వీర తెలంగాణ సాయుధ పోరాటం విరమణ తర్వాత దేశంలో ఏర్ప డ్డ స్తబ్దతా వాతావరణాన్ని బద్దలు చేస్తూ నక్సల్ బరిలో రగిలిన నిప్పు రవ్వ దావనంలా శ్రీకాకుళం కొండలలో పెను మంటలు రేపింది. తెలుగు నేలపై పెల్లుబుకిన మహోద్యమం శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటం. శ్రీకాకుళ ఉద్యమ నిర్మాతల్లో కామ్రేడ్ పైలా వాసుదేవరావు ఒకరు. వీర శ్రీకాకుళ విప్లవోద్యమానికి ఒక చిరునామాగా నిలిచారు. త్యాగానికి ఆద ర్శానికి నిబద్ధతకు నిలువెత్తు దర్పణం ఆయన. విప్లవ రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. మచ్చలేని మహానాయకుడు. విప్లవోద్యమమే ఊపిరిగా శ్వాసించి జీవించి జీవితాంతం ప్రజల కోసం పరితపించి తనను తాను మండించుకున్న అజ్ఞాత విప్లవ సూర్యుడు కామ్రేడ్ పైలా వాసుదేవరావు. శ్రీకాకుళ విప్లవ ఉద్యమంపై ప్రభుత్వం తీవ్రనిర్బంధాన్ని ప్రయోగించింది. ఈ ఉద్యమం ఎన్కౌంటర్‌లకు హత్యలకు అణిచివేతలకు గురైనప్పుడు గుండె నిబ్బరంతో అమరులు ఎత్తిన జెండాను సమన్నతంగా నిలబెట్టి మలిదశ శ్రీకాకుళ ఉద్యమాన్ని నిర్మించి అవకాశవాదం విప్లవోద్యమానికి శత్రువు అని భావించి ప్రజాయుద్ధ పంథాను నిర్దేశించి అదే పంథాలో పార్టీని నడిపారు. కామ్రేడ్ సత్యనారాయణ సింగ్ నాయకత్వంలో ఉన్న సీపీఎంఎల్ పార్టీని ఆంధ్రాలో కమిటీ సీపీతో చర్చలు జరిపి పార్టీలను విలీనం చేశారు కామ్రేడ్ పైలా వాసుదేవరావు.
2010 ఏప్రిల్ 11వ తేదీన తీవ్రమైన క్యాన్సర్ తో మరణించారు పైలా. క్యాన్సర్ వ్యాధి అని తెలి సినా తాను మరణం అంచుల్లో ఉన్నానని గమనిం చినా చివరి క్షణం వరకు మరణాన్ని ధిక్కరించిన ఉద్యమ భవిష్యత్తు గురించి పరితపించినవాడు. మరణించి నప్పుడు ఆయన వయసు 78 సంవత్స రాలు. 1932 ఆగస్టు 11న శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం రెట్టుబాటులో జన్మించారు వాసుదేవరావు. విద్యార్థి దశలోనే కమ్యూనిస్టు పా ర్టీ రాజకీయాలకు ఆకర్షితులయ్యారు. 1953లో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అప్ప టినుండి అంతిమ శ్వాస వరకు ఏనాడూ వెను తిరగలేదు.
సోంపేట మండలం జీడిపుట్టుగా పలాస మండలం మాకనపల్లెలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ పార్టీ పూర్తి కాలం కార్యకర్త అవసరాన్ని గుర్తించి పార్టీ కోరిన వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఎర్రజెండా ప్రాణంగా పేద ప్రజలు విముక్తి లక్ష్యంగా బ్రతికారు. పార్టీ ఉద్యమ అవసరాల కోసం ఉద్దానంలో రాజాం కేంద్రంగా చేసుకొని తన కార్యచ రణ మొదలుపెట్టారు. 1960లో జరిగిన జిల్లా యోజన మహాసభలలో చురుకైన పాత్ర నిర్వహించారు. ప్రజలతో మమేకమై ప్రజల సంక్షేమం కోసం పనిచేశారు. పార్టీ బదిలీ చేస్తే ఫోర్త్ కాలం కార్యకర్తగా లీగల్‌గా వ్యవసాయ కూలీ రంగాన్ని ఆర్గనైజ్ చేశారు. తదనంతరం శ్రీకాకుళ సాయుధ పోరాటం ప్రారంభం నుండి అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారు. కామ్రేడ్ పైలా జీవితం వడ్డించిన ఇస్తరు కాదు. రాష్ట్ర జీవితం ప్రారంభించి నప్పటి నుండి అనేక పోలీసు దాడులు కాల్పులు ఎదుర్కొన్నాడు. తృటిలో తప్పించుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి. 1970లో దళ జీవితం గడుపుతున్న కామ్రేడ్ చంద్రమ్మను వివాహం చేసుకున్నారు. ఉద్యమ క్రమంలో తనకు పుట్టిన పురిటి బిడ్డను సైతం పెంపకానికి ఇచ్చేసారు. రక్తసంబంధం కంటే వర్గ బంధం గొప్పదిగా భావించి ఏజెన్సీ ఉద్యమంలో సహచరులు ఇద్దరూ భాగమయ్యారు. తన సహచరి చంద్రక్క 15 సంవత్సరాలు జైలు జీవితం గడిపినా ఉద్యమ కర్తవ్యాలు, ప్రజలే తమ కుటుంబంగా భావించారు. రివిజనిజం నుండి తెగతెంపులు చేసుకొని విప్లవకారుల బాటలో నడిచారు.
