Sunday, November 10, 2024
Homeఓపన్ పేజ్Telugu Literature: తెలుగు సాహిత్యంపై అభ్యుదయ కవిత్వోద్యమ ప్రభావం

Telugu Literature: తెలుగు సాహిత్యంపై అభ్యుదయ కవిత్వోద్యమ ప్రభావం

తెలుగు సాహిత్యంలో వచ్చిన అనేక ఉద్యమాలలో (భావకవిత్వం, విప్లవ కవిత్వం, స్త్రీవాద కవి త్వం, దళితవాద కవిత్వం, సంస్కరణోద్యమం, జాతీయో ద్యమం, హేతువాద ఉద్యమం, కాల్పనిక కవిత్వోద్యమం, మైనారిటీ కవిత్వోద్యమం మొదలైనవి). అభ్యుదయ కవి త్వోద్యమం తెలుగు సాహిత్యంపై అత్యంత, అత్యధిక కాలం ప్రభావం చూపింది. ఇది 1930 సంవత్సరంలో తెలుగు సాహిత్యంలో ప్రవేశించింది. ఈ ఉద్యమానికి నేప ధ్యం మార్క్సిస్టు సిద్ధాంతం. కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు, త్రిపురనేని రామస్వామి చౌదరి గారి హేతువాద దృక్పధం, చిలకమర్తి లక్ష్మి నర సింహం, గరిమెళ్ళ సత్యనారాయణ (మాకొద్దీ తెల్ల దొర తనం) లాంటి మహామహులపై దీని ప్రభావం పడింది. సాహిత్యంలో దీనికి పూర్వ రంగమే జాతీయోద్యమ దృక్ప ధంతోనే అభ్యుదయ కవిత్వోద్యమం ఆవిర్భవించిందని చెప్పాలి.
ప్రపంచవ్యాప్తంగా వచ్చిన రాజకీయ మార్పుల వల్ల దాని ఫలితాలు ఇతర దేశాలపై కూడా ప్రభావం చూపా యి. ముఖ్యంగా ప్రాశ్చాత్య దేశాలలో వచ్చిన సాంస్కృతిక పునర్జీవనం, మత సంస్కరణ ఉద్యమం, పారిశ్రామిక విప్లవం, అదే విధంగా 1917లో వచ్చిన రష్యా విప్లవం ఇతర దేశాలపై అత్యధికంగా ప్రభావం చూయించింది. 1930వ సంవత్సరంలో కారల్‌ మార్క్‌, ఎంగెల్స్‌, లెనిన్‌, మాక్సింగోర్కిల రచనలు తెలుగులోకి అనువాదించ బడ్డాయి. అవి చదివిన యువత ప్రభావితం కావటం మొద లైనది అలాగే 1935 సం.లో పారిస్‌లో ప్రపంచ రచయి తల సదస్సు జరిగినది. అదేవిధంగా మన దేశంలో 1935 లోనే (బ్రిటీష్‌ వారి కాలంలోనే) భారత అభ్యుదయ రచయి తల సంఘం ఏర్పాటైనది. అప్పటికే దీనికి సమాంతరంగా దేశంలో జమిందారి వ్యతిరేక ఉద్యమం, తెలంగాణలో నిజాం వ్యతిరేక ఉద్యమం, దేశవ్యాప్తంగా ఆయా చోట్ల వచ్చిన స్థానిక ఉద్యమాలు అభ్యుదయ కవిత్వోద్యమానికి బాటలు వేశాయి.
