Chandrababu Naidu: “If you tell a big enough lie and tell it frequently enough, it will be believed.” – Walter Langer
ఒక అబద్ధాన్ని పదే పదే చెబుతూ పోతే దాన్ని ప్రజలు నమ్మేస్తారు. తిరుపతి లడ్డూ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసింది అదే. ఎన్నికల్లో విజయం సాధించ డాని కి, వైఎస్ జగన్ నాయకత్వంలోని వైస్సార్ కాంగ్రెస్ను ఓడించ డానికి అబద్ధాన్ని పదే పదే చెప్తూ వెళ్లారు. పవన్ కల్యాణ్ ఆ కట్టు కథను చెప్పడమే కాదు, ఆచరణలో దానికి మరింత బలాన్ని చేకూర్చారు.
తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందం టూ వైఎస్ జగన్ వైపు వేలెత్తి చూపుతూ వెళ్లారు. ప్రక్షాళన కోస మంటూ వేషం మార్చి బెజవాడ దుర్గమ్మ గుడి మెట్లను కడిగా రు. జంతువుల కొవ్వు కలిసిన లడ్డూలను వైఎస్ జగన్ అయో ధ్యకు పంపించి కలుషితం చేశారని కూడా ఆయన ఆరోపిం చారు. తాము చేస్తున్న ఆరోపణల్లో నిజం ఎంత అనే విషయం జోలికి వెళ్లడం వారికి ఇష్టం లేదు. తాము చెప్తున్న అబద్ధానికి ప్రజల నుంచి మద్దతు కావాలి. అది సాధించారు కూడా.
తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ వేసిన ప్రత్యేక దర్యాప్తు బందం (సిట్) తేల్చిన తర్వాత కూడా వారు తమ నాలుకను మడత పెట్టడం మానుకోలేదు. కల్తీ జరి గిందనే ప్రచారాన్ని ఉధృతం చేయాలని చంద్రబాబు తన నాయ కులకు, కార్యకర్తలకు నూరిపోశారు. తిరుపతి లడ్డూలో రసా యనాలు కలిశాయని సిట్ తేల్చింది. నిజమే, కానీ అది వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందా? దానికి వైఎస్ జగన్ ఎంత వరకు బాధ్యుడు అనే ప్రశ్నలకు వారు సమాధా నాలు ఇవ్వరు.
పామాయిల్‌ను నెయ్యిగా భ్రమింపజేశారని అంటున్నారు. కల్తీ జరిగిందనే అనుమానంతో కొన్ని ట్యాంకర్లను వెనక్కి పంపించినట్లు ఈవో శ్యాంరావు చెప్పారు. కల్తీకి దేశంలో ఏ పదార్థం మినహాయింపుగా వుంది? ఒక్క తిరుపతి లడ్డూ విష యంలోనే అది జరిగిందా? సరే, తప్పే జరిగిందని అనుకుం దాం. ముఖ్యమంత్రిగా వున్న జగన్ ఎప్పటికప్పుడు వెళ్లి పరీక్ష చేస్తారా? తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారుల ప్రమేయం వుండదా? ఇవన్నీ ప్రశ్నలే. బహుశా ఇవన్నీ జగన్, ఆయన అనుచరులు తప్పించుకోవడానికి వేసే ప్రశ్నలే అనుకుం దాం. కానీ, ప్రపంచవ్యాప్తంగా వున్న హిందు వుల మనో భావాలను దెబ్బ తీసే విధంగా జంతు కొవ్వు కలిసిందనే అబ ద్ధాన్ని ప్రచారం చేయడంలో చంద్రబాబుకు గానీ పవన్ కల్యా ణ్‌కు గానీ ఒనగూరే ప్రయోజనం ఏమిటి? ప్రజలను రెచ్చగొట్టి జగన్ వ్యతిరేకంగా తయారు చేయడమే కదా కావాల్సింది. జగన్‌ను ఓడించడానికి ఇతరేతర కారణాలు ఏవీ కనిపించక ఒక కట్టుకథను అల్లి ప్రచారం చేశారని అనుకోవాలా?
అబద్ధాన్ని పదే పదే చెప్పడం వల్లనే కాదు, వైఎస్ జగన్ క్రైస్తవుడు కావడం వల్ల కూడా ప్రజలు దాన్ని విశ్వసించారని అనుకోవచ్చు. జగన్‌ను హిందూ వ్యతిరేకిగా నిలబెట్టడానికి చంద్రబాబు గానీ ఆయన మిత్రపక్షమైన బీజేపీ నాయకులు గానీ చేయని ప్రయత్నమంటూ లేదు. దేవాలయాల విషయం లో అనేక అబద్ధాలను ప్రచారం చేస్తూ జగన్‌ను పచ్చి హిందూ వ్యతిరేకిగా చిత్రించే ప్రయత్నాలు చేశారు. వ్యక్తిగతంగా ఆయన కు ఏ మతాన్నైనా ఆచరించే హక్కు వుంది. కానీ ప్రజా జీవితం లో ఆయన ఎలా వున్నారనేది చూడాలి.
