Wednesday, October 30, 2024
Homeఓపన్ పేజ్Unemployment in India: నిరుద్యోగ సమస్యకు పరిష్కారం సాధ్యమే

Unemployment in India: నిరుద్యోగ సమస్యకు పరిష్కారం సాధ్యమే

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది నిరుద్యోగ సమస్యను తగ్గించడానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. కేవలం ఉద్యోగాల సృష్టికే లక్ష కోట్ల రూపాయలు కేటా యించే సూచనలు కనిపిస్తున్నాయి. గత ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పుడు, వికసిత్‌ భారత్‌ కు, అంటే 2047 నాటికి దేశం అగ్రరాజ్యంగా మారడానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఇందులో భాగం గా మూలధన వ్యయానికి, సంక్షేమ పథకాలను విస్తరిం చడానికి, ద్రవ్య లోటును జీడీపీలో 5.1 శాతానికి తగ్గించ డానికి కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఆర్థికంగా ఆచితూచి వ్యవహరించాలన్న కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం ఈ మధ్యంతర బడ్జెట్‌లో కనిపించింది. అయితే, బడ్జెట్‌ పరం గానే కాక, నాన్‌-బడ్జెట్‌ పరంగా కూడా నిరుద్యోగ సమ స్యకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం ఖాయమని అధికార వర్గాలన్నీ గణాంకాలతో సహా వెల్లడిస్తున్నాయి.
నిజానికి, ఈ ఏడాది ప్రారంభంలోనే ఇందుకు సం బంధించిన నిర్ణయాలు జరిగినప్పటికీ, ఆ తర్వాత దేశంలో ఎన్నికలు జరగడం, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మారిపోవడంతో కొత్త సమీకరణాలకు అవకాశం ఏర్ప డింది. బడ్జెట్‌ లో ఆశించిన మొత్తం కంటే రెట్టింపు మొత్తా న్ని, 2,10,874 లక్షల కోట్ల రూపాయలను రిజర్వు బ్యాం కు కేంద్ర ప్రభుత్వ ఖాతాలో వేసింది. ఫలితంగా, కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రాధాన్య అంశాలకు లక్ష కోట్ల రూపా యల వరకూ వ్యయం చేయడానికి అవకాశం ఏర్పడింది. కాగా, జూన్‌ 4వ తేదీన వెలువడిన లోక్‌ సభ ఎన్నికల ఫలితాలతో రాజకీయ పరిస్థితులు, ప్రాధాన్యాలు తారు మారయ్యాయి. పాలక పక్షానికి సంఖ్యా బలం తగ్గడంతో రాజకీయ పరిస్థితులతో పాటు ఆర్థిక పరిస్థితుల్లో కూడా మార్పు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఖజానాలో అదనంగా ఉన్న లక్ష కోట్ల రూపాయల నిధులతో పాటు, పన్నుల ద్వారా వసూ లయిన నిధులలో కొంత భాగాన్ని కూడా కొన్ని ప్రాధా న్యాలకు ఖర్చు చేయవలసిన అగత్యం ఏర్పడింది.
సరికొత్త పథకాలు
ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసిన బడుగు వర్గాల సంక్షేమం మీద మరింతగా ఖర్చు పెట్టడం మంచి దన్న సూచనలు కొన్ని వర్గాల నుంచి అందుతున్నాయి. అభివృద్ధికి, ఆదాయానికి ఊత మిచ్చే ప్రాథమిక సదుపా యాల మీద మూలధన వ్యయాన్ని పెంచాలనే అభిప్రా యం మరికొన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. నిజానికి సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను మరింతగా విస్త రించాల్సిన అవసరం కూడా ఉంది. సంక్షేమంలో భాగం గానే మధ్యతరగతి వర్గాలకు పన్నులు తగ్గించడం, దేశ వ్యాప్తంగా మహిళలకు మరింత నగదు బదలీ చేయడం, పట్టణ ఉపాధి కల్పన పథకాలు చేపట్టడం, కిసాన్‌ సమ్మాన్‌ నిధికి నిధులు పెంచడం వంటివి మరింత ఎక్కువగా చేపట్టడం అనివార్యమవుతోంది. వీటివల్ల ప్రజల్లో విని యోగ సామర్థ్యం, కొనుగోలు సామర్థ్యం పెరుగుతుం దని, ఇది ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి తోడ్పడుతుందని ఆర్థిక నిపుణులు కూడా సూచించడం జరుగుతోంది. అయితే, పన్ను చెల్లింపుదార్లకు ఏమైనా ఊరట లభిస్తుందా అన్నది కూడా ఆలోచించాలి.
ప్రాథమిక సదుపాయాల కల్పన మీద కూడా ఇప్ప టికే అత్యధిక మొత్తాలను ఖర్చు చేయడం జరుగుతుంది. వీటి మీద ఇప్పటికే 11.11 లక్షల కోట్ల రూపాయలు వ్యయం చేయడం జరిగింది. ఏటా కొన్ని రోడ్లను, కొన్ని రైల్వే లైన్లను, కొన్ని విమానాశ్రయాలను అభివృద్ధి చేయడం మాత్రమే సాధ్యమవుతుంది. ఇప్పటికే వీటి నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాలు అనేకం అమలు జరుగు తున్నాయి.
