అన్యాయాన్ని ఎదుర్కోవాలంటే అక్షరమే ప్రధాన ఆయుధమని భావించి అభ్యుదయ భావాలతో తెలుగు సాహిత్యం పట్ల అభిలాష చదివుకొనే రోజుల్లోనే ఏర్పడిన సహజ కవయిత్రి పోతురాజు దుర్గాదేవి. గుంటూరు వాస్తవ్యులు అయిన పోతురాజు దుర్గాదేవి తన కవనం యొక్క ప్రత్యేకతను తన మాటల్లో పరిశీలించినట్లయితే.. సాహిత్యాభిమానులకు, పాఠకులకు తొలకరి జల్లుల వంటి ఆహ్లాదాన్ని తను రచించిన మొదటి కవితా సంపుటి ‘ కాలం సాక్షిగా….’ అందిస్తుందని తన భావాన్ని వ్యక్తం చేసినది. కానీ తన గురించి తనకు తెలియని మరో కోణం ఏమిటి అంటే సాహిత్యంలో తన కవనం ప్రత్యేకతతో అందవేసిన చెయ్యి తనది అని తనకు తెలియని ఒక నిగూడ మైన నిజం అని ఈరోజు తన రచనలు సాక్షం చెబుతున్నాయి. తెలుగు భాషను అమ్మ భాషగా భావించి ఎమ్..ఎ తెలుగు సాహిత్యం చదివి ఆ తదుపరి ఎం.పిల్ ఉత్తీర్ణురాలై ప్రస్తుతం కే వరలక్ష్మి కథా సాహిత్యంపై ప్రామాణిక పరిశోధన చేస్తు న్నారు. ఒక నిరంతర కార్యదీక్షతో కుటుంబంలో భార్యగా బాధ్యతలను ఒక వైపు నిర్వహిస్తూ మరో వైపు సాహిత్య కృషి చేయుచున్నాను. ఈ క్రమాన్ని పరిశీలించినట్లయితే సహజంగా పెళ్లి అనే అనుబం ధంతో కొత్త జీవితంలోకి ప్రవేశించిన ఎక్కువ మహిళలు వృత్తి బాధ్యతలు, కుటుంబ బాధ్యతలకు మాత్రమే పరిమితం అవుతుంటారు. కానీ బాధ్యత లతో పాటుగా దుర్గ ప్రత్యేకంగా తన సాహిత్య అభిలాషను తన ఉత్తమ రచనలతో చాటుకున్నారు.
వైవిధ్యమైనటువంటి వివిధ అంశాలతో తన మొదటి కవితా సంపుటిని సాహితీలోకానికి అం దించే ప్రయత్నంలో భాగంగా…. అన్యాయాన్ని ఎదుర్కొనే తత్వాన్ని మనిషి జీవితంలో అలవర్చుకో వాలని తెలియజేస్తూ, నేటి యువతకు భవితకు మార్గదర్శకంగా తన మొదటి కవితా సంపుటి ని వెలువరించినది. సామాజిక మాధ్యమాలలో నా రచనలను, విమర్షణా వ్యాసాలను, పుస్తక సమీక్ష లను ప్రత్యేకంగా చదివి తన కవితా సంపుటికి నా నుండి సమీక్ష కావాలని కోరినది. చాలా రోజుల క్రితమే తన కవితా సంపుటి నాకు అందినప్పటికి ఆలస్యం అయినాగాని నా సమీక్షను అందిస్తున్నాను.
అమెరికన్ నవలా కారుడు స్కాట్ ఫిట్జ్ రాల్డ్ అంటాడు. For what it’s worth, it’s never too late to be who ever you want to be. I hope you live a life you’re proud of and if you find that you’re not, I hope you have the strength to start over.
చేసే మంచి పని ఎప్పటికీ చిరస్థాయిలోనే నిలుస్తుంది, మంచి పని చేసేటప్పుడు ఒడిదుడుకు లతో ప్రయాణం మొదలైనప్పటికీ శాశ్వత మార్పు కు నాంది పలికినట్టే లెక్క.
అందరాని చందమామ కవితలో….
అందరాని చందమామ అందరికి మేనమామ
అందనంత దూరాన ఆకాశం ఆటకెక్కి
నీలాల నింగి అంచున నిలిచి గోరుముద్దలు తింటున్న పాపాయి బోసినవ్వులు చూస్తూ
ఆరుబయట ఆడ పిల్లల చందమామ! చంద మామ! అనే కేరింతలు వింటూ ‘చందమామరావే జాబిల్లి రావే‘ అని.
అమ్మలు పాడే లాలి పాటలు.
తరతరాలుగా వింటున్నా..
విసుగు చెందక అందరి ఊసులు వింటూ….