ఒక తిరుపతి లడ్డూ విషయంలోనే కాదు, ఎన్నికల సమ యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్ మీద విరుచు కుపడిన తీరు ఒకసారి గమనిస్తే పరిస్థితి మనకు అర్థమవుతుం ది. గ్రామ వాలంటీర్ల మీద చేసిన దుష్ప్రచారాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. వాలంటీర్లు అమ్మాయిలను మాయం చేస్తున్నార ని, అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించా రు. ఎంతమంది అమ్మాయిలు మాయమయ్యారో ఒక లెక్క కూడా ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపై చర్య లకు కూటమి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంది? ఏమీ లేదు. మద్యం కేసులను, ఇతర కేసులను బనాయిస్తున్న ప్రభు త్వం అతి ముఖ్యమైన అటువంటి విషయాలను ఎందుకు పక్కన పడేసింది? అందులో నిజం లేదు కాబట్టే అని అనుకోవాల్సి వస్తుంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమై నా దౌర్జన్యాలు ఆగిపోయాయా? ఏమీ ఆగలేదు. జరుగు తూనే వున్నాయి. వాటి మీద కచ్చితమైన చర్యలు తీసుకునే విషయం లో ప్రభుత్వం పూర్తిగా అలక్ష్యం వహిస్తున్నది. ప్రశ్నిస్తూనే వుం టానని చెప్పిన పవన్ కల్యాణ్ జవాబు చెపాల్సిన స్థానంలోకి వచ్చారు. కానీ ఆయన సమాధానం చెప్పరు. తమ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద వచ్చిన ఆరోపణలపై ఆయన స్పందించిన దాఖలాలు లేవు. నామమాత్రంగా విచారణ కోసం ఒక కమిటీ వేసి దులపరించుకున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో అటు వంటి సంఘటనలపై పవన్ కల్యాణ్ ఏ విధంగా స్పందించారో మనం గుర్తు చేసుకోక తప్పదు.
బాధ్యత గల రాజకీయ నాయకులుగా వ్యవహరించకుం డా చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ ఇష్టారీతిగా మాట్లాడు తూ వెళ్లారు. ఇరువురు నాయకులు కూడా ఇప్పుడు బీజేపీ నేతలను మించి ఆర్‌ఎస్ఎస్ భక్తులుగా మారిపోయారు. మతా నికీ రాజకీయాలకు మధ్య సంబంధాన్ని చెరిపివేయాల్సిన నేత లు హిందూ భావజాలాన్ని ప్రచారం చేస్తూ పబ్బం గడుపుతున్నారు.
సిద్ధాంతాలు లేని పార్టీలు ఏ జెండాకు ఆ గొడుగు పడు తాయి. ఇందుకు వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాం గ్రెస్ మినహాయింపు కాదు. దాదాపుగా ప్రాంతీయ పార్టీలకు సిద్ధాంతాలు వుండవు. ఇందుకు తమిళ పార్టీలు మినహాయిం పు. డీఎంకే ఇంకా తన సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్నది. కానీ బీజేపీతో చేతులు కలిపిన తర్వాత అన్నాడీయంకే దాన్ని వదిలేసింది. ఇటువంటి స్థితిలో ఆ పార్టీలు పోటీ పడి సంక్షేమ పథకాలనైనా ప్రకటించాలి లేదా ప్రజలను రెచ్చగొట్టే ప్రకటన లనైనా చేయాలి.
ఈ స్థితిలో మెజారిటీ హిందువుల మనోభావా లను రెచ్చగొట్టి వైసీపీపై వ్యతిరేకతను పెంచడానికి మాత్రమే తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందనే ప్రచారాన్ని చంద్రబాబు సాగించారని చెప్పాల్సి వస్తుంది.
నిజానికి, చంద్రబాబు నాయకత్వమే అబద్ధాల మీద నిర్మా ణమై వుంది. ఇటీవల ఆయన చేస్తున్న ప్రకటనలను చూస్తే కూ డా మనకు అది అర్థమవుతుంది. తన గొప్పతనాన్ని చెప్పుకోవ డానికి ఆయన ఎన్ని అబద్ధాలను ప్రచారంలో పెడుతున్నారో తెలుస్తూనే వున్నది.
హైదరాబాద్ నిర్మాణం నుంచి మొదలు పెడితే మైక్రోసాఫ్ట్ అధినేతగా సత్య నాదెళ్ల ఎదగడం దాకా అన్నింటినీ ఆయన తన ఖాతాలో వేసుకుంటున్నారు. అబద్ధాల ను పదే పదే చెప్తే ప్రజలు నమ్ముతారనే విషయం ఆయన అను భవంలోకి వచ్చింది. అందుకే వరుస పెట్టి ఆయన అబద్ధాలను వండి వారుస్తున్నారు. ఏమైనా, ప్రజలు వివేకవంతులు కాకపోతే బాధ్యతారహిత మైన రాజకీయ నాయకులు చెలామణి అవుతూనే వుంటారు. ప్రజలు వివేకవంతులు, విచక్షణాపరులు కాకుండా ప్రభుత్వా లు ఎప్పటికప్పుడు కనికట్టు చేస్తూనే వుంటాయి. విద్య వంటి రంగాలకు ప్రాధాన్యాన్ని తగ్గిస్తూనే వుంటాయి.
కాసుల ప్రతాపరెడ్డి
(రచయిత, సీనియర్ జర్నలిస్ట్)

