Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Telugu literature: గంధపు కవితల సుగంధం జిందం అశోక్‌ వర్గమూలాలు

Telugu literature: గంధపు కవితల సుగంధం జిందం అశోక్‌ వర్గమూలాలు

ఏ వృత్తి చే పట్టి ఆ వృత్తిలో ముందుకు సాగుతున్నవ్యక్తికి ఆ వృత్తిలోని సాధక బాధకాలు, వృత్తి గౌరవం, వృత్తిలో ఉన్న ఆనందం, కష్ట నష్టాలు, చేపట్టిన వృత్తిని దైవంగా భావించే ప్రతి వ్యక్తికి ఇవి అను భవైకవేద్యాలే. అటువంటి కోవకు చెందిన, మానేరు మట్టి సువాసనలు కవితా లోకానికి వెదజల్లేరాజన్నసిరిసిల్ల జిల్లాలో గణిత ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న జిందం అశోక్‌ ఈ మధ్య రాసిన కవితా సంపుటి వర్గమూలాలు. మానేరు రచయితల సంఘం, రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంక్షేమ సంఘం ఉమ్మడి ఆధ్వర్యంలో ముద్రించిన ఈ కవితా సంపుటి జనవరి 2023న ముద్రించారు. ఈ కవితా సంపుటి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్థిక సహాయంతో ప్రచురించబడింది. అన్నవరం శ్రీనివాస్‌ వేసిన కవర్‌ పెయింటింగ్‌ అద్భుతంగా ఉంది. ఈ కవితా సంపుటిని తన జీవన సహచరి శ్రీలేఖకు అంకితం ఇచ్చారు. డాక్టర్‌ వెల్దండి శ్రీధర్‌ దీనికి లోతైన ముందుమాట రాశారు. తప్పు లేకుండా తక్కువ సమయంలో ప్రూఫ్లు చూసి ఇచ్చిన మిత్రు లు నర్ర అంజన్‌రెడ్డి, కుంబాల రమేష్‌రెడ్డిలు అభినంద నీయులు.

- Advertisement -

2005 నుండి 2022 వరకు రాసిన ఈ కవితా సంపుటి లో తెలుగు వర్ణమాలలో ఉన్న 56 అక్షరాలవలే జిందం 56 కవితలు ఇందులో ఉన్నాయి. ఒక్కో కవిత దేనికదే ప్రత్యేకం. వీటిలో విభిన్నమైన కవితాంశాలున్నాయి. ప్రపంచీకరణవల్ల అన్ని కులవృత్తులు నామరూపాల్లేకుండా క్షీణించిపోవడం, మంటగలిసిన మానవ సంబంధాలు, బంధాలు అనుబంధా లకు అర్థాలే మారిపోవడం, నాటి మలిదశ తెలంగాణ పోరా టాన్ని గుర్తుకు తెచ్చే కవితలు, ప్రపంచీకరణ వల్ల తగ్గిపో తున్న మనిషితనం, మంటగలుస్తున్న మానవ సంబంధాలు, రాజకీయ కుట్రలు, వారి కుటిల నీతిని, దోపిడీని కళ్ళకు కట్టేలా కవితలు రాయడం జిందం అశోక్‌ చేసిన సాహసోపే తమైన చర్యగా అభివర్ణించవచ్చు. ఉపాధ్యాయ వృత్తిలోని సాధక బాధకాలు, వృత్తి గౌరవం, అధ్యయనంచేసి పోరాడా లని విద్యార్థులకు ఉపదేశాలు, ఇవన్నీ ఆయన కవితా శీర్షికలుగా మనకు దర్శనమిస్తాయి.

ఇప్పుడు మచ్చుకు కొన్ని కవితల్ని వాటిలోని ఆత్మను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

‘నేను ఓ సేద్యగాన్ని

అక్షరాలను నాటుతున్నా

నిస్వార్థ భావజాలం..

