Telangana Intellectuals: రాజకీయ పక్షాలన్నీ ఒకే భాష మాట్లాడుతున్నాయి. అభివృద్ది గురించి నాయకులు చేసే ప్రసంగాలు అన్నీ ఒకే తీరుగా ఉన్నాయి. ఒకరు హైటెక్ సిటీ కట్టామంటే మరొకరు ఐటీ హబ్‌లకు నాంది పలికి రియల్ ఎస్టేట్ పెరిగిందని రై జింగ్ తెలంగాణ అంటూ మరొకరు. మా హయాంలో భూ ముల ధరలు పెరిగాయంటే లేదు మా హయాంలో అని పో టీ పడే దుస్థితి. భూముల ధరలు పెరిగితే ప్రభుత్వాల వైఫ ల్యం పేదలను మధ్యతరగతి వర్గాలను వనరులను సమకూ ర్చుకునే అవకాశాన్ని దూరం చేయడమే అనే సోయి ఎవరికి లేదు.
అభివృద్ధి అంటే వారు ఇచ్చుకున్న నిర్వచనం ప్రకారం పేదలకు కొన్ని సంక్షేమ పథకాలు ప్రకటించి అత్యధిక ప్రజా ధనాన్ని కొంత మందికే లబ్ధి పొందే విధానాలనే రూపొం దిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన 12 సంవత్సరాలలో ప్రభు త్వాల విధానాలతో తెలంగాణ రెండు తెలంగాణలుగా (టు ఇండియాస్ లాగా టు తెలంగాణాస్) రూపుదిద్దుకుంటుం ది. ఒక తెలంగాణ సామాన్యులు అందుకోలేనంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ. అయితే మరొక తెలం గాణ కోటి కలల కన్నీటి గానాల ఆకలి కేకల తెలంగాణ.
ఆకలి కేకల కన్నీటి గానాలు
తెలంగాణ సాధించాము కదా.. అన్నీ సమస్యలకు పరిష్కారం చేశాము చేస్తున్నాము కదా.. ఇంకా ఆకలి కేకల కన్నీటి గానాలు ఎందుకు, తెలంగాణ వెలిగిపోతుంది క దా.. విదేశీయులు ఎయిర్‌పోర్టు నుండి హైటెక్ సిటీ, హైటె క్స్, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ వచ్చి పారిస్, లండన్ అంటున్నారు కదా అనవచ్చు. కానీ ఈ ప్రకాశవంతమైన చిత్రానికి మరో వైపు మరొక తెలంగాణ ఉంది. ప్రాథమిక అవసరాల కోసం ఇంకా పోరాడుతున్న మరొక తెలంగాణ.
ఈ రెండు తెలం గాణల మధ్య అంతరం రోజురోజుకు పెరుగుతోంది. భవన నిర్మాణ కార్మికులు, పారిశుధ్య కార్మికులు, గృహ కార్మికు లు, పట్టణ పేదలు ఇరుకు గదులలో నివాసం, రక్షిత నీటి సౌకర్యాలు మరుగుదొడ్లు లేక గల్లీ చిన్నది అనే గోరేటి వెంక న్న పాటల ప్రతిబింబాలు, చిన్న ఉద్యోగులు, వలస కుటుం బాలు, గిగ్ కార్మికులు, కనీస వేతనాలు అందని అసంఘ టిత రంగ కార్మికులు, నిరుద్యోగులు, వాళ్ళను మత్తులో ముంచే బెల్ట్ షాపులు, డ్రగ్స్ మాఫియాలు, దానికి తోడు డిజి టల్ వ్యసనాలకు అలవాటు చేసిన డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‍లు, పలు ప్రభుత్వ కార్యాలయాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యో గాలు, గ్రామాలలో సన్న చిన్నకారు రైతులు, గుర్తింపుకు నోచుకోని కౌలు రైతులు, ప్రైవేటు విద్యా ఫీజుల దోపిడీ, దళితుల మీద దాడులు, ప్రశ్నిస్తే బెదిరింపులు, కేసులు, ప్ర జా రవాణా, వైద్యం, విద్య లేకపోవడం, అభివృద్ధి అంచుల్లో అసౌకర్యాలతో జీవన పోరాటంతో జీవిస్తున్నారు. ఇవి తెలంగాణ అసమానతలను స్పష్టంగా చూపిస్తున్నాయి.
