Sunday, February 8, 2026
Homeఎడిటోరియల్ / బహుళStudent Union Elections: విద్యార్థి సంఘాలకు ఎన్నికలు.. ఆవశ్యకత

Student Union Elections: విద్యార్థి సంఘాలకు ఎన్నికలు.. ఆవశ్యకత

Osmania University Fee Reimbursement: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలు, డిగ్రీ, పీజీ కళాశా లలు కేవలం విద్యాబోధన కేంద్రాలుగా మాత్రమే కాక ప్రజాస్వామ్య వి లువలను నేర్పే సామాజిక పాఠశాలలుగా ఉండాలంటే విద్యా ప్రాంగ ణాల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలి. విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించ లేకపోవడం వల్ల విద్యార్థుల హక్కులు హరించబడుతున్నాయి. విద్యాలయాల్లో ప్రజాస్వామ్య సంస్కృతి క్షీణిస్తున్నది.

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నియమించిన విద్యా కమిషన్‌ కూడా ఇటీవలే విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించా లనే చారిత్రాత్మక, ప్రజాస్వామిక డిమాండ్‌ చర్చలోకి వచ్చింది.

విద్యాసంస్థల్లో విద్యార్థి సంఘాల పాత్ర

విద్యార్థి సంఘాలు విద్యార్థుల సమస్యలకు గొంతుగా నిలుస్తాయి. ఫీజుల పెంపు, హాస్టల్‌ సదుపాయాలు, స్కాలర్‌షిప్‌ల ఆలస్యం, అకడమిక్‌ సమస్యలు, సామాజిక వివక్ష వంటి అంశాలపై యాజమాన్యాల దృష్టిని ఆకర్షించడంలో సంఘాల పాత్ర కీలకం. విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం ద్వారా విద్యార్థి ప్రాతినిధ్యం ఎప్పటికప్పుడు ప్రభుత్వాలకు, విశ్వవిద్యాలయాల పాలక మండళ్లకు ప్రాతినిధ్యాన్ని ఇస్తాయి. తమ సమస్యలు పరిష్కరించాలని పోరాడుతున్న విద్యార్థులకు, విద్యార్థి సంఘా లకు ఎన్నికలు నిర్వహించడం ద్వారా వారి పోరాటాలకు నైతిక, ప్రజా స్వామ్య బలం ఇస్తుంది.

ప్రజాస్వామ్య శిక్షణ కేంద్రాలు

విద్యార్థి సంఘాల ఎన్నికలు విద్యార్థులకు ప్రజాస్వామ్య పాఠాలను నేర్పే ప్రత్యక్ష వేదికలుగా ఉంటాయి. ఓటు హక్కు వినియోగం, ప్రచారం, వాదన, విమర్శ, బాధ్యతాయుత నాయకత్వం వంటి విలువలు విద్యార్థి జీవితంలోనే అలవడతాయి. ఇవే భవిష్యత్‌లో సమాజానికి చైతన్యవం తమైన పౌరులను తయారు చేస్తాయి.

లింగ్డో కమిటీ మార్గదర్శకాలు

సుప్రీం కోర్టు ఆదేశాలతో 2005లో జస్టిస్ లింగ్డో కమిటీ విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చిం ది. ఖర్చుల పరిమితి, హింసరహిత ప్రచారం, అకడమిక్‌ సమతుల్యత వంటి అంశాలతో ఈ మార్గదర్శకాలు ఎన్నికలను ఆరోగ్యకరంగా నిర్వ హించే విధంగా ఉండాలని సూచించింది. కానీ నేటికీ అవి అమలులో లేవు. విద్యార్థులు చైతన్యమంతమైతే పాలకులను ప్రశ్నిస్తారని, వినకుంటే వ్యతిరేకంగా పోరాడుతారని ఒక పథకం ప్రకారం కుట్రతోని విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం లేదు.

ఎన్నికలు లేనప్పుడు వచ్చే నష్టాలు

ఎన్నికలు నిలిపివేయడం వల్ల విద్యార్థుల్లో నిరాశ, నిర్వీర్యత పెరుగు తుంది. విద్యార్థుల నిజమైన అధికారిక ప్రాతినిధ్యాలు ఉండవు. అడ్హాక్‌ కమిటీలకు విద్యార్థుల మద్దతు ఉండదు. ఫలితంగా సమస్యలు పరిష్కరిం చబడవు. ఉదాహరణకు రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రియంబర్స్​‍ మెంట్‌ విడుదల కాక ప్రైవేటు యాజమాన్యాలే కాదు, ప్రభుత్వ విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీకి దాదాపు 100 కోట్ల ఫీజు రియంబర్స్​‍మెం ట్‌ రావాల్సి ఉంది. కానీ దానిని ఎవరూ అడగడం లేదు. అడిగినా ప్రభు త్వాలు పట్టించుకునే స్థితిలో లేవు. విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వ హించడం ద్వారా ఎన్నికైన విద్యార్థి సంఘం ఇలాంటి మౌలిక సమస్య లను డిమాండ్‌ చేసి వాటిని సాధించే అవకాశం ఉంటుంది.