1936 ఏప్రిల్‌ 9,10 తేదీలలో లక్నోలో మున్షి ప్రేం చంద్‌ అధ్యక్షతన అఖిల భారత అభ్యుదయ రచయితల ప్రధమ మహాసభలు జరిగాయి. అలాగే 1936లోనే స్పె యిన్‌ అంతర్యుద్ధంలో అనేక దేశాల కవులు కళాకారులు పాల్గొని ఒక కూటమిగా ఏర్పడ్డారు. వెరసిపై సంఘటన లన్ని కూడా మనదేశ సాహిత్యంపై ప్రభావం చూపాయి. ముఖ్యంగా తెలుగు సాహిత్యంపై కూడా ప్రభావం చూపా యి. అభ్యుదయం అనే మాటకు మంగళం, శుభం అనే నిఘంటు అర్ధాలు ఉన్నాయి. ప్రోగ్రెస్‌ (Progress) అన్న ఆంగ్ల పదానికి సమానార్ధకంగా అభ్యుదయం అనే పదాన్ని వాడుతారు. దీనికి పురోగమనం, ప్రగతిశీలం అనే అర్ధాన్ని చూడవచ్చును. తెలుగు సాహిత్యంలో సామాజిక చైతన్యం, శ్రామికజన పక్షపాతం, వాస్తవికత, పీడితజన పక్షం, సమ సమాజ నిర్మాణం మొదలైన అంశాలను అభ్యుదయ కవి త్వోద్యమం ద్వారా ప్రవేశపెట్టబడినాయి.
అభ్యుదయ కవిత్వం నిర్వచనాలు
1) పీడింపబడే వాళ్ళు, పీడించే వాళ్ళు ఉన్న ఈ వర్గ సమాజం ఉండాలని ఎవరూ కోరరు. రానున్న విధానంలో సాధారణ మానవుడే మకుటదారి. పురోగమిస్తున్న లోకా న్ని ప్రతిఘటింపజూచేవారు ఎప్పుడు అభ్యుదయ వాదులు కాజాలరు. ఇది మనసులో పెట్టుకొని వ్రాసేదే అభ్యుదయ రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి.
2) సాహిత్యం ఒక భోగ వస్తువుగా పరిగణించే దృక్ప ధం మీద వీరు తిరగబడుతున్నారు. నేటి రచయితకు ప్రజ లే ప్రమాణం కొన్ని కారణాల వల్ల సాహిత్యానికి దూరమై పోయిన ప్రజల జీవితాలను మళ్ళి సారస్వతోన్ముఖంగా తెల్పటానికి నేటి రచయితలు పాటుపడుతున్నారు శ్రీశ్రీ.
3) అభ్యుదయ రచన సమకాలికమైన జీవిత పరిస్థితు లకు రాజకీయ వాతావరణానికి, ఆర్ధిక సమస్యలకు, సమా జ సంఘర్షణ, నైతిక సందర్భాలకు వైజ్ఞానికి విశేషాలకు అనుగుణ్యంగా, అనుకూలంగా తగినట్టి అవసరమైన మార్పులతో విలసిల్లవలెను పి.వి.రాజమన్నారు.
పై మూడు నిర్వచనాలను బట్టి అభ్యుదయ కవిత్వో ద్యమం గూర్చి ఒక అభిప్రాయానికి రావచ్చును. ఇక్కడ స్థూలంగా పీడింపబడే వారు, ఒక వర్గంగాను, పీడించే వారు మరొక వర్గంగాను సమాజం విభజితమైపోవటం ఫలితంగా వచ్చేటటువంటి వర్గ పోరాటం లేదా వర్గ సంఘ ర్షణ (Class Conflict) (Class Division) తద్వారా హక్కుల కోసం పీడింపబడేవారు, పీడిస్తున్నవారిపై తిరుగు బాటు చేయటం జరుగుతుంది. చివరికి పీడింపబడిన వారికి రాజ్యాధికారం చేజిక్కటం జరగవచ్చును. ఉదా: తెల్ల వారిపై భారతీయులు తిరగబడి అధికారం హస్తగతం చేసు కొని విముక్తి పొందటం, అలాగే వివిధ దేశాలలో వచ్చిన తిరుగుబాట్లు, 1917లో రష్యా విప్లవం జార్‌ చక్రవర్తుల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, అలాగే 1789లో ప్రాన్స్‌ లో వచ్చిన ఫ్రెంచి విప్లవం కూడా అలాంటిదే.
