Tuesday, September 10, 2024
Homeఓపన్ పేజ్Telugu Literature: వర్ణాలు లేని వాక్యాలు

Telugu Literature: వర్ణాలు లేని వాక్యాలు

తెలుగు సాహిత్యంలో కవిత్వము కవితా పద్ధతులు కవిత శైలి రకరకాలుగా ప్రవహిస్తూ పోతుంది. తెలుగు కవిత్వంలో భావంతో పాటు పాండిత్యం శబ్ద సౌందర్యం సామాజిక స్పృహతో కూడిన భాషా శైలిలో కవిత్వము రాయగల సమర్థులలో ప్రముఖ కవి సరికొండ నరసింహారాజు గారు ఇతను ఒక భాషా ప్రేమికుడు కవిత ఆరాధకుడు తెలుగు సాహితీ వనంలో నిత్యం పరిమళించే సాహితీ పుష్పం తన వేదన రోదన ఆలోచన ఆవేదన అంతా కవిత్వమే తాను ఒక నిత్యం ప్రవహించే కవిత నది అక్షరా లకు ఆయువు పోసి వాక్యాలకు వర్ణాలు అద్ది వర్ణాలు లేని వాక్యాలు అంటాడు. తెలుగు సాహితీ ప్రక్రియలలో ఇతను సృష్టించని కవిత శైలి లేదంటే నమ్మశక్యం కాదు నానీలు రెక్కలు పాటలు పద్యాలు కవితలు ఒక్కటేంటి అన్ని సాహితీ ప్రయోగాలను చేస్తూ అనునిత్యము తనకు తాను కవిత్వంతో చెక్కుకునే అక్షర శిల్పి సరికొండ నరసింహా రావు ఇతను రాసిన కవిత పుస్తకాలను కవిత వస్తువులను చదువుతుంటే కొండంతో సాహిత్యము మన కళ్ళ ముందు కనిపిస్తుంది
అక్షరాన్ని చూసి
అధికారం భయపడిందా
కలాన్ని ఖడ్గం నిషేధించిందా
జైలు గోడలపై జెండాలు
ప్రశ్నిస్తున్నాయి
గంతలు కట్టుకున్న రాజ్యమా
అంగవైకల్యం ఎవరికి!
ఈ కవిత చదివితేనే మనకు అర్థమవుతుంది అక్షరా లకు వాయువు పోసి కలం బలంతో కవిత్వంతో రాజ్యంపై యుద్ధం చేయవచ్చునని. ఎవరు గెలిచినా ఎవరు ఓడిన అంతిమ విజయం యుద్ధ అనేదే అంటాడు కవి యుద్ధం అంటే విజయము వీరత్వం కాదు యుద్ధం అంటే నేల తల్లికి రక్త స్నానం అధిరోహించిన నెత్తుటి సింహాసనం
యుద్ధం అనివార్యమే
ఆదిపత్య యుద్ధం కాదు
ఆక్రమణల యుద్ధం కాదు
అంతరంగ యుద్ధం
అనురాగ యుద్ధం
ఎవరికివారు నిత్యం వారి అంతరంగంతో యుద్ధం చేసుకోవాల్సిందేనని సరికొండ తన కవిత్వంలోని అక్షరా లతో యుద్ధం చేస్తూ మన అంతరంగాన్ని తట్టి లేపారు.
జీతాలపై పన్నుపోటు
జీవితాలలో వెన్నుపోటు
బతుకు గుమ్మానికి
వీధి పోటు
అంటూ జీవన శైలిలోని జీవిత సత్యాన్ని తన కవిత వేటు తో సజీవంగా రాశారు.
ఒక చేతిలో జననం
ఒక చేతిలో మరణం
గుప్పెట్లో పట్టుకుని కదా పుట్టాం
బతుకు గుప్పెట్లోనే జన్మ రహస్యం
సరికొండ చక్కనైన పదజాలంతో చిక్కనైన సాహిత్యం తో బ్రతుకు చిత్రాన్ని కవిత్వీకరించిన తీరు చూస్తే జనన మరణాల గురించి జీవిత సత్యం గురించి ఎంత లోతైన అధ్యయనం చేసి కవిత్వముతో మన కళ్ళు తెరిపిస్తున్నారు.
భగవద్గీత బైబిల్‌ ఖురాన్‌
దైవభక్తితో చదవాలి
భారత రాజ్యాంగాన్ని
దేశభక్తితో చదవాలి
అంటూ దైవభక్తిని దేశభక్తిని రెండింటిని తన కవిత్వం తో అంటూ కట్టి తన సాహిత్యంతో దేవుడు గొప్పతనాన్ని దేశం యొక్క గొప్పతనాన్ని రెండిటిని సాహిత్యంతో సమ న్వయం చేశాడు.
సిమ్‌ ఏదైనా ప్లాన్‌ ఏదైనా
ఎక్స్‌ పైర్‌ అవ్వక తప్పదు
స్లిమ్‌ గా ఉన్న సిక్స్‌ ప్యాకైనా
దేహము అంతే
ఆత్మ సౌందర్యమే
అన్‌ లిమిటెడ్‌ రీఛార్జ్‌
సిమ్‌ కైనా దేహానికైనా ఎక్స్‌ పైరీ డేట్‌ తప్పదు అంద మైన శరీరం కంటే ఆత్మ సౌందర్యమే గొప్పదంటూ జీవిత సత్యాన్ని తన కవిత్వంతో బోధిస్తున్నారు. ఇంటి గుమ్మం ఇరుకుగా ఉంటే తలంచి పోవాల్సిందే ఇల్లాలు విసుగుగా ఉంటే సర్దుకుపోవాల్సిందే అని జీవిత సత్యాన్ని వివరి స్తారు తన కవిత్వంలో సరికొండ నరసింహారావు గారు. ఎంత గొప్ప దేశమైనా ఎంత గొప్ప రాజ్యమైన దేశంలోని ప్రజలకు బ్రతుకుతెరువు చూపి తీర్చటమే దేశం యొక్క గొప్పతనం ఇలాంటి దేశానికి రైతే రాజు అంటాడు వ్యవసాయమే విజయం అంటాడు కవి సరికొండ
వీడు నేలను కాదు అహంకార నేతలను దుక్కి దున్ని ఆకుపచ్చని దేశాన్ని అందించే నిజమైన దేశభక్తుడు రైతు
ఎర్రకోటపై
నాగలి జెండా ఎగురుతూ
విరిగిన రాజముద్ర
ఇది రైతు పాదముద్రం
ఇది మట్టి విజయం
బడుగు మనిషి విజయం
అంటూ రైతు గొప్పదనాన్ని గర్వంగా గౌరవంగా తన కవిత్వంలోప్రస్తావించారు సరికొండ గారు.
నీతి రాజకీయం రద్దుఅయి
బూతు రాజకీయ ముద్దు అయి
భరతమాత
అవమాన పర్వములో చితికిపోతూ
ప్రేక్షక పాత్రలో ఓటరు
నోటా కే నా ఓటు అంటూ
ప్రజాస్వామ్యం
ఈ ప్రజాస్వామ్య దేశంలో కలం మార్చితే కవిత్వం మారదు దుస్తులు మార్చితే వ్యక్తిత్వం మారదు గొంతు మార్చితే కోకిల స్వరం అవ్వదు అవినీతి ముళ్లదారిలో మన జీవితాలు మారవు ఓటరు నోటును మర్చిపోయి నోటాకి ఓటేసినప్పుడే ప్రజాస్వామ్యము గుర్తించబడుతుంది దేశం లోని ప్రజల బ్రతుకులు బాగుపడతాయి అంటాడు కవిన నరసింహారాజు గారు
నిత్య ఉపవాసం జాగారం
పేదవాడికి……..
మరి శివుడు వరాలు వర్షాలు
కురిపించడెం?
పేదరిక గోడలపై
మూడో కన్ను తెరిచేదెప్పుడు
దేవుడి మొక్కుబడులు చెల్లిస్తావో లేదో దశమ భాగం ఇస్తావో లేదో ప్రార్థన చేస్తావో లేదో ఈ విపత్కర పరిస్థితు లలో అభాగ్యులకు సహాయ పడితే నీవే దేవుడి వైపు పూజిం చబడతావు అంటూ మనిషిలోని మానవత్వాన్ని దైవత్వం తో మేలుకొలుపుతారు కవి సర్‌ కొండ నరసింహ రాజు గారు.