అభవృద్ధి నమూనాలో సామాన్యులెక్కడ?
అభివృద్ధి పేరుతో, ఉద్యోగాలు వస్తాయనే పేరుతో ప్రభుత్వమే భూములను స్వాధీనం చేసుకుని పరిశ్రమలకు కేటాయించడం, నీరు భూమి వాయు కాలుష్య పరిశ్రమ లకు అనుమతులు ఇవ్వడం, కొంత పారితోషికాలు ఇచ్చి పేదలను నిర్వాసితులను చేసి మరింత పేదరికం లోకి నెడు తున్నది. అభివృద్ధి వలన స్థానికులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయనే గ్యారంటీ లేదు. హైటెక్ సిటీలో పనిచేస్తున్న వారిలో పెద్ద పెద్ద బిల్డింగులలో హౌస్ కీపింగ్ కాంట్రాక్టు కార్మికులుగా తెలంగాణ వాళ్ళే ఉన్నారు, ఉన్నత స్థానాలలో ఎక్కువ శాతం బయటివారే. అలాగే గృహ కార్మికులుగా పనిచేసే అత్యధిక శాతం తెలంగాణ మహిళలే.
సుస్థిర అభివృద్ధిలో వెనుకంజ
ఈ అసమానతలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (SDGs) గణాంకాల్లో మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆర్థిక వృద్ధి ఉన్నప్పటికీ, మానవ అభివృద్ధి సూచికలలో తెలంగాణ అనేక రాష్ట్రాల కంటే వెనుకబడి ఉంది. ఆకలి సూచికలో తెలం గాణ 21వ స్థానంలో ఉంది. ఆకలి కేకల గానం కొనసాగు తుంది. నాణ్యమైన విద్యలో 17వ స్థానంలో ఉంది. అసమా నతల తగ్గింపులో కూడా తెలంగాణ 27వ స్థానంలో ఉంది. వీటిని ధృవీకరించుకోవడానికి మన సౌకర్యవంతమైన ప్రదే శాల నుండి కొన్ని అడుగులు వేస్తే వాస్తవ దృశ్యాలు కనిపిస్తాయి.
తిరుగబడుతున్న గానాలు
మర్ల బడుతున్న రాగాలు
అయితే పోరు తెలంగాణలో తిరగబడ్డ గానాలు మర్ల బడ్డ రాగాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ గడ్డకు ఆ సోయి ఎప్పటికీ ఉంటుంది అని చెప్పడానికి న్యాయం కోసం పాఠ శాల, గురుకుల విద్యార్థుల నుండి మొదలుకొని పరిశ్రమ లు వెదజల్లే కాలుష్య వ్యతిరేక ఆహారపు హక్కును హరించే పరిశ్రమలకు వ్యతిరేకంగా పబ్లిక్ హియరింగ్ లలో ప్రజలు తమ గళాన్ని వినిపిస్తునే ఉన్నారు. పైన పేర్కొన్న రెండవ తెలంగాణలో నివసిస్తున్న అన్ని వర్గాల ప్రజలు తమ దుఃఖా లను విలిబుచ్చుతూనే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పెద్ద నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ ఉద్యమాలకు మద్ద తుగా పౌర సమాజం ప్రజల వెన్నంటి ఉంటున్నారు.