అభ్యుదయ కవిత్వ సిద్ధాంతాలు
1) కవిత్వంలో వాస్తవికత ప్రధానంగా ఉండాలి ఆధ్యాత్మిక, ఆదర్శవాద/ కాల్పనిక భావజాలానికి చోటు ఉండకూడదు.
2) వ్యక్తి చైతన్యం కంటే సామూహిక/ సామాజిక చైతన్యం కల్గి వుండాలి, అలాగే కవిత్వం ప్రజలను ఉత్తేజ పరిచేలా ఉండాలి.
3) పేదరికం, ఆకలి, సామాజిక అసమానతలు కవితా వస్తువులు కావాలి. కవి ఎప్పుడు పేదలు, పీడితుల వైపు నిలబడాలి.
4) కవిత్వం వర్ణవివక్షను గుర్తించి, వర్గ దోపిడిని ప్రతిఘటించాలి.
ఉదా:- భారత జాతీయోద్యమం, రష్యా విప్లవం, కార్మికుల వేతనాల కోసం తిరుగుబాటు.
5) ప్రజా ఉద్యమాలు కవిత్వంలో ప్రతిఫలించాలి, అలాగే ప్రజా ఉద్యమాలను కవిత్వం ప్రోత్సహించాలి.
6) మార్స్కిస్టు దృక్పధంతో రచించేవాడు అభ్యుదయ కవి. మార్క్సిస్టు సిద్ధాంతాల ప్రకారం సకల సంస్కృతికి కేంద్రం శ్రమ, శ్రామికుడు, కాబట్టి శ్రామికుడిని చిత్రించేదే అసలైన కవిత్వం.
7) పెట్టుబడిదారి వ్యవస్థను కూలదోసి, సామ్యవాద సమాజాన్ని నెలకొల్పడానికి కవి రచనలు చేయాలి.
8) అంతర్జాతీయ దృక్పధంతో, మానవభ్యుదయాన్ని కాంక్షించే కవిత్వం రావాలి.
9) అభ్యుదయ కవిత్వం చంధస్సు వంటి నిర్భందాలు లేదా ఆంక్షలు తొలగించుకొని సామాన్యుడికి అర్ధం అయ్యే విధంగా రచన ఉండాలి వచన కవితా ప్రక్రియ అభ్యుదయ కవిత్వానికి సరైన మార్గం.
ఉదా:- శ్రీశ్రీ మహాప్రస్తానం, మరో ప్రంపంచం, కాళోజి నాగొడవ
తెలుగు సాహిత్యంలో అభ్యుదయ దోరణి లండన్‌ రచయితల మ్యానిఫెస్టో కంటే ముందుగానే వుంది. కవి కొండల వెంకటరావు వంటి వారి కవిత్వంలోను, ఉన్నవ లక్ష్మినారాయణ మాలపల్లి నవలలోను సృష్టమైన అభ్యు దయపు భావజాలం వున్నట్లు మనం అర్ధం చేసుకోవచ్చు. తెలుగు సాహిత్యంలో అసలైన అభ్యుదయ భావనకు అం కురార్పణ చేసింది. ఉన్నవ లక్ష్మినారాయణ. తెలుగులో అభ్యుదయ సాహిత్యం నిజానికి కవిత్వంతో మొదలు కాలేదు. నవలతో మొదలైంది అని రామకోటి శాస్త్రి తమ వ్యాసాల్లో పేర్కొన్నారు. అయితే అభ్యుదయ సాహిత్యపు పునాదులు 1880వ సంవత్సరంలోనే నిర్మితమయ్యామని ఆవంత్స సోమసుందర్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిని బట్టి కందుకూరి వీరేశలింగం పంతులు గారితో అభ్యుదయ సాహిత్య శకం ఆరంభమైందని సోమసుందర్‌ గారి అభిప్రాయం.