(సహజంగా ప్రకృతి అందాలను వర్ణించడం కవి సహజ లక్షణం అని తెలుపుటకు ఈ కవిత నిదర్శనం, సూర్యుడు,చంద్రుడు,ఆకాశం,భూమి, పచ్చిక బయల్లు, ఇలా ప్రకృతిలోని ప్రతి అందాన్ని వర్ణించటంలో కవి యొక్క పాత్ర విభిన్న కోణంలో ఉంటుంది.)
నేటి యువత కవితలో….
నేటి యువతే దేశ భవిత
కాలానికి బలమైన పగ్గాలు వేసి
రేపటి తరాలకు ఆదర్శంగా
నిలిచే ఓ యువతా…
కాలం శక్తికి యుక్తిని కలిపి
కాంతి కిరణాలను ప్రసరిస్తూ
చీకట్లను చెండాడే మేదస్సుతో
నీ చిరునామాను చరిత్ర
పుటలో నిలపాలి…
( ఏ దేశ ప్రగతి అయినా కానీ యువత కీలక బాధ్యత వహించినట్లయితే చరిత్రలో చిరస్థాయిగా నిలిచే ఫలితాలను అందించక తప్పదు, అందుకు యువత ఎప్పుడూ ముందుండాలి అని తెలియ జేసింది )
కన్నీళ్ళ వాన కవితలో….
కన్నీళ్ళ వాన కరిగిపోయిందిలోలోన
తడిచిన గుండెను అడుగు
పెరిగిన బాధల తాలుగా
ఆరని తడి చెమ్మలు
తరగని చెరువులై
వేచి చూస్తున్నాయంటుంది.
వేల వెక్కిరింపులకు
వెక్కిళ్ళ జడి శబ్దానికి
కన్నీళ్ళు కుమ్మరించిన
జడివానల జాడలు
చెంపల చారలనడగండి.
తలగడ తాగిన ఉప్పునీటి నడగండి.
ఉప్పు చారలు
కట్టిన పవిట చెంగులనడగండి.
(భావోద్వేగాలను తెలియజేయుటలో కవ యిత్రి తన కవిత లక్షణాన్ని ఈ కవితలో ప్రత్యేకం గా తెలియజేసినది )
నిస్సహాయత రోడ్డెక్కితే కవితలో….
తన బిడ్డలపై మమకారాన్ని పెంచుకొని బిడ్డల స్వార్థనికి సమిదలై నిస్సహాయంగా రోడ్డెక్కిన
ఎందరో తల్లితండ్రులకు క్షమాపణలతో
అన్నం తినిపించి, కమ్మని పాటలతో ఊయ లలో లాలించి
దోమ కుట్టెనో చీమకుట్టెనో
అని కుమాకులేకుండా
నిద్రను వీడి ఆకలి మరచి
నీ అల్లరిని ఆరగించి
నీ సేవకు పరితపించి
నిరంతరం శ్రమించి
నీ చుట్టూ పరిభ్రమించిన తల్లిదండ్రులకు వృద్ధాప్యపరంగా వచ్చిన మార్పులు శరీరానివే వారి అంతరంగాన నిండి ఉండేది నీవే కాని వారి ప్రాణం కూడా కాదు.
(పిల్లల్ని కని పెంచిన తల్లిదండ్రులు వారి యొక్క అవసాన దశలో వారికి ఎలాంటి తోడ్పాటు లేకుండా, ఎందరో మంది పిల్లలు తల్లిదండ్రులను బాధ పెడుతున్న విషయాలను కవయిత్రి తనదైన కోణంలో తెలియజేసింది నిస్సహాయతకు లోనవు తున్న తల్లిదండ్రులు, నిరాధారణకు గురి అవుతున్న ఎందరో మంది తల్లిదండ్రుల వారి మనోవేదనను ఈ కవితలో కవయిత్రి తెలియజేసింది.)
కాలం సాక్షిగా…. కవితా సంపుటి నందు ఇలాంటి కవితలు మరెన్నో పాఠకులను సాహిత్య అభిమానులను ఆకర్షించినవి ముఖ్యంగా చెప్పా లంటే సహజ కవికీ ఉండే ప్రతి అభిరుచులను తెలియజేయటం దుర్గ ప్రత్యేకత అని చెప్పక తప్ప దు. మరిన్ని ఇంకా కవిత్వంతో మరిన్ని కావ్యా లను రచించి సాహితీ లోకానికి అందించాలని హృ దయపూర్వక అక్షరాభినందనలు అందజేస్తున్నాను.
-డా. చిటికెన కిరణ్ కుమార్
ప్రముఖ సమీక్షకులు, విమర్శకులు
9490841284