భారత రాజకీయాల్లో అనివార్య పునరావృతం బాబా సాహేబ్ అంబేద్కర్ ఆలోచనా విధానం. తన జీవితాచరణే అశేష పీడిత జనావళికి సందేశంగా ఇచ్చిన మహానీయుడాయన. తాను చూపిన మార్గాన్ని అనుసరించి సరికొత్త రాజకీయ సిద్ధాంతాన్ని అమలు చేసిన ఆచరణవాది మాన్యవర్ కాన్షీరాం. భారతీయ ఆత్మను అర్థం చేసుకున్న మేధావి, నాయకులు అంబేద్కర్. స్వాతం త్రోద్యమ కాలంలో మన దేశం నుండి కేవలం ముగ్గురు నాయకులు మాత్రమే ప్రపంచానికి తెలుసు. గాంధీ, నెహ్రు, అంబేద్కర్. భారతీ య సమాజపు నిచ్చిన మెట్ల కుల వ్యవస్థలో అట్టడుగు నుండి వచ్చి ఈ దేశ ప్రజలకు దిక్సూచీ అయ్యారు. భారత రాజ్యాంగం ద్వారా కొత్త జీవితాన్ని ప్రసాదించారు. సరికొత్త జీవన్మార్గాలను బహుజనుల ముందు ఉంచారు. హక్కుల కోసం పోరాటం చేయాలని నేర్పిం చారు. రాజ్యాధికారం లేని జాతులు అంతరించి పోతాయని హెచ్చ రించారు. వాస్తవానికి 1952 తొలి సాధారణ ఎన్నికల్లో తెలంగాణ నుండి తాను స్థాపించిన పార్టీ ద్వారా అభ్యర్థులు గెలుపొందారు. అప్పుడే దళితుల్లో చైతన్యం తీసుకొచ్చారు. వెనుకబడిన తరగతుల ప్రజలను జాగృతం చేసేందుకు బాటలు వేశారు. తెలుగు నేలకు అంబేద్కర్‌కు విడదీయలేని అనుబంధం ఉన్నది. అటు ఆంధ్ర ప్రాం తా నికి, ఇటు మన హైద్రాబాద్ నగరానికి బాబాసాహేబ్ వచ్చారు. తన రాజకీయ ఆలోచనను అందించారు. అప్పట్లో అతి కొద్దిమంది మాత్రమే ఆయనను అనుసరించారు. ఆ తర్వాత అదే ఒక ప్రవాహం అయింది. వర్తమానంలో అదో మహాజనచైతన్య ప్రవాహంగా మారు తూ ఉన్నది. భారత దేశపు రాజకీ చర్చలో ఇప్పుడు ఆయనో అని వార్య చైతన్యం. ఈ విషయంలో తెలుగు నేల ఓ అడుగు ముందుగా ఉంది.
బోధించు. సమీకరించు. పోరాడు. ఈ విషయాలను అంబే ద్కర్ చెప్పారు. తన జీవితంలో ఆచరించారు. దీన్నే ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారులు అందిపుచ్చుకున్నారు. తొలుత తెలంగాణ రాష్ట్ర ఉద్యమ భావవ్యాప్తి చేశారు. ఆ తర్వాత ప్రజలను సమీకరించారు. అనంతరం పోరాటం చేశారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. భారత రాజ్యాంగంలో ఆయన పొందుపర్చిన ఆర్టికల్ మూడు ద్వారా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడేందుకు ఆయన మార్గం చూపించారు. తెలంగాణ ప్రజల సుదీర్ఘకాలం ఆకాంక్షలను నెరవేర్చారు బాబాసాహేబ్. ఒక ప్రాంతం మరో ప్రాంతంపై, ఒక సామాజిక వర్గం మరో సామాజిక వర్గం పెత్తనం చెలాయించడాన్ని సహించేది లేదని ఆయన అప్పుడే తేల్చి చెప్పారు. మెజార్టీ పేరుతో ఇతరుల హక్కులను కాలరాయొద్దన్నారు. వర్తమా నంలో అంబేద్కర్ సిద్ధాంత ప్రభావాన్ని నేటి తరం చూస్తూ ఉన్నది. మునుపెన్నడూ లేనివిధంగా తెలంగాణలో అంబేద్కర్ మార్గం లో బహుజన రాజ్యం సాధిస్తామని వెనుకబడిన తరగతల ప్రజలు అంటున్నారు. ఉద్యమిస్తున్నారు. ఫూలే, పెరియార్, నారాయణ గురు, అంబేదర్క్‍లే తమకు ఆదర్శం అని చెప్తున్నారు. ఫూలేనే ఆదర్శంగా తీసుకుని అంబేద్కర్ బడుగుల జీవితాల్లో వెలుగులు నింపారు. ఇప్పుడు ఆయన చూపించిన దారిలో తెలంగాణ బీసీలు నడుస్తున్నారు. ఇదంతా మన కళ్ల ముందు కన్పిస్తున్న వర్తమాన దృశ్యం.