సామ్యవాద సిద్ధాంత విస్తరణ, యువతలో అభ్యు దయ భావజాల ఉత్సాహం ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త నెత్తురును తయారు చేసిందని చెప్పాలి. దీనికి ఆంద్ర దేశం మినహాయింపేమీ కాదు. కాల్పనికవాద ప్రభావం అభ్యు దయ వాదంపై కూడా ఉంటుంది. లక్నో సభల స్పూర్తితో తెలుగు అభ్యుదయ రచయితలు ఒక వర్గంగా ఏర్పడి మొదలు ఆంద్ర వర్తమాన లౌకిక సంఘం ఆవిర్భవించింది. ఇది 1943 నాటికి అభ్యుదయ రచయితల సంఘంగా అవ తరించింది. భిన్న సామాజిక నేపధ్యం మరియు తాత్విక దృక్పధాలు వున్నవారు వివిధ వర్గాలకు చెందిన సాహిత్య వేత్తలు ఇందులో చేరారు. కృష్ణశాస్త్రి వంటి వామపక్షేత రులు కూడా అభ్యుదయ సాహిత్య వర్గంలో చేరిపోవటం ఒకింత అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఆ సంవత్సరంలో (1940-50) అభ్యుదయవాదుల మని చెప్పుకోవటం ఫ్యాషన్‌గా మారిందని చెప్పవచ్చును. ఏది ఏమైనప్పటికీ ఒక ఉద్వేగం, ఒక ప్రగతిశీలమైన హేతు బద్దమైన, సహజమైన మార్పుని సాహిత్యంలో ఆహ్వనించ దగ్గ విషయం గొప్ప పరిణామం. ఐతే ఇదిలా ఉండగా 1943లో ఏర్పడిన అభ్యుదయ రచయితల సంఘంలో శ్రీశ్రీకి చోటు దక్కకపోవటం ఆలోచించవలసిన విషయం. అదే సంవత్సరం తెనాలిలో జరిగిన మొదటి అభ్యుదయ రచయిత సంఘం తొలి సమావేశానికి తాపి ధర్మరావు అధ్యక్షత వహించటం కొసమెరుపు. 1944వ సంవత్సరం లో జరిగిన రెండవ సమావేశానికి తెలికచెర్ల వెంకటరత్నం అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో అభ్యుదయ ఉద్య మంపై చర్చ జరిగింది. 1945వ సంవత్సరం చివరిలో జరి గిన మూడవ సమావేశం రాజమండ్రి వేదికగా కృష్ణశాస్త్రి అధ్యక్షతన శ్రీశ్రీ ప్రారంభోత్సవ ఉపన్యాసం చేశారు. ధనిక సమాజం మారాలనుకోవడమే అభ్యుదయం అన్నారా యన, అలాగే పీడింపబడే వాళ్ళు, పీడించే వాళ్ళు వున్న ఈ వర్గ సమాజం ఉండాలని ఎవరు కోరుకోరు. రానున్న రోజులలో సామాన్య మానవుడే కేంద్రబిందువు కాగలడు. పురోగమిస్తున్న లోకాన్ని ప్రతిఘటించేవారు ఎప్పుడు అభ్యుదయవాదులు కాజాలరు. ఈ ధనిక సమాజం పోవా లని కోరుకోవటమే అభ్యుదయం, ఇది మనసులో పెట్టు కొని రాసేది అభ్యుదయ రచన అని కృష్ణశాస్త్రి గారు ఆనాటి సమావేశంలో వ్యాఖ్యానించారు. అభ్యుదయ రచయితల నాల్గవ సమావేశం 1947లో మద్రాసులో జరిగింది. ప్రము ఖ రచయిత ఖ్యాజా అహ్మద్‌ అబ్బాస్‌ ప్రధానోపన్యాసం చేశారు. రచయిత న్యాయమూర్తి పి.వి.రాజ మన్నార్‌ ఈ సభకు అధ్యక్షత వహించారు. అలాగే 1955లో శ్రీశ్రీ అధ్యక్షతన బెజవాడ (విజయవాడ)లో ఐదవ మహా సభలు జరిగాయి.
