Saturday, November 15, 2025
Homeఓపన్ పేజ్Bihar Elections: బీహార్ ఎన్నికల అసలు రుచి.. చేప, మఖానా, పాన్‌తోనే రాజకీయ అధికారం!

Bihar Elections: బీహార్ ఎన్నికల అసలు రుచి.. చేప, మఖానా, పాన్‌తోనే రాజకీయ అధికారం!

The Political Power Of ‘Machhli’, ‘Makhana’, ‘Paan’ In Bihar: బీహార్‌లో ఎన్నికలంటే కేవలం ప్రసంగాలు, ర్యాలీలు, నినాదాలు మాత్రమే కాదు. అక్కడి ప్రజల దైనందిన జీవితంలో భాగమైన చేప (మఛ్లీ), మఖానా (ఫాక్స్ నట్), పాన్ (తమలపాకు) కూడా ఎన్నికల రాజకీయాలను శాసిస్తాయి. బీహార్ ఆహారం, పండుగలు, భావోద్వేగాలను నిర్వచించే ఈ మూడు పదార్థాలు, ఎన్నికల సమయంలో నిశ్శబ్దంగా రాజకీయ శక్తిగా మారతాయి.

- Advertisement -

ALSO READ: Indian Railways: ఇకపై బుక్ చేసిన టికెట్ల ప్రయాణ తేదీని మార్చుకోవచ్చు.. రైల్వే చరిత్రలో తొలిసారి..

చేప… ఓటు బ్యాంకుకు గాలం

ఉత్తర బీహార్‌లో, ముఖ్యంగా దర్భంగా, సమస్తిపూర్, ముజఫర్‌పూర్ జిల్లాల్లో చేపల కూర, అన్నం (మఛ్లీ-భాత్) లేనిదే ముద్ద దిగదు. పెళ్లిళ్లు, ఛఠ్ పూజ వంటి ఏ శుభకార్యమైనా చేపల విందు ఉండాల్సిందే. చేప కేవలం ఆహారం కాదు, వేలాది మత్స్యకార కుటుంబాలకు జీవనాధారం. వీరిలో అత్యధికులు మల్లా లేదా నిషాద్ వర్గానికి చెందినవారే. ఇటీవలి కాలంలో ఈ వర్గం రాజకీయంగా బలమైన శక్తిగా ఎదిగింది. నితీశ్ కుమార్ జేడీయూ, లాలూ యాదవ్ ఆర్జేడీ, బీజేపీ వంటి అన్ని ప్రధాన పార్టీలు వీరి ఓట్ల కోసం హామీల వర్షం కురిపిస్తాయి. మెరుగైన చెరువులు, చేప పిల్లల కేంద్రాలు, కోల్డ్ స్టోరేజీల వంటి వాగ్దానాలు చేస్తాయి. “మల్లా బిడ్డ” అనే నినాదంతో రాజకీయాల్లోకి వచ్చిన ముఖేశ్ సాహ్నీ, ఈ వర్గం మద్దతుతోనే సీట్లు గెలుచుకోగలిగారు. ఎన్నికల ప్రచారంలో నాయకులు స్థానికులతో కలిసి కూర్చొని చేపల కూరతో భోజనం చేయడం, “మేము మీతోనే ఉన్నాం” అనే బలమైన సందేశాన్ని పంపుతుంది.

ALSO READ: IPS Officer Suicide: షాకింగ్.. ఇంట్లో తుపాకీతో కాల్చుకుని సీనియర్ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య

మఖానా… మిథిలాంచల్ గర్వకారణం

బీహార్ నదులు చేపలకు ప్రసిద్ధి అయితే, అక్కడి చెరువులు మఖానాకు ప్రసిద్ధి. దేశంలోని మొత్తం మఖానా ఉత్పత్తిలో దాదాపు 90% బీహార్‌లోనే, అదీ దర్భంగా, మధుబని, సుపాల్ వంటి మిథిలాంచల్ ప్రాంతంలోనే పండుతుంది. లక్షలాది కుటుంబాలు ఈ పంటపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. నితీశ్ కుమార్ ప్రభుత్వం మఖానాకు జీఐ ట్యాగ్ ఇప్పించడం, దర్భంగాలో పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వంటి చర్యలతో ఇది స్థానిక పంట స్థాయి నుంచి అభివృద్ధికి చిహ్నంగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ సైతం తన ప్రసంగాల్లో “మఖానా అభివృద్ధి” గురించి ప్రస్తావించారు. మఖానా గురించి మాట్లాడటం అంటే మిథిలా ప్రజల ఆత్మగౌరవాన్ని గౌరవించడమే. ఇది ఇప్పుడు కేవలం ఆహారం కాదు, చెరువుల నుంచి ప్యాకేజింగ్ ఫ్యాక్టరీల వరకు సాగిన ప్రగతి ప్రయాణానికి ప్రతీక.

పాన్… సాంస్కృతిక బంధం

చేప, మఖానా ఆదాయాన్ని, ఉపాధిని సూచిస్తే, పాన్ సంస్కృతిని, బంధాలను సూచిస్తుంది. గయాకు చెందిన “మగహీ పాన్” దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. బీహార్‌లో పాన్ దుకాణాలు కేవలం వ్యాపార కేంద్రాలే కాదు, అవి రాజకీయ చర్చా వేదికలు. సాయంత్రం వేళల్లో ప్రజలు ఇక్కడే చేరి రాజకీయాలు, క్రికెట్ గురించి చర్చిస్తారు. ఎన్నికల సమయంలో నాయకులు ఈ పాన్ దుకాణాల వద్ద ఆగి, ప్రజలతో మాట కలపడం, ఒక ఫొటో దిగడం వంటివి చేస్తుంటారు. ఎందుకంటే ఆ ఒక్క క్షణం ఓటర్లతో బలమైన అనుబంధాన్ని ఏర్పరుస్తుంది. వేలాది కుటుంబాలు పాన్ సాగుపై ఆధారపడి జీవిస్తున్నాయి. నాయకులు తమ పర్యటనల్లో ఓటర్లతో పాన్ పంచుకోవడం, “మనం ఒకే మట్టికి చెందినవాళ్లం” అనే నమ్మకాన్ని కలిగిస్తుంది.

చేప, మఖానా, పాన్ కలిపి బీహార్ ఆర్థిక వ్యవస్థకు ఏటా రూ. 8,000 కోట్లకు పైగా ఆదాయాన్ని అందిస్తున్నాయి. అందుకే, రాజకీయ పార్టీలు వీటి గురించి మాట్లాడటం అంటే కేవలం ఆహారం గురించి కాదు, లక్షలాది కుటుంబాల జీవితాలు, వారి భవిష్యత్తు గురించి మాట్లాడటమే. ఈ మూడు పదార్థాలు బీహార్ ఓటర్ల నిజమైన నాడిని పట్టిస్తాయి.

ALSO READ: Landslide: హిమాచల్‌లో ఘోర విషాదం.. కొండచరియలు విరిగిపడి బస్సు ధ్వంసం, 18 మంది మృతి

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad