21వ శతాబ్దంలో విద్యార్థులను కేవలం మార్కుల యంత్రంగా పరిగణిస్తున్న తరుణంలో పిల్లలకు విద్యా విషయాల పట్ల అవగాహన కార్పొరేట్ విద్యా వ్యవస్థ ద్వారాను బట్టి చదువుల ద్వారాను వస్తుందనుకోవటం మన బ్రమ ఇలాంటి భ్రమల నుండి బయట పడేసి బాలల కోసం సులువైన పద్ధతులు ఆలోచింపచేసే విధంగా మంచి కవిత్వాన్ని అందించారు. దర్భశయనం శ్రీనివాసచార్య. ‘బాటసారి పదాలు‘ఈ కవిత్వం బాలల మనుసులను స్పృశిస్తూ, వారి జీవితాలకు ఒక అద్భుతమైన మార్గదర్శక నిలుస్తుంది. ఈ కవిత్వం చిన్నారులను ఉత్సాహంగా శ్రమను నమ్ముతూ పట్టుదలతో అధ్యయనం చేయడానికి ప్రోత్సహిస్తుంది.
సహజంగానే పలుకు/సరళంగానే బతుకు/సొగసులు దక్కును నీకు/ఓ బాటసారీ! అంటూ సరళమైన భాషతో, చిన్నారులకు అర్థమయ్యే విధంగా పదాలను వివరించారు. ఊపిరి నిచ్చేది అమ్మ/ఊయల అయ్యేది అమ్మ/తరగని ఆశీస్సు అమ్మ/ఓ బాటసారీ! ఆపిల్ అనడానికి ముందు/అరటి అనడం కడు పసందు/అమ్మ ఉన్నది తెలుగు నందు/ఓ బాటసారీ! ఆడకా పడకా/ఎగరకా తిరగకా/అదేమి బాల్యం ఇక/ఓ బాటసారీ!/ఆటలు లేని చదువులు/పాటలు నేర్పని బడులు/పిల్లలకవి ఎడారులు/ఓ బాటసారీ! పదాల అర్థాలను తెలుసుకోవడం ద్వారా చిన్నారులలో భాషాభివృద్ది జరుగుతుందని రచినిత గ్రహించి కవిత్వాన్ని అందించారు. సారముండని మాటెందుకు/జీవముండని పాటేందుకు/నీడలు ఉండనే బాటేందుకు/ఓ బాటసారీ! మొబైల్ ఒక విచిత్ర పరికరం/ మితంగా వాడితే శుభకరం/అతిగా వాగితే హానికరం/ఓ బాటసారీ! బడాయి పలుకు లెందుకు/పైపై పూతలెందుకు/సహజంగ పదముందుకు/ ఓ బాటసారీ! ప్రతి కవిత ఒక విలువను బోధిస్తుంది ఇది పిల్లల్లో మంచి విలువలను పెంపొందిస్తుంది. పొలాలకు దండం పెట్టు/రైతులకు హారతి పట్టు/పల్లెలకు పట్టం కట్టు/ఓ బాటసారీ/అరణ్యం మన మొదటి ఇల్లు/అక్కడే పట్టాము విల్లు/వీరత్వం మనకే చెల్లు/ఓ బాటసారీ! ఆదివారం సొగసైనది/విరామానికి సరియైనది/ఓ బాటసారీ! చల్లని గాలులు వీస్తుంటే/వెచ్చని తీసేవిస్తుంటే/ఉల్లాసం మపుడు నీ వెంటే/ఓ బాటసారీ! దాన్యమిచ్చే రైతుకు/దక్కకపోతే మెతుకు/దండగ కదా మన బతుకు/ఓ బాటసారీ! గెలుపు హారం కొరకు/నిలిచి ఎదురు చూడకు/బతుకు నడకనాపకు/ఓ బాటసారీ! ఆశ ఉంటే అది చాలు నా/ఆచరణ ఉండాలి చానా/అప్పుడే దక్కు నజరానా/ఓ బాటసారీ! పద పద అను పట్టుదల/సాధనతో ఎదుగుదల/నెరవేరు ప్రతి కల/ఓ బాటసారీ/ఓటమితో కలతెందుకు/ఓరినితో పద ముందుకు/బతుకు క్రాంతి పొందేందుకు/ఓ బాటసారీ! ఈ కవిత్వం ద్వారా రచయిత బాలలలో నిజాయితీ, కర్తవ్యం, సహకారం వంటి విలువలను అలవర్చుకునేలా సూచనలు చేశారు. గాలి కొరకు కిటికీ తెరువు/పూల కొరకు వాకిలి తెరువు/చెలిమి కొరకు యెదనే తెరువు/మనం హాయిగా బతకాలి/అయితే వనమూ బతకాలి/వనం లేదా? మనం ఖాళీ!