చిట్టచివరి అభ్యుదయ రచయితల సంఘం సమావే శం 1974లో ఒంగోలులో జరిగాయి ప్రముఖ రచయిత చాగంటి సోమయాజులు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. క్రమంగా రచయితల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. అభ్యుదయపు భాజాలంతో కూడిన రచనలు చేయటం ప్రారంభించారు. 1917లో వచ్చిన రష్యా విప్లవం, ఆ పక్కనే వున్న చైనాలో మావో నేతృ త్వంలో చైనా కమ్యునిస్టు దేశంగా (1948) అవతరించ టం, శ్రమించేవాడికే ప్రతిఫలం దక్కాలన్న నినాదం అంద రిని ఆలోచనలో పడేసింది, దీనికి అనుగుణంగా సమాజం మారాలని, ప్రగతిపధం వైపు నడవాలని ఆ సమయంలో ప్రతిన బూని రచనలు చేశారు. వారిలో ముందు వరసలో శ్రీశ్రీ, అభ్యుదయవాదానికి గొడుగు పట్టి చాలా కాలం పాటు నీడనిచ్చాడు.
కవికొండల వంటి కవిని, ఉన్నావ లక్ష్మినారాయణ లాంటి రచయితను మినహాయిస్తే, తొలి తెలుగు అభ్యు దయ కవి శ్రీశ్రీ అన్నది సుస్పష్టం. రాత్రి నిదురలో భయం కర స్వప్నాలు కంటూ దీనంగా పలకరించే సమయాన ఉషాగమనాన్ని గుర్తించి స్వాగతమిచ్చే వైతాలికుడు శ్రీశ్రీ. తెలుగు కవిత్వాన్ని ఖండించి, ఊగించి, శాసించి, ఈ శతాబ్దం నాది అని స్వయంగా ప్రకటించుకున్న ఆత్మ విశ్వాసి, శ్రీశ్రీ అని చలం స్వయంగా మహాప్రస్థానంలో పేర్కొనడం అరుదైన విషయం. అలాగే మహాప్రస్తానంలో చలం అన్నట్లు నెత్తురు కన్నీళ్లు తడిపి కొత్త టానిక్‌ తయారు చేశాడు శ్రీశ్రీ ఈ వృద్ధ ప్రపంచానికి. ఈ కాలంలో శ్రీశ్రీ ఊసులేకుండా, శ్రీశ్రీ సాహిత్యం చర్చలో లేకుండా ఎక్క డైనా ఓ చర్చ గోష్ఠి లేదా సమ్మేళనం జరుగుతుందా, శ్రీశ్రీ మహా ప్రస్తానంలో ప్రస్తావించిన అనేక అంశాలు నేటికి సమాజంలో నిత్యం ఎక్కడోచోట జరుగుతూనే వున్నాయి, శ్రమ దోపిడి, ఆకలిచావులు, దేశాల మధ్య ఆధిపత్య దోరణి, ఘర్షణపూరిత వాతావరణం లేదా యుద్ధం జర గటం చూస్తూనే ఉన్నాం. తాజ్‌ మహాల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెందరు? ప్రభువెక్కిన పల్లకి కాదోయ్‌ అది మోసిన బోయుడెవ్వడు, అలాగే రణరంగం కాని చోట భూస్తలమంతా వెదికినా దొరకదు, గతమంత తడిసే రక్తమున కాకుంటే కన్నీళ్ళతో అన్న పదాలు నేటి సామా జిక పరిస్థితులకు చక్కగా అన్వయించుకోవచ్చు.