సమీపం గతంలోకి ఓ సారి తొంగి చూస్తే మరిన్ని విషయాలను మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు వీలు పడుతుంది. ఇం కింత సమగ్రత కూడా వస్తుంది. నేటి తెలంగాణ బహుజనులకు అంబేద్కర్ ఆలోచనా రాజకీయాలను పరిచయం చేసింది మాన్యవర్ కాన్షీరాం. 1984లో బహుజన సమాజ్ పార్టీ స్థాపించారు. సామా జిక పరివర్తన, ఆర్థిక స్వావలంబనను ఆధారం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో చారిత్రాత్మక విజయం సాధించారు. ఈ దేశంలోని అసంఖ్యాక విస్తృత ప్రజలకు కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. ఓటు ద్వారా అట్టడుగు ప్రజలు అధికారాన్ని ఏ విధంగా హస్తగతం చేసు కోవచ్చో నిరూపించారు. 1990ల్లో తెలుగు నాట కూడా ఆయన మంచి ప్రయోగం చేశారు. ఇక్కడా ఆధునిక రాజకీయ స్రవంతికి బహుజన రాజకీయ ఐడియాలజీని జోడించాలని ఆలోచించారు కాన్షీరాంజీ. దాని ద్వారా బాబాసాహేబ్ కలలు గన్న పీడిత రాజ్య స్థాపన చేయొచ్చని బలంగా నమ్మారు. ఆనాటి పత్రికలు తిరగేస్తే నాడు తెలుగునాట బహుజన్ సమాజ్ పార్టీ ప్రభావం ఎట్లా ఉండేదో సులభంగా అర్థం అవుతుంది. 1985ల తర్వాత తెలుగు నాట వచ్చిన సామాజిక ఉద్యమాలకు ప్రేరణగా నిలిచారు అంబేద్కర్. భారత రాజ్యాంగం ఇచ్చిన దన్ను, ధైర్యం బహుజనలకు మంచి చైతన్యాన్ని ఇచ్చాయి. అనంతరం తమకూ రాజ్యాధికారం కావా లనే దిశగా వారి అడుగులు పడ్డాయి. మూడు దశాబ్దాల కిందనే బలమైన ప్రయత్నం ఇక్కడ జరిగింది.
మరింత నిర్ధిష్టంగా చెప్పాలంటే తొలి సాధారణ ఎన్నికల్లో అంబేద్కర్ ఆలోచన రాజకీయ విజయాన్ని సాధించింది. అప్పట్లో తెలంగాణ నుండి ఆయన గెలుపొందిన విషయం సంచలనం కలి గించింది. ఆ తర్వాత మరో మూడు దశాబ్దాల కాలం తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ రూపంలో ఇక్కడ బాబాసాహేబ్ ఆలోచన ఇక్కడ సరికొత్త పాదులు వేసింది. తరం నుండి తరానికి బహుజన చైతన్యం కరచాలనం చేస్తూ వస్తున్నది. 1980ల తర్వాత ఉత్తరాదిన లోహియా, జయప్రకాశ్ నారాయణ్ వంటి వారి ఆలోచనతో కొత్త పార్టీలు వచ్చాయి. నిన్నా మొన్నటి వరకు తమ ప్రభావాన్ని చూపిం చాయి. కాల పరీక్షను ఎదుర్కొంటున్నాయి. దక్షిణాదినా కొన్ని పార్టీలు వచ్చాయి. శూద్రాగ్రవర్ణ ప్రభావంలో అవి ఉన్నాయి. బీ ఎస్పీ ప్రభావం కారణంగా అంటే పరోక్షంగా అంబేద్కర్ ఇచ్చిన చైతన్యం కారణంగా బీసీలను చట్టసభల్లోకి పంపించాయి. ఇదే సందర్భంలో అప్పుడు టీడీపీతో బీఎస్పీ పొత్తు పెట్టుకుని ఉంటే తెలుగు రాజకీయాల చరిత్ర మరోలా ఉండేది. కానీ అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఉత్తర, దక్షిణ భారత దేశాల్లో ఆచరణలోకి తీసుకొస్తున్నది బీఎస్పీ మాత్రమే.