వీటన్నిటి కంటే కొత్త పట్టణాల నిర్మాణం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రాథమిక సదుపాయాలను విస్తరించడానికి అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి, బీజేపీ తన 2014 ఎన్నికల నాటి మేనిఫెస్టోలో దేశంలో వంద కొత్త పట్టణా లను అభివృద్ధి చేయడం జరుగుతుందని వాగ్దానం చేసింది. భారీ ఎత్తున పట్టణీకరణను చేపట్టాలనే ఉద్దేశంతో స్మార్ట్‌ సిటీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సరైన సౌకర్యాలు లేని పట్టణాలలో ఈ కార్యక్రమం కింద అనేక సౌకర్యాలను పెంచాలన్న లక్ష్యాన్ని కూడా పెట్టుకోవడం జరిగింది. అయితే, ఎంతో ఘనంగా దీని గురించి ప్రచారమైతే జరి గింది కానీ, ఆచరణలో మాత్రం దీని పరిస్థితి అంతంత మాత్రంగానే కనిపించింది.
నిపుణుల సలహాలు
కొత్త నగరాల నిర్మాణం, అభివృద్ధి వల్ల సరికొత్త ఆవిష్కారాలు చోటు చేసుకుంటాయి. కొత్త సంస్థలు ప్రారం భమై, యజమానులు, కార్మికుల మధ్య కొత్త సంబంధాలు ప్రారంభం అవుతాయి. దీనివల్ల ఉత్పాదకత పెరుగుతుంది. నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. ఆదాయాలు పెరుగు తాయి. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. నిజానికి, పట్ట ణాల ఆదాయ వృద్ధి సామర్థ్యాన్ని ప్రభుత్వాలు మొదటి నుంచి నిర్లక్ష్యం చేస్తూ వచ్చాయి. జనాభా లెక్కల ప్రకారం, దేశంలో మొత్తం 3,892 పట్టణాలు న్నాయి. అయితే, వాటికి పాలకుల నుంచి గానీ, పాలనా యంత్రాంగం నుం చి కానీ ఎటువంటి మద్దతూ లభించకపోవడం వల్ల అవి మరుగుజ్జుల్లా మిగిలిపోయాయి. వెంకయ్య నాయుడు 2015లో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, ‘పట్టణాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన స్థానిక సంస్థల ద్వారా పట్టణాభివృద్ధిని వీలైనంతగా ప్రోత్సహించాలి’ అని రాష్ట్రాలకు సూచించారు కానీ, చివరికి అటువంటిదేమీ జరగలేదు. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చోటు చేసుకోక పోవడం వల్ల పట్టణ ప్రజల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారైంది.
పట్టణాల నిర్మాణం వల్ల అటు ఆర్థికంగానే కాకుండా, ఇటు రాజకీయంగా కూడా లబ్ధి పొందే అవ కాశం ఉంది. అందువల్ల పట్టణీకరణకు ఎంత ప్రాధాన్యమిస్తే అంత మంచిది. లక్ష కోట్ల రూపాయల మిగులు నిధులను పూర్తి గా కానీ, పాక్షికంగా గానీ పట్టణాభివృద్ధికి మూలధనంగా కేటాయించడం మంచిది. మిగిలిన నిధులను ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో సమకూర్చుకోవడం సాధ్యమవు తుంది. ప్రతి ప్రభుత్వమూ కనీసం ఒకటి రెండు పట్టణా లను నిర్మించే చేసే పక్షంలో కేంద్రం మిగిలిన పట్టణాలను నిర్మించడానికి, అభివృద్ధి చేయడానికి అవకాశం ఉం టుంది. అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న జిల్లాల్లో గానీ, పారిశ్రామిక నడవాల సమీపంలో గానీ కొత్త పట్టణా లను నిర్మించడం వల్ల అవి శీఘ్రగతిన అభివృద్ధి చెంద డానికి వీలుంటుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబు నాయుడు అమరావతిని ఒక ఐ.టి ప్రాధాన్య పట్టణంగా లేదా నగరంగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. మహారాష్ట్ర కూడా ముంబై విమా నాశ్రయానికి దగ్గరలో ఒక హైపర్‌ సిటీని నిర్మించడం వల్ల అది శీఘ్రగతిన అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది.
కొత్తగా నిర్మాణం అవుతున్న పట్టణాల చుట్టూ సహ జంగానే అనేక అవకాశాలు, అనేక అనుబంధ కార్యకలా పాలు ఊపందుకుంటాయి. వీటి వల్ల ఉపాధి అవకాశాలు, ఉద్యోగావకాశాలు గణనీయంగా వృద్ధి చెందుతాయి. ప్రజల జీవనశైలి అనూహ్యంగా మారిపోతుంది. అవకా శాలు పెరగ డంతో విదేశీ పెట్టుబడులు కూడా వెల్లువెత్తుతాయి. జీవనశైలి మెరుగుపడడం, వ్యాపారాలు విస్తరించడం, పాలన పటిష్ఠం కావడం వంటివి కలగలసి, ఆదాయావకాశాలు వృద్ధి చెందుతాయి. 2050 నాటికి గ్రామీణ ప్రజానీకమంతా పట్టణాలకు వలస రావడం వల్ల భారతదేశంలో కొత్తగా 50 లక్షల నూతన ఆవాసాలు అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఇటీవల ఐక్యరాజ్య సమితి కూడా వెల్లడించింది. అంటే, భారతదేశ 150 కోట్ల జనాభాలో సగం మంది పట్టణాలు, నగరాల్లోనే నివసించే అవకాశం ఉంది. అందువల్ల కొత్త ఆవాసాలు సృష్టించడమ నేది ఇప్పటి నుంచే ప్రారంభం కావలసి ఉంది. కొత్త నగ రాలు, పట్టణాలను సృష్టించడం వల్ల ఆర్థికంగా, సామాజి కంగానే కాక, రాజకీయంగా కూడా ఎంతో ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా నిరుద్యోగ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించాలన్న పక్షంలో కొత్త నగరాలు, పట్టణాల నిర్మాణం అనివార్యం, అత్యంత ఆవశ్యకం.

- Advertisement -

జి. రాజశుక

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News