చలం ద్వారా ప్రశంసలు పొందిన మహా ప్రస్థానం తనమిత్రుడు కొంపెల్లి జనార్ధన రావుకి అంకితం ఇవ్వటం, జరిగింది. మహా ప్రస్తాన గేయం 1934 ఏప్రిల్‌ 12వ తేది నాడు రచింపబడింది ఈ కవితను శ్రీశ్రీ కాశీనాధుని నాగేశ్వర రావు సంపాదకత్వంలో వెలువడుతున్న భారతి పత్రికకు పంపిస్తే అది తిరిగి పంపించబడింది, అనంతరం శ్రీశ్రీ దాన్ని తిరిగి ముద్దుకృష్ణ సంపాదకత్వంలో వెలువడు తున్న జ్వాలా పత్రికకు పంపారు అది ప్రచురింపబడింది. ముద్దు క్రిష్ణయ్య అభ్యుదయవాది అతనే వైతాళికులు అను కవితా సంకలనం వెలువరించారు. 1943లో తెనాలిలో జరిగిన మహా సభల అనంతరం అభ్యుదయ ఆలోచనల పర్యవసానంగా నయగారా కవితా సంకలనం వచ్చింది. 1944లో నర్సారావుపేటలో నవ్య కళాపరిషత్తు వారు ప్రచురించిన ఈ కావ్యాన్ని బెల్లంకొండ రామదాసు, కం దుర్తి ఆంజనేయులు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం రచించారు. అగ్నివీణ కావ్య రచయిత ఐన అనిసెట్టి సుబ్బారావు గారికి ఈ సంకలనం అంకితం ఇవ్వబడింది. నయాగార కావ్యం లో కూడా అభ్యుదయ భావజాలం దాగివుంది. ఇందులో మన్యం వీరుడు అల్లూరి సీతరామరాజును ఉద్దేశించి నువ్వూ చేసిన మన్య విప్లవం దేశానికి మార్గదర్శనం అం టూ అల్లూరికి నివాళి పలికిన ఈ కావ్యంలో రవింద్రనాద్‌ ఠాగూర్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌ మొదలైన వారి గూర్చి ప్రస్తావించబడింది. ఆవంత్స సోమసుందర్‌ రచించిన వజ్రాయుధం కావ్యం కూడా అభ్యుదయ భావాలతో రచిం చబడినదే అందులో ఒక వీరుడు మరణిస్తే వేల కొలది ప్రభ వింతురు, ఖబద్దార్‌ నిజాం పాదుషా అని హెచ్చరించటం ఆనాడు సంచలనం సృష్టించింది. అనంతరం ఉదయిని కావ్యకర్త ఐన గంగినేని వెంకటేశ్వర రావు స్వయంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని ఉద్య మంలో తను చూసిన అనుభవాలను, ఉద్యమ ప్రభోధా లను కూడా ఇందులో పొందుపర్చారు. అదేవిధంగా వచన కవితా పితామహుడిగా పిలువబడుతున్న కుందూర్తి ఆంజ నేయులు గారి ద్వారా వెలువడిన తెలంగాణ కావ్యం విమర్శకుల ప్రశంసలు పొందింది. అలాగే ఆరుద్ర గారి త్వమేవాహం లోను అభ్యుదయ లక్షణాలు ఉన్నాయి, రెంటాల గోపాల కృష్ణ గారి సర్పయాగం కే.వి.రమణా రెడ్డి గారి అడవి, భువన ఘోష, దాశరధి గారి అగ్నిధార, రుద్రవీణ, సినారె గారి జలపాతం కావ్యంలోను స్పష్టమైన అభ్యుదయపు ఛాయలు ఉన్నాయి.