_________________________________________
READ ALSO:
ఆధునిక భారత సామాజిక విప్లవ దార్శనికుడు ఫూలే
రామకృష్ణ : మరో ప్రపంచం
_________________________________________
1968 నవంబర్ 25న ప్రారంభమైన శ్రీకాకుళ పోరాటం ప్రారంభం నుండి పైలావాసుదేవరావు కీలకమైన పాత్ర పోషించారు. రాష్ట్ర సమన్వ య కమిటీ సభ్యుడిగా కామ్రేడ్ పైలా వాసుదేవరావు చారు మజంధార్ లైన్ తీసుకున్నారు. శ్రీకాకుళ ఉద్యమ నాయకులు పంచాది కృష్ణమూర్తి, సుబ్బారావు పాణిగ్రాహి, వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం, తామాడ గణపతి వంటి అగ్రనాయకులతో కలిసి గ్రామీణ ప్రాంతాలలో తెగింపు సంఘాలు రహస్య దళాలని నిర్మించడంలో కీలకపాత్ర పోషించారు. శ్రీకాకుళ ఉద్యమం మీద నిర్బంధం తీవ్రతరమై పంచాది డాక్టర్ భాస్కర రావు, దేవినేని మల్లికార్జున్, సుబ్బారావు పాణిగ్రాహి, తామడ గణపతి వెంపటాపు, ఆదిభట్ల నిర్మల, అంకమ్మ సరస్వతి వంటి నేతలందరూ అమరులైన తర్వాత ఈ ఉద్యమాన్ని రక్షించుకోవడానికి ఈ ఉద్యమం తిరిగి నిలబెట్టడానికి ఉద్దానం నుండి పార్వతీ పురం వరకు విస్తృతంగా పర్యటించి శత్రునిర్బం ధం తప్పించుకుంటూ మారువేశాలలో అష్ట కష్టాలు పడి ఆదివాసీ కామ్రేడ్స్ ను ఏజెన్సీ వెళ్లి కలిశారు. ఉద్దానం ప్రాంతంలో మిగిలి ఉన్న దళ సభ్యులను కూడగట్టి ఆయన మళ్లీ దళాలు నిర్మించి ఉద్యమాన్ని ముందుకు నడిపారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చి ఉద్యమాన్ని నిలబెట్టారు. కొండపల్లి సీతారామయ్య, సత్య మూర్తి, రవూఫ్ కలిసి చర్చించి అనంతరం వీరి తో ఏర్పడ్డ రాష్ట్ర కమిటీకి పైలా రాష్ట్ర కార్యదర్శి గా ఎన్నికయ్యారు. చారు మజుందార్ నుండి వర్గ శత్రు నిర్మూలన పంథాను విభేదిస్తూ సత్య నారాయణ సింగ్ విప్లకారుల ఐక్యతకు కృషి చేస్తున్న తరుణంలో సత్యనారాయణ ఆనాటి కేంద్ర కమిటీ సభ్యుడు అయ్యారు. ఆంధ్రాలో చండ్ర పుల్లారెడ్డి నాయకత్వాన ఏపీఆర్సీసీ తో కలిసి చర్చించి రెండు పార్టీలు విలీనం చేయడంలో కీలకపాత్ర పోషించారు. 1975 పొట్ల రామ నరసయ్య రాష్ట్ర కార్యదర్శిగా ఏర్పడిన నూతన రాష్ట్ర కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు. రామనరసయ్య ఎన్కౌంటర్‌లో మరణించిన తర్వాత 1976 రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1989 వరకు రాష్ట్ర కార్యదర్శి బాధ్యత నిర్వహించారు.
84లో పార్టీ చీలిక గురైనప్పుడు అనంతరకాలంలోనే చీలిక వలన ప్రతిఘటన ఉద్యమ నిర్మాణం బలహీనపడి మితవాద రాజకీయాలు క్రమంగా ఆధిపత్యానికి వచ్చేయని గుర్తించాడు. పార్టీలో మితవాదానికి వ్యతిరేకంగా జీవితాంతం పోరాడారు. పార్టీలో ఇమడలేక బయటకి వెళ్లి ఏడు పార్టీల ఐక్యతల భాగమయ్యారు. అక్కడ కూడా ఇమడలేక తిరిగి సీపీఐఎంల్ న్యూ డెమొక్రసీ మాతృ సంస్థకు వచ్చివేసి సాధారణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కొనసాగారు. తాను చేసిన రాజకీయ తప్పిదాన్ని గుర్తించి శషభిషలు లేకుండా తనను తాను విమర్శ చేసుకొని ధైర్యంగా ప్రకటించుకున్నారు. ఆయన జీవితం విప్లవకారులకు ఆదర్శనీయం. ఆయన త్యాగం, ప్రదర్శించిన పట్టుదల, అంకితభావం నేడు విప్లవకా రులు అందిపుచ్చుకోవడమే కామ్రేడ్ పైలా వాసుదేవరావుకి ఇచ్చే నిజమైన నివాళి.
వంకల మాధవరావు
నేడు కామ్రేడ్ పైలా వాసుదేవరావు వర్ధంతి

