Homeఎడిటోరియల్ / బహుళతెలంగాణ దిక్సూచి.. కొత్తపల్లి జయశంకర్ సార్..!

తెలంగాణ దిక్సూచి.. కొత్తపల్లి జయశంకర్ సార్..!

ఆధిపత్య శక్తులపై అతడు వీరభద్రుడు, ఆలోచనల అవసరాన్ని తెలిపిన నిబద్ధుడు, తెలంగాణ కనుగొన్న అతడు మరో బుద్ధుడు, అతడే ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ సార్‌! తెలంగాణను స్వప్నించి, శ్వాసించిన మహోపాధ్యుడు జయశంకర్‌ సార్‌ వరంగల్‌ జిల్లా, ఆత్మ కూరు మండలం అక్కన్నపేట గ్రామంలో లక్ష్మీ కాంతారావు, మహా లక్ష్మి దంపతులకు 1934 ఆగస్టు 6న జన్మించాడు. హనుమకొండ లోని మార్కజీ పాఠశాలలో ప్రాథమిక విద్య నేర్చాడు. హనుమకొండ న్యూ హైస్కూల్లో మాధ్యమిక వరకు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెచ్‌.ఎస్.సీ వరకు చదువుకున్నాడు. ఉస్మానియా విశ్వవిద్యాల యంలోని బి.ఏ పూర్తి చేశాడు. బెనారస్ విశ్వవిద్యాలయం, అలీగడ్‌ విశ్వవిద్యాలయం నుండి పి.జి పూర్తి చేశాడు.
జయశంకర్‌ సార్‌ సమస్యల పట్ల ఏ విధంగా స్పందించాలో, ఏ విధంగా ఉద్యమంగా తీర్చిదిద్దాలో నిరూపించే సంఘటన ఒకటి ఈయన విద్యాభ్యాస కాలంలో జరిగింది. అప్పట్లో వరంగల్‌లో డిగ్రీ కళాశాల లేదు. డిగ్రీ చదవాలంటే హైదరాబాదుకు వెళ్లాలి. లెక్చరర్స్​‍ ప్రోద్బ లంతో డిగ్రీ కాలేజీ కావాలని విద్యార్థులు ఉద్యమించారు. అందులో మొదటి వరుసలో జయశంకర్‌ ఉన్నాడు. ఈ సంఘటన తర్వాత పదేళ్లకు డిగ్రీ కాలేజీ, 30 ఏళ్లకు యూనివర్సిటీ వచ్చింది. ఏదైతే డిగ్రీ కాలేజీ యూనివర్సిటీ కోసం ఉద్యమం చేసిండో అదే యూనివర్సిటీకి ఆచార్య జయశంకర్‌ వైస్ ఛాన్సలర్‌ అయ్యాడు. 1960లో ఉపాధ్యాయ వృత్తిలో అడుగు పెట్టడం ద్వారా ఉద్యోగ జీవితం మొదలైంది. హనుమకొండలో ఉపాధ్యాయుడిగా నియామ కమై, లెక్చరర్‌గా ఆదిలాబాద్‌కు పోయాడు. 1975-79 వరకు సీకెఎం కళాశాల ప్రిన్సిపల్‌గా, బోర్డు మెంబర్‌ సేవలందించాడు. 1982-91 వరకు సీఫేల్‌ రిజిస్టర్‌గా పని చేశాడు. 1991-94 వరకు కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా పనిచేశాడు. ఇవే కాక వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో సంఘాల పదవుల్లో పనిచేసి తనదైన ముద్ర వేశాడు. ఇన్ని పదవుల్లో పనిచేసిన నాకు సి.కె.ఎం. కళాశాల ప్రిన్సిపల్‌ గా పని చేయడం ఎక్కువ తృప్తినిచ్చింది అని స్వయంగా అన్నాడు. మూడు దశలుగా సాగిన తెలంగాణ ఉద్యమంలో జయశంకర్‌ కీలక పాత్ర పోషించాడు. 1952లో ఇంటర్మీడియట్‌ విద్యార్థిగా తెలంగాణకు జై కొట్టి తరగతులను బహిష్కరించాడు. వరంగల్‌లో మొదలైన ఉద్యమం హైదరాబాద్‌ కేంద్రీకృతమైంది. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధనకు ఎలాంటి వ్యూహాలు రచించారు జయశంకర్‌కు తెలుసు. తెలంగాణ ఉద్యమానికి మూడు దశలు ఉన్నాయి. మొదటిది భావజాల వ్యాప్తి. అది జరిగింది. రెండవది ఆందోళన కార్య క్రమం. అది కొనసాగుతున్నది. ఇక మిగిలింది రాజ కీయ ప్రక్రియ అది జరగాల్సి ఉంది. దానిని పూర్తి చేయడమే ఉద్యమ కర్తవ్యం కావాలి. దానికి రాజకీయ చిత్తశుద్ధి అవసరం, ఇప్పుడున్న రాజకీయ నాయకత్వం ఆ పని పూర్తి చేస్తుందని అని నేను నమ్ముతున్నాను, అని అన్నాడు. మూడు దశలో కూడా జయశంకర్‌ మాత్రం మరువలేనిది. అందుకే అతడు తెలంగాణ సిద్ధాంతకర్త. మొదటిది తెలంగాణ భావజాల వ్యాప్తి. అది ప్రజలలో ఎట్లా చొచ్చుకపోయిందో జయశంకర్‌ ఒకరోజు ఇట్లా చెప్పిండు, ‘ఎందుకమ్మా తెలంగాణ అంటే? సార్‌ తెలంగాణ వస్తే మా పొలాలకు నీళ్లు వస్తాయి, మా పోరగాళ్ళకు కొలువులు వస్తాయి అనే భావన వారికి కలిగింది’ అంటూ చదువురాని ఆడవాళ్లు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకు న్నాడు. జయశంకర్‌ విద్యార్థి, సంఘ నాయకుడు గొప్ప పరిపాలనా దక్షుడు. తెలంగాణ కోసం అహర్నిశలు శ్రమించిన కార్యశూరుడు. తెలంగాణ కోసం తెలంగాణ రాజకీయ నాయకులకు తన సహకారం అందించాడు. చెన్నారెడ్డి నుండి చంద్రశేఖర్‌రావు వరకు ప్రతి ఒక్కరి రాజకీయ పార్టీకి తన మేధో శ్రమను ధరపోశాడు. ఆయన ఆశించినట్లే చివరగా రాజకీయ ప్రకీయతోనే తెలంగాణ వచ్చింది. అందరిని తన మార్గంలో నడిపించాడు. అందుకే అతడు మార్గదర్శి. తెలంగాణకు చిరునామా, తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహాను భావుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ సార్‌.

- Advertisement -

దేవులపల్లి రమేశ్‌
9963701294

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News