తెలంగాణ మేధావులు
పోరు తెలంగాణమా ఆకలి కేకల గానమా అంటూ నినదించిన తెలంగాణ ప్రజలు సుఖ శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని చెప్పిన బుద్ధి జీవులు మేధావులు తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వాలను సమర్ధించిన సమర్ధిస్తున్న మేధావి వర్గాలకు ప్రజల నుండి ‘మేధావు లెక్కడ’ అనే థంబ్ నెయిల్స్‌తో అనేక వత్తిడులు వస్తున్నాయి. ప్రభుత్వాలకు మద్దతు ఇస్తున్న మేధావులు ఈ నిరసనలను ఈ తిరగబడుతున్న గానాలను వివిధ రూపాలలో పాలకుల దృష్టికి తీసుకెళ్లడం అత్యంత అవసరం. వారి బాధ్యత కూడా. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న ఏ రాజకీయ పక్షమైనా సరే, పాలకుల ప్రాధాన్యతలను (వాళ్ళు చెపుతున్న అభివృద్ది నమూనాను) వెంటనే తగ్గించలేము, ఆ శక్తి కూడా లేదు. కానీ ప్రజల గొంతుకలుగా ప్రజల పక్షాన నిలబడి పాల కులకు నచ్చచెప్ప వలసిన అవసరం ఉన్నది.
అంతరాన్ని తగ్గించే తెలంగాణ కావాలి
తెలంగాణ ముందున్న అసలు ప్రశ్న, అభివృద్ధి ఉందా లేదా అనేది కాదు. ఆ అభివృద్ధి ఫలాలు అందరికీ చేరు తున్నాయా లేదా అనేదే. ఆదాయ గణాంకాలు మాత్రమే పురోగతిని చూపలేవు. విద్య, ఆరోగ్యం, నివాసం, గౌరవ ప్రదమైన జీవితం అందరికీ చేరినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. రెండు తెలంగాణల మధ్య ఉన్న ఈ అం తరాన్ని తగ్గించడం ఇప్పుడు అత్యవసరం. ప్రభుత్వ విద్య, ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజా రవాణాను మెరుగుపరచడం, పేదల భూమి, జీవన హక్కులను రక్షించ డం, సమాన అవకాశాలు కల్పించడం ఇవే సమగ్ర అభివృ ద్ధికి మార్గం. అభివృద్ధి అంటే కొంతమంది కోసం నిర్మించిన నగరం కాదు; అందరూ గౌరవంగా జీవించే సమాజం. తెలంగాణ భవిష్యత్తు అదే దిశగా సాగాలి.
తెలంగాణ ముందున్న అసలు ప్రశ్న అభివృద్ధి ఉందా లేదా అనేది కాదు. అభివృద్ధి ఎవరిని ముందుకు తీసుకె ళ్తోంది, ఎవరిని వెనుకకు నెట్టుతోంది అనేదే అసలు ప్రశ్న. రాజ్యాంగం చూపిన దారి స్పష్టంగా ఉంది, సామాజిక, ఆర్థి క న్యాయం. ఒక వర్గానికి మాత్రమే అనుకూలంగా మారే అభివృద్ధి చివరకు సమాజాన్ని విభజిస్తుంది.
తెలంగాణకు ఇప్పుడు వేగమైన వృద్ధి కాదు. మరింత న్యాయమైన వృద్ధి, బాలలందరూ చదువుకునే అవకాశం పొందే రాష్ట్రం, ప్రతి కుటుంబం ఆరోగ్య భయం లేకుండా జీవించే సమాజం, పౌరులందరికీ గౌరవప్రదమైన స్థానం కలిగిన ప్రజాస్వామ్యం ఇదే నిజమైన అభివృద్ధి. ఎత్తైన భవ నాలు, పెరిగిన ఆదాయం తెలంగాణను గొప్ప రాష్ట్రంగా మార్చవు. చివరి మనిషి జీవితంలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే తెలంగాణ నిజంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలుస్తుంది. రెండు తెలంగాణలు కాదు, ప్రతి ఒక్కరికీ సమా న అవకాశాలు ఉన్న ఒక్క తెలంగాణే నిజమైన అభివృద్ధి అని గుర్తించాలి.
దుఖం లేని ఆకలి లేని తెలంగాణ కోసం కలలు కన్న కేశవ్‌రావ్ జాధవ్, గద్దరన్నకు ఇంకా వేలాది అమరవీరు లకు నివాళులు. జై తెలంగాణ!
ఆర్. వెంకటరెడ్డి
సామాజిక కార్యకర్త