ఏది ఏమైనప్పటికి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన పరిణా మాలు ఆనాటి కాలంలో జీవించిన కవులపై బలమైన ముద్రను వేసి వారిలో చైతన్యం తీసుకొని రావటం త ద్వారా సమాజాన్ని తమ రచనలతో చైతన్యం చేయాలను కోవటం గొప్ప విషయం. ప్రశ్నించడం, మార్పుని ఆహ్వా నించటం, సమాజం నిత్య చైతన్యం, భౌతికమైన మార్పు లకు గురౌతున్నప్పుడు, సమాజం మారాలనుకోవడం అవివేకం కాదు కదా అందుకే సమసమాజ స్థాపన ద్వారా పేద, ధనిక అంతరాలు తొలుగుతాయనేది అభ్యుదయ వాదుల దృక్పధం. వర్గ సంఘర్షణ, విప్లవ ప్రబోధం, వీర గాధ, కధనం, యుద్ధ విముఖత, సమసమాజ నిర్మాణం మొదలైన దోరణుల్లో ఉద్యమం సాగింది. 1950 తర్వాత అభ్యుదయ కవిత్వోద్యమం తన అస్థిత్వాన్ని నిలుపుకోలేక పోయింది క్రమంగా నీరసించి దిగంభర కవిత్వానికి అలాగే 1970 అనంతరం విప్లవ కవిత్వోద్యమానికి బీజాలు వేసింది. అభ్యుదయ కవిత్వోద్యమం ఉదృతంగా సాగుతున్న రోజుల్లో విద్వాన్‌ విశ్వం, ఆత్రేయ, సి.విజయ లక్ష్మి, కవిరాజ మూర్తి, దేవరకొండ బాలగంగాధర్‌ తిలక్‌, తెన్నేటి సూరి, గజ్జెల మల్లారెడ్డి, నాజర్‌, వేములపల్లి శ్రీకృష్ణ, సుంకర వాసిరెడ్డి, ఎన్‌.జి.రంగ, మహీధర రామ్మో హన రావు, వట్టికోట ఆల్వారు స్వామి, బొల్లిముంత శివరామకృష్ణ, కొడవటిగంటి కుటుంబ రావు, నారాయణ బాబు, పఠాభి,అబ్బూరి రామకృష్ణారావు, శిష్ట్లా ఉమా మహేశ్వరరావు, గద్దె లింగయ్య, జంద్యాల పాపయ్య శాస్త్రి, ఎర్రోజు మాధవాచార్యులు మొదలైన వారు ఆ కాలంలో ఆలోచింపజేసే రచనలు చేసి నేటితరానికి స్పూర్తిగా నిలిచారు. తెలుగు సాహిత్యంలో అభ్యుదయ కవిత్వో ద్యమం బలమైన ముద్రను వేసి తన అస్థిత్వాన్ని చాలా కాలం పాటు నిలబెట్టుకుంది. ఏదీ ఏమైనప్పటికీ ప్రపంచం మొత్తాన్ని ఒక గ్రామంగా పరిగణిస్తే అందులో పీడించే వాళ్ళు, పీడింపబడే వాళ్ళు, ధనికుడు మరియు పేదవాడు ఉన్నట్లుగానే సమాజంలో నిరంతర సంఘర్షణ జరుగు తున్నంత కాలం అభ్యుదయ దృక్పదం, అభ్యుదయవాదం సజీవంగా ఉంటది. సూర్యుడు మేఘాల చాటుకు వెళ్ళి నంత మాత్రాన సూర్యాస్తమయం అయినట్లుగా భావించ డం ఎంత తప్పో తెలుగు సాహిత్యంలో అభ్యుదయ కవిత్వోద్యమం క్షీణించింది అని చెప్పడం అంతే తప్పుగా భావించాలి. ఎప్పుడైన ఏ కాలంలోనైన మళ్ళీ జీవం పోసు కొని తన మనుగడ ఇంకా సజీవంగానే ఉంది అని ప్రకటి స్తుందేమో అందుకే అడపాదడపా నేటికి కూడా కొద్ది మంది అభ్యుదయ కవిత్వోద్యమ స్పూర్తితో రచనలు చేస్తూనే ఉన్నారు.
డా॥మహ్మద్‌ హసన్‌
విమర్శకులు, 9908059234

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News