Telangana School Textbooks Quality: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పాఠ్యపుస్తకాలపై ఎన్నో అభ్యంతరాలు ఉన్నాయి. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత తరగతుల వాచకా లలో నాణ్యత, గుణాత్మకత, బోధనా సౌలభ్యం, అభ్యసన అనుకూలత ఏమాత్రం లేదు. తెలంగాణ యాసను భాష అని భ్రమింప చేసి ప్రతి పాఠం లో యధేచ్ఛగా తెలంగాణ యాసను వాడారు. భాషకు యాసకు భేదం తెలియకుండా రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణా సంస్థలో అధికారుల అండ తో 25 సంవత్సరాలుగా సంస్థను నిర్వీర్యం చేశారు. ప్రజా ఖజానాకు గండి కొట్టారు.
రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణా సంస్థను భ్రష్టు పట్టించారు. అది ప్రభుత్వానికి తెల్ల ఏనుగులా తయారయ్యింది. విషయ నైపుణ్యం, బోధన సామర్థ్యం, క్షేత్ర అనుభవం గల ఉపాధ్యాయులకు, కవులకు, రచయితలకు కరువు ఏర్పడింది. ప్రాథమిక విద్య పునాదులను గట్టి పరచకుండా విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడం దుర్లభం.
మన తెలుగు వాచకాల్లోని పాఠాల ఉదాహరణలు
అక్షర సారూప్య పద్ధతి అంటూ ఒకటవ తరగతి పాఠం మొదలుపెట్టా రు. అందులో కొన్ని వాయిద్యాల పేర్లు చెప్పమని ప్రశ్నలు, వాటిని అనుక రించమని ఆదేశాలు. ఏడవ తరగతి తెలుగు వాచకంలో రెండవ పాఠం నాయనమ్మ. అస్తవ్యస్తమైన, అభూత కల్పనలతో కూడిన పాఠం. పాఠంలో సభ్యత, సంస్కారం, గౌరవం ఏమీ లేదు. ముసలమ్మ నడుము విరగ్గొట్టి ఆసు పత్రి పాలు చేశారు. ఈ పాఠాన్ని అధికారులు సమర్ధించారు. ఇదేమి చోద్యం?
దాశరథి కృష్ణమాచార్యుల పాట “ఈ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాగ్నులు ఎన్నో? ఈ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో?” ఈ పాఠానికి వైవిధ్యం గల రచయితల బృందం “?” శీర్షిక పెట్టారు. పిల్ల వాడు అక్కడ శీర్షికను పెట్టాలట. అది సరైనచో ఎందుకు సరైంది? ఒకవేళ తప్పయితే ఎందుకు తప్పయిందో? చెప్పాలట. ఎఱ్ఱన నృసింహ పురాణం పాఠం వినతి కద్రువ. దాంట్లో పుత్రోత్సాహం సుమతి పద్యం. పొంతనలేని పాఠం. భారతీయ విద్యా భవన్ స్కూల్ ఆరవ తరగతిలోని ఒక పాఠం.. తాతయ్య మనవడు.
దూరదర్శన్‌లో ఒక పిల్లవాడు అభ్యంతకరంగా వస్తువు లను విసిరివేస్తూ హంగామా సృష్టిస్తున్నాడు. తాతయ్య వాని ప్రవర్తన గురిం చి మనుమనికి నీతులు చెప్పడం. లక్ష్యాలు ఏర్పరుచుకోవడం, ఇతివృత్తం ఎంపిక, విషయ ప్రదర్శన, విషయ క్రమత, అభ్యసన భావాల ఎంపిక, వాటి వ్యవస్థీకరణ, మూల్యాంక నం చేయడం అనేది ఒక పాఠ్యపుస్తక రచనలో క్రమానుగతంగా జరగాలి. కానీ పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్టు ఏ పాఠం సరిగ్గా లేదు. ఇదెక్కడి అన్యాయం?
ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వాచకాలలో ఎన్నో ఎన్నెన్నో అవలక్ష ణాలు. గతంలో అవ్వ బువ్వ, పులిగిలి, బడికి వోత, ఆరోగ్య వారోత్సవాలు అన్ని పాఠాల్లో కూడా అమానవీయ దృక్పథమే. ఇలాంటి పాఠాలు రాస్తే తెలుగు భాష అభివృద్ధి ఎలా పెరుగుతుంది? ఇప్పటికే తెలుగు భాష అంపశ య్యపై ఉంది. దీన్ని రక్షించేవారు ఎవరు?
