పలు అంశాలపై 10కి ఎన్ని మార్కులిస్తారని ప్రశ్నించింది. సంక్షే మంలో సర్కారుకు 8/10, ఆర్థిక స్థితి 4/10, అభివృద్ధి వేగం 5/ 10, ప్రజలతో మమేకం 6/10, ప్రభుత్వ స్థిరత్వం 5/10, మం త్రుల వ్యవహారశైలి 3/10, ఎమ్మెల్యేలు-మంత్రుల మధ్య సమన్వ యానికి 3/10, మొత్తం పరిపాలనకు 5/10 మార్కులు. ఇది టూకీగా రేవంత్‌ 24 నెలల ప్రోగ్రెస్ రిపోర్ట్‍.

నిశ్శబ్దమే గట్టి హెచ్చరిక!

సాధారణంగా ఇతర రాష్ట్రాల్లో విమర్శలు అరుపుల్లా బయ టకు వినిపిస్తుంటాయి. కానీ తెలంగాణ సమాజం కాస్త భిన్నమైంది. టీఆర్‌ఎస్ పార్టీని బీఆర్‌ఎస్ పార్టీగా మార్చి, జాతీయ రాజకీయాల్లో తన ప్రభను చాటుకుందామని సమయాన్నంతా అటే వెచ్చించిన కేసీఆర్‌.. తెలంగాణలో తమ ప్రభుత్వం పట్ల నిశ్శబ్ధంగా పేరుకు పోతున్న వ్యతిరేకతను పసిగట్టలేకపోయింది. అందువల్లే బీఆర్‌ఎస్ ఓటమిపాలైంది. ఇప్పుడు కూడా తెలంగాణలో ప్రభుత్వ విధానాల పట్ల, సంక్షేమ పథకాల అమలు తీరుతెన్నులపై, స్థానిక సమస్యలపై అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల అహంకారంపై ఎక్కడా ప్రజలు బహిరంగంగా మాటాడుకోవటం లేదు. దీనర్థం అసంతృప్తి లేదని కాదు. నివురుగప్పిన నిప్పులా ఉంది. నిశ్శబ్దంగా గూడు కట్టు కుని ఓ హెచ్చరికను వదులుతున్నది. ఈ నిశ్శబ్దాన్ని ఎంత త్వరగా ఛేదిస్తే అంత మంచిది. ప్రభుత్వం ఎంత త్వరగా గుర్తించి నష్ట నివా రణ చర్యలు చేపడితే అంత మంచిది.

సమయమంత్రి చంద్రశేఖర శర్మ
సమయం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News