కవిత్వమే అంకురిస్తుంద0టాడు. రైతు వ్యవసాయం చేసి వడ్లను పండించి లోకపు ఆకలి బాధ తీర్చినట్లు, కవిగా తాను అక్షరాలను నాటి నిస్వార్థమైన భావజాలంతో కవి త్వమై మొలకెత్తుతానని అంటాడు.

జకమొక అని ఉండాల్సిన కవిత శీర్షిక జకముక అని ఉండడం అచ్చు తప్పుగా మనము భావించవచ్చు. ఇట్లాంటి పొరపాట్లను రానున్న తన కవితా సంపుటాలలో జరగ కుండా చూస్తారని మనం ఆశిద్దాం. మరో కవితలో నిర్మాణా త్మక ఆలోచన విధానాలతో పక్షులు, జంతువులు దళాలుగా ఏకమవుతున్నాయనే భావనను మనుషులమైన మనం వాటి లాగా కలిసిమెలిసి ఉండలేకపోతున్నామని విచారాన్ని వ్యక్తం చేస్తాడు. వాటిని చూసి సంఘటితాన్ని నేర్చుకోమని ఉద్బోధిస్తాడు. ఆశావాద దృక్పథాన్ని రేకెత్తించే ‘అంకుర0‘ లాంటి కవితలు కూడా ఇందులో ఉన్నాయి.

‘పీకల దాక తాగడం, పెలికల్ని కట్టుకోవడం అత్యాధు నిక కళాపోషణ’ అంటూ మద్య పానం చేయవద్దన్న హితవు, ఆధునిక కాలపు వస్త్రధారణల తీరును వ్యంగ్యంగా, ధ్వని పుర్వకంగా చిత్రించారు. ‘ఎరుక’ కవితా శీర్షికలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కరెంటు కోతల వల్ల రైతులు పడ్డ కష్టాన్ని కవిత్వీకరించారు. నాటి చీకటి రోజులు పోయి రైతన్నల జీవితాలు వెలుగులు నిండాలని ఆకాంక్షిస్తాడు. స్వతహాగా ఉపాధ్యాయుడైన అశోక్‌ తరగతి గది, విద్యానందం, ఆట పాట, తదితర కవితలు రాసి ఉపాధ్యాయ వృత్తిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

నాటి ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పా టుకు ఉద్యోగులు ఉపాధ్యాయులు విద్యార్థులు సబండ వర్ణాలు ఉద్యమించిన తీరును, సకలజనులు చేపట్టిన వివిధ ఉద్యమ దశలను అద్భుతంగా చిత్రీకరించారు. ప్రపంచీ కరణ దెబ్బకు

కుదేలైన నేత, వ్యవసాయం, కల్లుగీత , చేపలు పట్టుట, తదితర కులవృత్తుల క్షీణత్వాన్ని అక్షరీకరించిన తీరు బావుంది.

1)అదృశ్య కిరణాలు కవితా సంపుటి (2000)

2) మానేరు నానీలు-నానీల సంపుటి(2006)

3) ఎనగర్ర- కవితా సంపుటి2006

4) పెద్ద గడియారం-, సంపాదకత్వం2007

5) గవ్వలు -కవితా సంపుటి2017

6) చుక్క పొద్దు -దీర్ఘ కవిత2019

7) చెమట పాదాల నడక సంపాదకత్వం

ఇన్ని రాసిన జిందా అశోక్‌ కవిత వాక్యాలు అక్కడక్కడ వ్యాసంలోని వాక్యాలుగా ఉన్నాయి. బాబు కవిత సంపు తాను పరిణతి చెందిన కవిగా, మానేరుగడ్డ నుంచి వస్తున్న మట్టికవిగా పరిణతి చెంది కవిత్వాన్ని సుసంపన్నం చేస్తాడని ఆకాంక్షిద్దాం.

– డాక్టర్‌ మోతుకుల నారాయణగౌడ్‌

రాజన్న సిరిసిల్ల జిల్లా

9703903293

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News