ముఖానికి మాస్కులు ఉన్నాయి
చేతులు కడుక్కోవడానికి
శానిటైజర్స్‌ ఉన్నాయి
హృదయాన్ని శుభ్రపరిచే
మందు కనిపెడితే
కరోనా వ్యాక్సిన్‌ కి విజయవంతమైనట్లే
అంటూ మనిషి భౌతికంగా ఎంత శుభ్రంగా ఉన్నా మనిషిలో దయ కరుణ లేనంత కాలం కరోనా వ్యాక్సిన్‌ ఉన్న విజయం సాధించినట్టే అంటాడు. కవి సరికొండ నరసింహారాజు గారు సెల్ఫోన్‌ గురించి కవిత్వం రాస్తూ నేరస్తులను మాత్రమే జైలు సెల్లులో నిర్బంధిస్తారు కానీ నేడు ప్రతి మనిషి సెల్‌ఫోన్‌లో తణుకు తానే బందీకృతుడైన వాడు ఈ అప్రకటితా ఖైదీలు సెల్‌ఫోన్‌ నిర్బంధంలో నేరస్తులే జైల్‌ సెల్లులో నించైనా బయటికి రావచ్చునేమో మనిషి సెల్ఫోన్లో నుంచి బయటికి రావడం కష్టమేనంటాడు కవి సరికొండ
తులసి కోటలో ఉంటే
మొక్కకు పూజలు
చెత్త కుండీలో ఉంటే
చిత్కారాలు…
శివం ఎదుట దీపమే
శవం ఎదుట దీపమే
దీపంలో ఏ పాపం ఉంది
చూసే దృష్టిలోనే….
చూశారా మనం చూసే దీపంలో ఎంత వ్యత్యాసం ఉందో మనం చూసే దృష్టి మారినంత కాలం మానవత్వ దీపం వెలగనంత కాలం ఎంత విద్యా విజ్ఞానం ఉన్న చీకటి బ్రతుకులే మనలోని సత్యం అనే ద్వీపం ఎలగనంత కాలం మన బ్రతుకులన్నీ చీకటమయం అవుతాయని కవి సందేశం
కాలం కదిలే రైలు లాంటిది రిజర్వేషన్‌ ఉన్న పరిగెత్తి ఎక్కకపోతే పడిపోతావ్‌ అసలే ఎక్కకపోతే ఆగిపోతావు ఇక గమ్యం చేరేది ఎప్పుడు అంటూ మనిషి గమనాన్ని గమ్యా న్ని గుర్తు చేస్తారు. ముల్లు అవసరమే గులాబీ ముల్లులా గడియారం ముల్లులా చేప ముల్లులా
మూడు ముళ్ళు
కాలిలో ముళ్ళు దిగకుండా
అడుగు అడుగులో జరభద్రం
అంటూ జీవిత భాగస్వామికి మూడు ముళ్ళు వేసేట ప్పుడు జీవిత బంధం గురించి తెలుసుకో మనిషి జీవితం లోని ముళ్ళ గురించి మూడు ముళ్ళు గురించి చక్కగా వివరించారు ఈ కవిత్వంలో
నువ్వు నేను కలిస్తే మనం మనం మనం మనం కలిస్తే జనం జనం జనం కలిస్తే ప్రభంజనం సమైక్య జీవన సౌంద ర్యాన్ని కవిత్వీకరించారు సరికొండ నరసింహారాజు గారు.
చెట్టు ఫలాలను దానం చేస్తూ
నది నీటిని త్యాగం చేస్తూ
గాలి ఊపిరి దారాలను నేస్తూ
నేల నిత్యం లోకాన్ని మోస్తూ
ప్రకృతి తల్లి అనురాగమును కొప్పుల్లో పూచిన నేలతల్లి పూల తీగల నాట్యంతో పులకించిన బతుకమ్మ తల్లి ప్రకృ తిని పూజించటమే పండగల పరమార్థం అంటూ ప్రకృతి గొప్పతనాన్ని కవిత్వేకరించిన కవి సరికొండ నరసింహా రాజు గారికి ప్రకృతి పట్ల ఎంత బాధ్యత ఉందో అర్థమ వుతుంది.
ఎర్రజెండాను భుజాన మోసుకొచ్చిన
అక్షర యోధుడా నీకు లాల్‌ సలాం
నిత్యం మండే సూర్యుడా
నీకు లాల్‌ సలాం
గుండెను రగిలించే
కవిత్వాన్ని రాసిన
సరికొండ నీకు లాల్‌ సలాం
నరుల నరలలోని
మూర్ఖత్వాన్ని నీ సాహిత్యంతో సింహ గర్జన చేసిన నరసింహ రాజా నీకు లాల్‌ సలాం సరికొండ నరసింహా రాజు గారి కలం నుంచి జాలువారిన వర్ణాలు లేని వాక్యాలు గురించి ఎన్ని వాక్యాలు రాసినా తక్కువే సాహితీ సరికొండపై ఎన్ని అక్షరాలు చెక్కిన కవిత్వానికి మరొక కొత్త తోవ కనిపిస్తూనే ఉంటుంది. కవి సరికొండ రాజు గారికి నా అక్షర వందనాలు సాహితీ అభినందనలు.
పూసపాటి వేదాద్రి
కవి రచయిత సాహితీ విశ్లేషకులు
9912197694

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News