/ఓ బాటసారీ! ఎవరో వేసిన దారి/ఎందరికో రహదారి/మొక్కవోయి ఒకసారి/ఓ బాటసారీ! చెట్టు సొగసుల్నికను/కోయిల పాటను విను/వాటికి జై జై అను/ఓ బాటసారీ! స్నేహం, సేవ, పర్యావరణ ప్రేమ, సంస్కారం, వంటి విలువలను బాటసారి పదాల ద్వారా చక్కగా వర్ణించారు. బతుకు ఉత్సాహంగా/ఉరికే ఉడత లాగా/కాలం వెంట రాగా/ఓ బాటసారీ! నేర్పుతో ఏ జ్ఞానమైన/నేర్చుకుంటే ఇక చాలునా/నేర్పు దానిని ఒకరికైనా/ఓ బాటసారీ! చిరునవ్వే ఒక పువ్వు/అడగక మునిపే ఇవ్వు/విరబూయు మరో నవ్వు/ఓ బాటసారీ! వర్షం కురిసే వేళ/చినుకుల నెలవీనెల/తళ తళ సొగసుల హేల!/ఓ బాటసారీ!/చుక్కల్ని లెక్కించగలమా/చినుకులెన్నో తేల్చగలమా/బతుకు ఇంతని చెప్పతరమా/ఓ బాటసారీ! నిజం కానీ కాకపోని/కలలు నీలో కదలాడనీ/కళకళ నీలో నింపనీ/ఓ బాటసారీ! చిన్నప్పటి పాలు పాటలు/పెద్దయ్యాక జ్ఞాపకాలు/దారిని చూపే దీపాలు/ఓ బాటసారీ! వాణ్ణి కొట్టి, వీణ్ణి కొట్టి/కోట్ల కొద్ది కూడా పెట్టి/కన్నుమూస్తే కడకు మట్టి/ఓ బాటసారీ! బతుకే ఓ గొప్ప వరం/చావదు కోరి ఎవరం/చేద్దాము బతికి సమరం/ఓ బాటసారీ! ప్రతిరోజు ఓ కానుక/బ్రతుకంతా ఓ వేడుక/కావాలని మన కోరిక/ఓ బాటసారీ! సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగా తయారు చేయడానికి రచయిత ఈ కవిత్వం ద్వారా బాలలకు జ్ఞానాన్ని విజ్ఞానాన్ని పంచారు.ఈ పుస్తకం, చిన్నారులను ఉత్సాహంగా, శ్రమను నమ్ముతూ, పట్టుదలతో అధ్యయనం చేయడానికి ప్రోత్సహిస్తుంది.
రచయిత భాష పట్ల ఉన్న ప్రేమను పదాల ద్వారా చక్కగా వ్యక్తపరిచారు. పదాలను విశ్లేషిస్తూ, వాటిలోని లోతైన అర్థాలను బయటపెట్టారు. సరళమైన భాషతో, చిన్నారులకు అర్థమయ్యే విధంగా పదాలను వివరించారు. పదాల అర్థాలను తెలుసుకోవడం ద్వారా చిన్నారుల భాషాభివృద్ధి జరుగుతుంది.
పదాలను విశ్లేషించడం ద్వారా చిన్నారుల ఆలోచనా శక్తి పెరుగుతుంది చిన్నారులు తమ జీవితంలో విలువలను నేర్చుకోవాలని కోరుకునే ప్రతి చిన్నారి ఈ పుస్తకం చదవవచ్చు.తల్లిదండ్రులు తమ పిల్లలలో మంచి విలువలను పెంపొందించాలని కోరుకునే తల్లిదండ్రులు ఈ పుస్తకం ద్వారా తమ పిల్లలకు మార్గదర్శనం చేయవచ్చు.ఉపాధ్యాయులుతరగతి గదిలో భాషాభివృద్ధి మరియు విలువల బోధన కోసం ఈ పుస్తకం ఉపయోగపడుతుంది.
‘బాటసారీ‘ పదాలు‘ పుస్తకం, చిన్నారుల మనసులకు ఒక అద్భుతమైన కానుక. ఈ పుస్తకం చదివిన ప్రతి చిన్నారి తన జీవితంలో ఒక మంచి మార్పును తీసుకురాగలుగుతారు. బతుకు భరోసానిచ్చే బాటసారి పదాలు అంటూ చక్కనైన ముందుమాటను అందించారు చంద్రశేఖర శాస్త్రి. ఈ చిన్ని కవితల పుస్తకం భావితరపు బాలల భవిష్యత్తుకు బాటలు వేస్తుంది.
కవి సాహితీ విశ్లేషకులు
పూసపాటి వేదాద్రి
9912197694