ఇప్పటివరకు తెలంగాణలో కేవలం హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, మౌలానా ఆజాద్‌ ఉర్దూ యూనివర్సిటీలో మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ కూడా సకాలంలో ఎన్నికలు జరగడం లేదు. ఇటీవలే మౌలానా ఆజాద్‌ ఉర్దూ విశ్వవిద్యాలయం భూములను ప్రభుత్వం లాక్కుంది. దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. మా భూములు మాకే కావాలని నినదించారు. దానితోపాటు యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని తద్వారా తమ హక్కులు కాపాడ బడతాయని విద్యార్థులు నినదించడం విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలానే ప్రజాస్వామ్య హక్కును మరొకసారి చర్చలోకి తీసు కొచ్చింది.

తెలంగాణ సందర్భం

తెలంగాణ ఒక ప్రజాస్వామ్య ఉద్యమాల నేల. విద్య, ఉద్యోగం, ఆత్మ గౌరవం కోసం సాగిన పోరాటాల చరిత్ర ఇక్కడి విద్యార్థి ఉద్యమాలకు ఉంది. అటువంటి రాష్ట్రంలో విద్యార్థి సంఘాల ఎన్నికలు లేకపోవడం చరిత్రకు విరుద్ధం. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలంటే, క్యాంపస్ డెమోక్రసీ, అటానమసీ కాపాడాలంటే, పెరుగుతున్న కోర్స్​‍ ఫీజులు ఎగ్జామినేషన్‌ ఫీజులకు వ్యతిరేకంగా ఉద్యమించాలంటే విశ్వవిద్యాల యాల్లో విద్యార్థి ఉద్యమాలపై నిర్బంధం పెరగకుండా ఉండడానికి సమాజం ప్రజాస్వామిక దృక్పథం అరవర్చుకోవడానికి విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం తక్షణ అవసరం.

సరైన రాజకీయ అవగాహన పెంపొందించుకున్న విద్యార్థులు సామాజిక చైతన్యంతో ప్రజా ఉద్యమాలు చేసేవారు. సాంప్రదాయక రాజకీయాల్లో కూడా రాజకీయ నాయకులుగా ఎదిగి అంతో ఇంతో నైతిక విలువలు కలిగి ఉండి కొద్ది మేరకైనా ప్రజలకు సేవ చేసేవారు. కానీ నేడు పార్లమెంటులో గాని, రాష్ట్రాల్లో గాని ఎంపీ లుగా, ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతున్నటువంటి రాజకీయ నాయకులలో బడా కార్పొరేటు, పెట్టుబడిదారులు, వ్యాపారులు, కార్పొరేట్‌ విద్యా సంస్థల యాజమాన్యాలు ఉండడాన్ని మనం గమనించొచ్చు. దీని ద్వారా భారత పార్లమెంటరీ వ్యవస్థ రోజురోజుకు ఎంత దిగజారి పోతుందో మనం చూడవచ్చు.

రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత

రాష్ట్ర ప్రభుత్వం, విశ్వవిద్యాలయ పరిపాలనలు లింగ్డో కమిటీ మార్గదర్శకాల ప్రకారం వెంటనే ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించాలి. అదే విధంగా యూజీసీ మార్గదర్శకాల ప్రకారం అటానమస్ కాలేజీలకు సొం తంగా ఆయా కాలేజీలు యూనివర్సిటీలు ఎన్నికలు నిర్వహించుకునే అధికారం ఉంది. ఎన్నికలు నిర్వహించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఎన్నికల నిర్వహణకు అవసరమైన వనరులు, భద్రత, పారదర్శకతను కల్పించాలి.

విద్యార్థి సంఘాల ఎన్నికలు విలాసం కాదు – హక్కు. ప్రజాస్వామ్యా నికి పునాది. అది విద్యార్థి దశలోనే పడాలి. తెలంగాణలో అన్ని విద్యా సంస్థల్లో వెంటనే విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించడం కాలాను గుణ అవసరం. విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల గొంతుక వినిపించడానికి సాధ్యమవుతుంది. ఈ ప్రజా స్వామికమైన డిమాండ్‌ను అమలు చేయాలని PDSU రాష్ట్ర కమిటీ ఆధ్వ ర్యంలో హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఫిబ్రవరి 3న రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తునాము. విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్న ప్రజాస్వామికవాదులు, మేధా వులు, విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు పాల్గొంటారు.

పందిరి మహేష్‌
పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News