తెలుగు మాతృభాష, తెలుగు ప్రాంతీయ భాష, తెలుగు ప్రథమ భాష, తెలుగేతరులకు రెండవ భాష, తెలుగు మూడవ భాష. తెలుగు తేట తెలుగు. తెలుగు బోధనా మాధ్యమం. తెలుగు అధికార భాష. తెలుగు ప్రాచీన హోదాను సంతరించుకున్న భాష. తరతరాల మన వారసత్వ నిధి తెలుగు భాష. మన సంస్కృతి సభ్యతలకు ఆలవాలమై పట్టుకొమ్మగా నిలిచిన మన తెలుగు భాష సులభమైన, సరళమైన, సుమధురమైన, తేనెలొలుకు మన తెలుగు భాష ఉభయ రాష్ట్రాలలో వివక్షకు గురవుతుంది.
తెలుగు వద్దు ఆంగ్లం ముద్దు అంటూ తల్లిదండ్రులు ఆంగ్లానికి వంత పాడుతున్నారు. పిల్లలు రెంటికి చెడ్డ రేవళ్లుగా తయారవుతున్నారు. వాచక రచన అంటే అల్లాటప్పా కాదు. ఆషామాషీ కార్యక్రమం కాదు. ఒక పవిత్ర యజ్ఞం. విద్యా ర్థి వయస్సు, పరిణతి, భావోద్వేగ సమీకరణలు, భాషా స్థాయి, భావ స్థా యి, అభిరుచి, ఆసక్తి, అవధానం, కుటుంబ నేపథ్యం, పరిసరాల ప్రభావం అన్నింటి సమ్మేళనం.
ఈ వ్యాస రచయితను 1994లో ఇంగ్లాండులోని లీడ్స్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయానికి పాఠ్యపుస్తక సామాగ్రి తయారీలో శిక్షణ కోసం ఉమ్మ డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు నెలల డిప్యూటేషన్‌పై పంపించారు. ఈ కృత్యాత్మక పద్ధతి, క్రీడా పద్ధతి ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం లోని ఆరు సూత్రాలను, 1986 నూతన విద్యా విధానంలోని 10 మౌలికాం శాలను పాఠ్యపుస్తకాలలో జోడిస్తూ ప్రొఫెసర్ ధవే కనీస అభ్యసన స్థాయిలో యశుపాల్ కమిటీ భారం లేని విద్యను పొందుపరిచి ఒకటి, రెండు తరగ తుల పాఠ్యపుస్తకాలను రూపొందించారు. “ఆచార్యుడు ఆనందామయుడు విద్యాశాల వినోదారామం” అనే భావన కలుగజేసి, అందులో సమ్మిళితం చేసి తొమ్మిది ఉపవాచకాలను కూడా సృజించడం జరిగింది. ఆ వాచకాలు నభూతో నభవిష్యతి. 14 ఏళ్ల పాటు నిరాటకంగా నడిచాయి. అక్షర సారూప్య పద్ధతిని తృణీకరించి అమ్మతో మొదలుపెట్టిన ఆ పాఠ్యపుస్తకాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజాజీ, ఐఏఎస్ అధికారులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థుల మన్ననలను పొందాయి.
కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రతిపాదించిన విద్యా ప్రణాళిక ప్రస్తుత విద్యా విధానంలో ఒక మైలురాయి. 5 + 3 + 3 + 4 అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబెట్టడానికి భారతదేశానికి ఇది ఒక సువర్ణ అవకాశం. ఈ విద్యా ప్రణాళికలో బౌద్ధారామాలు, ఆశ్రమాలు, పీఠాలు, తక్షశిల, నాగా ర్జున, అమరావతి లాంటి విశ్వవిద్యాలయాలు, గార్గీ మైత్రేయి, చరకుడు, వరాహమిహిరుడు లాంటి మేధావులను, చరిత్ర ప్రసిద్ధిగాంచిన మహా పురు షులను ఒకసారి మననం చేసుకున్నారు.
సరికొత్త విద్యా ప్రణాళికను ప్రవేశపెట్టడానికి ప్రతి విద్యావంతుడు మనసా, వాచా కర్మణ పని చేయాలి. మౌలిక విద్యాంశాల పట్ల సరైన అవగాహన కలిగిన క్రియాశీలుడు చైతన్యఝరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనోవాంఛితం నెరవేర్చడానికి అశేష తెలంగాణ ప్రజలు సహకరిం చాలి. విద్యా మూల్యాలను పరిరక్షించాలని ఆశిస్తూ…
డా. సరోజన బండ
(రిటైర్డ్ ప్రొఫెసర్)

