Indian GDP Growth: బడ్జెట్ అంటే కూడికలు, తీసివేతలకే పరిమిత మవ్వదు. ప్రజల జీవన ప్రమాణాలతో ముడిపడి ఉంటుంది. ఈ సత్యాన్ని గమనించి బడ్జెట్ రూపక ల్పనచేసే విధానం మోడీ ప్రభుత్వంలో ఒక ప్రజాస్వా మ్య కర్తవ్యంగా కొనసాగుతున్నది. భారత స మాజం ప్రగతికారకంగా ముందుకు సాగాల్సిన దిశను సూచిం చే విధాన ప్రకటనగా ఇది నిలుస్తున్నది.
ఈ బడ్జెట్‌లో సామాజిక న్యాయం సంక్షేమ నినా దంగా పరిమితం కాలేదు. సమాజంలోని ప్రతి వర్గం అభివృద్ధి ప్రయాణంలో భాగస్వామిగా మారాలన్న దార్శనిక దృష్టిపథం దీనికి ఆధారం. ఉపాధి గౌరవం, ఆదాయ భద్రత, విద్య – ఆరోగ్య అవకాశాల విస్తరణ ద్వారా సామాజిక సమతుల్యతను బలపరచాలన్న ఆలోచన ఇందులో వ్యక్తమైంది. ఆర్థిక వృద్ధి కొద్దిమంది లోనే కేంద్రీకృతం కావడం వల్ల సమాజంలో ఏర్పడే అసమతుల్యతను నివారించే విధాన రూపకల్పనగా ఈ బడ్జెట్‌ను చూడాలి.
ఈ నేపథ్యంతో చూస్తే, 2026-27 కేంద్ర బడ్జెట్ లెక్కల పత్రంగా మాత్రమే కనిపించదు. ఉపాధి, ఆదా యం, జీవన భద్రత వంటి అంశాలు ప్రజల దైనందిన జీవితంలో ఎలా ప్రతిఫలించాలన్న ఆలోచన దీనిలో మౌలికంగా నిక్షిప్తమైంది. ఆర్థిక నిర్ణయాలు సమాజ జీవన నిర్మాణాన్ని బలపరచే సాధనాలుగా మారే ప్రయ త్నం స్పష్టంగా దర్శనమిస్తుంది.
ఈ బడ్జెట్‌ను దార్శనిక దృష్టిపథంలో పరిశీలిస్తే, అభివృద్ధి భావన ఆర్థికవృద్ధితో పరిమితంగా నిలవదు. సమాజ జీవన సమతుల్యత, ఉపాధికి గౌరవం, అవకా శాల విస్తరణ వంటి అంశాలు ఆర్థిక విధానాల్లో సహ జంగా కలిసిపోయాయి. వికసిత్ భారత్ లక్ష్యం నినాద స్థాయిలో నిలవడం లేదు. ప్రజల జీవన స్థాయిలో మా ర్పుగా రూపుదిద్దుకుంటున్నది.
ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపాదించిన వికసిత్ భారత్ ఆలోచన ఈ బడ్జెట్‌లో కార్యాచరణ రూపం దా ల్చింది. అభివృద్ధి ప్రయాణం ప్రజల జీవితాల్లో ప్రత్య క్షంగా కనిపించాలన్న భావన దీనికి కేంద్రబిందువు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తొమ్మిదవ బడ్జెట్ ఇ ది. అనుభవం, ఆర్థిక క్రమబద్ధత, సామాజిక స్పృహ కలి సిన ప్రజెంటేషన్‌గా ఇది నిలిచింది.
మౌలిక వసతులు – అభివృద్ధికి పునాది
ఈ బడ్జెట్‌లో ప్రజా మూలధన వ్యయం రూ.12.2 లక్షల కోట్లకు చేరింది. 2014-15లో రూ.2 లక్షల కోట్ల స్థాయి నుంచి ఈ దశకు చేరుకోవడం ప్రభుత్వ అభివృద్ధి దిశను స్పష్టంగా చూపిస్తుంది. రహదారులు, రైల్వేలు, పట్టణ మౌలిక వసతుల నిర్మాణం ఉపాధి అవకాశాలను విస్తరించడమే కాకుండా ప్రాంతీయ ఆర్థి క చలనాన్ని బలపరుస్తున్నది.
తయారీ రంగం – ఉపాధితో అనుసంధానమైన వృద్ధి
తయారీరంగంలో ఏడు వ్యూహాత్మక రంగాలపై దృష్టి కేంద్రీకరించారు. బయోఫార్మా శక్తికి రూ.10,0 00 కోట్లు, సెమీకండక్టర్ మిషన్ 2.0, ఎలక్ట్రానిక్స్ భాగాల తయారీకి రూ. 40,000 కోట్ల కేటాయింపులు దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని బలపరు స్తున్నాయి. ఇవి యువతకు నైపుణ్య ఆధారిత ఉపాధి మార్గాలను విస్త రించే చర్యలుగా నిలుస్తున్నాయి.
ఎంఎస్ఎంఈలు – స్థానిక ఆర్థికవ్యవస్థకు శక్తి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల కోసం రూ.10,000 కోట్ల గ్రోత్ ఫండ్ ఏర్పాటు, సూక్ష్మ సంస్థ లకు అదనంగా రూ.2,000 కోట్ల మద్దతు చిన్న వ్యాపా రాలకు స్థిరత్వాన్ని ఇస్తున్నాయి. నగదు ప్రవాహాన్ని సులభతరం చేసే చర్యలు గ్రామీణ – పట్టణ ఆర్థిక వ్యవస్థలను చైతన్యవంతం చేస్తున్నాయి.
వ్యవసాయం – ఆదాయ వృద్ధికి మార్గాలు
వ్యవసాయ రంగం ఈ బడ్జెట్‌లో కొత్త ఆలోచనతో ముందుకు సాగుతున్నది. మత్స్యరంగం, పశుసంవర్ధక రంగం, అధిక విలువ పంటలపై తీసుకున్న చర్యలు రైతు ఆదాయం పెరిగే దిశగా ఉన్నాయి. కోకోనట్, కా జూ, కోకో, సాండల్‌వుడ్ వంటి పంటలకు ఇచ్చిన ప్రా ధాన్యం ప్రాంతీయ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలను బలపరుస్తున్నది.
మహిళలు, బాలికలు – భవిష్యత్‌కు పెట్టుబడి
ప్రతి జిల్లాలో బాలికల హాస్టల్ ఏర్పాటు ప్రతిపాద న విద్యలో కొనసాగింపుకు కీలకంగా మారుతుంది. దూర ప్రాంతాల నుంచి ఉన్నత విద్యకు వచ్చే బాలికల కు ఇది భద్రతతో కూడిన వాతావరణాన్ని అందిస్తుంది. మహిళల కోసం ఉపాధి, వ్యాపార ప్రోత్సాహక చర్యలు కుటుంబ ఆర్థిక స్థిరత్వాన్ని బలపరుస్తున్నాయి.
పీఎం విశ్వకర్మ యోజన –సంప్రదాయ ఉపాధికి స్థిర దిశ
తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయ వృత్తు లు ఇప్పటివరకు ప్రభుత్వ వ్యవస్థలో సరైన మద్దతు పొందలేకపోయాయి. 2026-27 కేంద్ర బడ్జెట్ ఈ పరిస్థితిని మార్చే దిశగా ముందుకు సాగింది. పీఎం విశ్వకర్మ యోజన ద్వారా కమ్మరి, వడ్రంగి, కుమ్మరి, స్వర్ణకారుడు వంటి వృత్తిదారులకు నైపుణ్య శిక్షణ, పరి కరాల మద్దతు, తక్కువ వడ్డీ రుణాలు, మార్కెట్ అను సంధానం లభిస్తున్నది. ఇది ఉపాధికి గౌరవం కల్పించే ఆర్థిక విధానంగా నిలుస్తున్నది.
యువత, సేవల రంగం – ఉద్యోగ అవకాశాల విస్తరణ
ఆరోగ్యం, పర్యాటకం, సేవల రంగాల్లో నైపుణ్యాభి వృద్ధికి ఇచ్చిన ప్రాధాన్యం యువతకు కొత్త వృత్తి మా ర్గాలను తెరుస్తున్నది. వచ్చే ఐదేళ్లలో లక్ష మంది అల్లైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ తయారీ లక్ష్యం దేశ ఆరోగ్య మౌలిక వ్యవస్థకు బలం ఇస్తుంది.
ఆర్థిక నిర్వహణ – విశ్వాసానికి ఆధారం
ప్రభుత్వ ఖర్చులు నియంత్రితంగా సాగుతూ, అప్పుల భారం క్రమంగా తగ్గే దిశలో ఈ బడ్జెట్ అడు గులు వేసింది. సామాజిక రంగాలపై ఖర్చు కొనసాగు తూనే ఆర్థిక స్థిరత్వం నిలబెట్టే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది.
భారత ఆర్థిక వ్యవస్థపై దేశీయ-అంతర్జాతీయ విశ్వాసం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా బులెటిన్ ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి సుమారు 7.4 శాతం స్థాయిలో కొనసాగుతుందని అంచనా వెలువడింది. ప్రభుత్వ పెట్టుబడులు, దేశీయ వినియోగం, సేవల రం గం ఈ వృద్ధికి ఆధారాలుగా పేర్కొనబడ్డాయి. ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జియే వా భార త్‌ను ప్రపంచవృద్ధికి ముఖ్య ఆధారంగా వివరించా రు. ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్టర్ డేవిడ్ రూబెన్‌స్టీన్ ప్రభుత్వ వ్యయం ప్రజల జీవన ప్రమాణాల్లో స్పష్టమైన మార్పు గా ప్రతిఫలిస్తున్న దేశంగా భారతను అభివర్ణించారు.
ప్రజల వరకూ చేరే ప్రభుత్వ వ్యయం
ప్రత్యక్ష నగదు బదిలీ, డిజిటల్ లావాదేవీలు, లబ్ధి దారుల ఆధారిత వ్యవస్థల వల్ల ప్రభుత్వ సహాయం నేరుగా ప్రజల చేతుల్లోకి చేరుతున్నది. ఈ అంశాన్ని
ఆర్‌బీఐ కూడా ప్రస్తావిస్తూ, ప్రభుత్వ ఖర్చు ప్రజల జీవితాల్లో స్పష్టమైన ప్రభావాన్ని చూపుతున్నదని పేర్కొన్నది.
2026-27 కేంద్ర బడ్జెట్ ఒక స్పష్టమైన సంకేతా న్ని ఇస్తుంది. అభివృద్ధి అనేది లెక్కల పరిమితిలో నిలవడం లేదు. ప్రజల జీవన ప్రమాణాల్లో కనిపించే మార్పే దానికి అసలు అర్థం. దార్శనిక దృష్టిపథంలో రూపొందిన ఈ బడ్జెట్ వికసిత్ భారత్ ప్రయాణానికి ముఖద్వారంగా నిలుస్తూ, దేశాన్ని స్థిరమైన అభివృద్ధి దిశగా నడిపిస్తున్నది.
విద్యార్థి సంఘాలకు ఎన్నికలు – ఆవశ్యకత
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలు, డిగ్రీ, పీజీ కళాశా లలు కేవలం విద్యాబోధన కేంద్రాలుగా మాత్రమే కాక ప్రజాస్వామ్య వి లువలను నేర్పే సామాజిక పాఠశాలలుగా ఉండాలంటే విద్యా ప్రాంగ ణాల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలి. విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించ లేకపోవడం వల్ల విద్యార్థుల హక్కులు హరించబ డుతున్నాయి. విద్యాలయాల్లో ప్రజాస్వామ్య సంస్కృతి క్షీణిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నియమించిన విద్యా కమిషన్ కూడా ఇటీవలే విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించా లనే చారిత్రాత్మక, ప్రజాస్వామిక డిమాండ్ చర్చలోకి వచ్చింది.
విద్యాసంస్థల్లో విద్యార్థి సంఘాల పాత్ర
విద్యార్థి సంఘాలు విద్యార్థుల సమస్యలకు గొంతుగా నిలుస్తాయి. ఫీజుల పెంపు, హాస్టల్ సదుపాయాలు, స్కాలర్‌షిప్‌ల ఆలస్యం, అకడమిక్ సమస్యలు, సామాజిక వివక్ష వంటి అంశాలపై యాజమాన్యాల దృష్టిని ఆకర్షించడంలో సంఘాల పాత్ర కీలకం. విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం ద్వారా విద్యార్థి ప్రాతినిధ్యం ఎప్పటికప్పుడు ప్రభుత్వాలకు, విశ్వవిద్యాలయాల పాలక మండళ్లకు ప్రాతినిధ్యాన్ని ఇస్తాయి. తమ సమస్యలు పరిష్కరించాలని పోరాడుతున్న విద్యార్థులకు, విద్యార్థి సంఘా లకు ఎన్నికలు నిర్వహించడం ద్వారా వారి పోరాటాలకు నైతిక, ప్రజా స్వామ్య బలం ఇస్తుంది.
ప్రజాస్వామ్య శిక్షణ కేంద్రాలు
విద్యార్థి సంఘాల ఎన్నికలు విద్యార్థులకు ప్రజాస్వామ్య పాఠాలను నేర్పే ప్రత్యక్ష వేదికలుగా ఉంటాయి. ఓటు హక్కు వినియోగం, ప్రచారం, వాదన, విమర్శ, బాధ్యతాయుత నాయకత్వం వంటి విలువలు విద్యార్థి జీవితంలోనే అలవడతాయి. ఇవే భవిష్యత్‌లో సమాజానికి చైతన్యవం తమైన పౌరులను తయారు చేస్తాయి.
లింగ్డో కమిటీ మార్గదర్శకాలు
సుప్రీం కోర్టు ఆదేశాలతో 2005లో జస్టిస్ లింగ్డో కమిటీ విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చిం ది. ఖర్చుల పరిమితి, హింసరహిత ప్రచారం, అకడమిక్ సమతుల్యత వంటి అంశాలతో ఈ మార్గదర్శకాలు ఎన్నికలను ఆరోగ్యకరంగా నిర్వ హించే విధంగా ఉండాలని సూచించింది. కానీ నేటికీ అవి అమలులో లేవు. విద్యార్థులు చైతన్యమంతమైతే పాలకులను ప్రశ్నిస్తారని, వినకుంటే వ్యతిరేకంగా పోరాడుతారని ఒక పథకం ప్రకారం కుట్రతోని విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం లేదు.
ఎన్నికలు లేనప్పుడు వచ్చే నష్టాలు
ఎన్నికలు నిలిపివేయడం వల్ల విద్యార్థుల్లో నిరాశ, నిర్వీర్యత పెరుగు తుంది. విద్యార్థుల నిజమైన అధికారిక ప్రాతినిధ్యాలు ఉండవు. అడ్హాక్ కమిటీలకు విద్యార్థుల మద్దతు ఉండదు. ఫలితంగా సమస్యలు పరిష్కరిం చబడవు. ఉదాహరణకు రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్ విడుదల కాక ప్రైవేటు యాజమాన్యాలే కాదు, ప్రభుత్వ విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి.
ఉస్మానియా యూనివర్సిటీకి దాదాపు 100 కోట్ల ఫీజు రియంబర్స్మెం ట్ రావాల్సి ఉంది. కానీ దానిని ఎవరూ అడగడం లేదు. అడిగినా ప్రభు త్వాలు పట్టించుకునే స్థితిలో లేవు. విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వ హించడం ద్వారా ఎన్నికైన విద్యార్థి సంఘం ఇలాంటి మౌలిక సమస్య లను డిమాండ్ చేసి వాటిని సాధించే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు తెలంగాణలో కేవలం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ కూడా సకాలంలో ఎన్నికలు జరగడం లేదు.
ఇటీవలే మౌలానా ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయం భూములను ప్రభుత్వం లాక్కుంది. దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. మా భూములు మాకే కావాలని నినదించారు. దానితోపాటు యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని తద్వారా తమ హక్కులు కాపాడ బడతాయని విద్యార్థులు నినదించడం విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలానే ప్రజాస్వామ్య హక్కును మరొకసారి చర్చలోకి తీసుకొచ్చింది.
తెలంగాణ సందర్భం
తెలంగాణ ఒక ప్రజాస్వామ్య ఉద్యమాల నేల. విద్య, ఉద్యోగం, ఆత్మ గౌరవం కోసం సాగిన పోరాటాల చరిత్ర ఇక్కడి విద్యార్థి ఉద్యమాలకు ఉంది. అటువంటి రాష్ట్రంలో విద్యార్థి సంఘాల ఎన్నికలు లేకపోవడం చరిత్రకు విరుద్ధం. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలంటే, క్యాంపస్ డెమోక్రసీ, అటానమసీ కాపాడాలంటే, పెరుగుతున్న కోర్స్ ఫీజులు ఎగ్జామినేషన్ ఫీజులకు వ్యతిరేకంగా ఉద్యమించాలంటే విశ్వవిద్యాల యాల్లో విద్యార్థి ఉద్యమాలపై నిర్బంధం పెరగకుండా ఉండడానికి సమాజం ప్రజాస్వామిక దృక్పథం అరవర్చుకోవడానికి విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం తక్షణ అవసరం.
సరైన రాజకీయ అవగాహన పెంపొందించుకున్న విద్యార్థులు సామాజిక చైతన్యంతో ప్రజా ఉద్యమాలు చేసేవారు. సాంప్రదాయక రాజకీయాల్లో కూడా రాజకీయ నాయకులుగా ఎదిగి అంతో ఇంతో నైతిక విలువలు కలిగి ఉండి కొద్ది మేరకైనా ప్రజలకు సేవ చేసేవారు. కానీ నేడు పార్లమెంటులో గాని, రాష్ట్రాల్లో గాని ఎంపీ లుగా, ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతున్నటువంటి రాజకీయ నాయకులలో బడా కార్పొరేటు, పెట్టుబడిదారులు, వ్యాపారులు, కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు ఉండడాన్ని మనం గమనించొచ్చు. దీని ద్వారా భారత పార్లమెంటరీ వ్యవస్థ రోజురోజుకు ఎంత దిగజారి పోతుందో మనం చూడవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత
రాష్ట్ర ప్రభుత్వం, విశ్వవిద్యాలయ పరిపాలనలు లింగ్డో కమిటీ మార్గదర్శకాల ప్రకారం వెంటనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలి. అదే విధంగా యూజీసీ మార్గదర్శకాల ప్రకారం అటానమస్ కాలేజీలకు సొం తంగా ఆయా కాలేజీలు యూనివర్సిటీలు ఎన్నికలు నిర్వహించుకునే అధికారం ఉంది. ఎన్నికలు నిర్వహించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఎన్నికల నిర్వహణకు అవసరమైన వనరులు, భద్రత, పారదర్శకతను కల్పించాలి.
విద్యార్థి సంఘాల ఎన్నికలు విలాసం కాదు – హక్కు. ప్రజాస్వామ్యా నికి పునాది. అది విద్యార్థి దశలోనే పడాలి. తెలంగాణలో అన్ని విద్యా సంస్థల్లో వెంటనే విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించడం కాలాను గుణ అవసరం. విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల గొంతుక వినిపించడానికి సాధ్యమవుతుంది. ఈ ప్రజా స్వామికమైన డిమాండ్‌ను అమలు చేయాలని PDSU రాష్ట్ర కమిటీ ఆధ్వ ర్యంలో హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఫిబ్రవరి 3న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తునాము. విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్న ప్రజాస్వామికవాదులు, మేధా వులు, విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు పాల్గొంటారు.
డాక్టర్ వకుళాభరణం
కృష్ణ మోహన్ రావు
మాజీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్