ఇదంతా మన కళ్ల ముందు కన్పిస్తున్న చరిత్ర
వర్తమాన తెలంగాణలో బీసీ సామాజిక వర్గాల నుండి కొత్త గొంతులు విన్పిస్తున్నాయి. తామెంతో తమకు అంత అనే ప్రజాస్వా మిక డిమాండ్ ను సమాజం ముందు పెడుతున్నాయి. పూలే, పెరి యార్, నారాయణగురు, అంబేద్కర్, కాన్షీరాం మార్గంలో తాము ప్రయాణం చేస్తామని చెప్తున్నాయి. ఉద్యోగ విరమణ చేసిన అఖిల భారత సర్వీసు అధికారులు, రిటైర్డ్ జడ్జిలు చాలా బలంగా బహు జన వాదాన్ని విన్పిస్తున్నారు. ఎక్కడ బహుజనులకు అన్యాయం జరిగినా అంబేద్కర్ ఆలోచనను, భారత రాజ్యాంగాన్ని జనం ముందు ఉంచుతున్నారు. హక్కుల కోసం బిక్షం ఎత్తడం కాదు… పోరాడి సాధించుకుంటామని చెప్తున్నారు. పరిపాలనలో తమ వాటా తమకు కావాలని డిమాండ్ చేస్తున్నారు. బహుజనుల పోరాటం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని రుజువు చూపిస్తున్నారు. అందుకు బాబాసాహేబ్ అండ తమకు దొరకిందని చెప్తున్నారు. వ్యక్తులుగా, సంస్థలుగా, విడివిడిగా, కలివిడిగా బహుజనోద్యమాలు చేస్తున్నారు. ఈ సమూహాలు కొన్ని మౌళికాంశాలను పట్టించుకో వాల్సిన చారిత్రాకావసరం ఉన్నది. నాడు ప్రత్యేక తెలంగాణ ఉద్య మంలో అగ్రభాగాన ఉండి పోరాడింది బహుజనులే. నీళ్లు, నిధులు, నియామాకాలు తమకే దక్కాలని ఉద్యమించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పటిలాగే పెత్తందారి కులాలే అధికార పీఠంపై కూర్చున్నాయి.పెత్తందారీ కులాల భూములకే నీళ్లు పోతున్నాయి. నిధులదీ అదే దారి. రాజ్యాధికారం ఎవ్వరి చేతిలో ఉంటే వారే తమ వర్గాలను బాగు చేసుకుంటారు. ఈ సందర్భంలోనే బహుజన ఉద్యమాలకు, ఉద్యమకారులకు అండగా, దన్నుగా నిలబడుతూ ఉన్నది బహుజన్ సమాజ్ పార్టీ. భారత రత్న బాబాసాహేబ్ అంబేద్కర్ చూపించిన మార్గానుసారం ఏర్పడిన బీఎస్పీ యావత్ తెలంగాణ బహుజన సమాజపు ఆశలకు, ఆకాంక్షలకు ఆచరణ రూపమిచ్చేందుకు సిద్దంగా ఉన్నది. నీలి జెండా నీడలో ఏకం అవుదాం. అంబేద్కర్, మాన్యవర్ కాన్షీరాం ఆశయాలను సాధించు కుందాం. బడుగులకు రాజ్యాధికారం దక్కాలంటే అంబేద్కర్ ఆలోచన తప్ప మరో మార్గం లేదని పదే పదే రుజువు అవుతున్నది. బీఎస్పీ యావత్ బహుజన లోకానికి జైభీంలు చెప్తున్నది. రాజ్యా ధికారాన్ని సాధించేందుకు ఓటు పోరాటానికి ఆహ్వానిస్తున్నది. హక్కులు దక్కాలంటే అధికారం రావాల్సిందేనని మరో సారి గుర్తు చేస్తూ… జై భీం.
ఇబ్రాం. శేఖర్
బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు

