Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్UNO fails: ఐక్యరాజ్య సమితిని రద్దు చేయండి

UNO fails: ఐక్యరాజ్య సమితిని రద్దు చేయండి

ప్రపంచ శాంతి కాపాడలేని సంస్థ ఎందుకు?

విశ్వంలో శాంతి అనేదే లేదు. ఏదో ఒక దేశం మరో దేశం పై దాడి చేస్తూనే ఉంది. నిజంగా అంతర్జాతీయ శాంతి పిచ్చివాడు కనే కల నే, ఈ మాటలు ముస్సోలిని చేపినట్లుగానే ఈ రోజుల్లో ఏ దేశం శాంతిగా లేదు. ప్రపంచంలో శాంతి అనే మాటకు విలువ లేకుండా పోతోంది. రష్యా, ఉక్రైన్ యుద్ధం, హమాస్ పై ఇజ్రాయెల్ దాడి, తాజాగా ఇజ్రాయెల్ పై ఇరాన్ పోరాటం ఇవన్నీ విశ్వానికి ప్రమాదకరం. అటు ఉత్తరకొరియా కూడ బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. ఈ నేపథ్యంలో యుద్ధ మే ఘాలు అంతటా అలుముకున్నాయి. అసలు శాంతి అనే మాటే వినపడటం లేదు. ఏ క్షణంలో ఐక్యరాజ్య సమితి ఏర్పడిందో కాని, దాని మాట ఎవరు పట్టించు కోవటం లేదు. సమితి కార్యదర్శి అంటేనే లెక్క లేకుండా పాయింది. అయనకు స్పష్టమైన అధికారాలు లేవు. అవన్నీ అగ్రదేశం గుప్పిట్లో ఉన్నాయి. అమెరికా మద్దతుతోనే ఉక్రైన్ యుద్ధం ఇంకా జరుగుతోంది. ఇప్పుడు పశ్చిమ ఆసియాలో కూడ అమెరికా ఇజ్రాయెల్ కే మద్దతు ఇచ్చింది. యుద్దాలను నిలువరించటం పోయి అగ్రదేశం మద్దతు పలకటం శోచనీయం. ఇంక ఐక్యరాజ్య సమితి ఎందుకు. దానికొక కార్యదర్శి, సిబ్బంది, ఒక సింబల్ మరియు అనుబంధ సంస్థలు. వీటికే ఖర్చు తడిసి మోపెడు అవుతోంది. శాంతి స్టాపనకు కేవలం మాటలు రూపంలోనే ఆది స్పందిస్తోంది. కార్యాచరణకు దిగడం లేదు. అసలు ఐక్యరాజ్య సమితికి సొంత సైన్యం లేదు. చర్చల ద్వారా సమస్యను పరిష్క రించుకోవటానికి అనువైన వాతావరణం లేదు. జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు డేన్నిస్ ఫ్రాన్సిస్ చర్చలే సమస్యకు పరిష్కారం అని చెప్పినా ఆది మాటల వరకే ఉండి పాయింది. ఇలా దేశాలు తమ సొంత నిర్ణయాలతో , తమ దగ్గర వున్న అణు ఆయుధాలతో పెట్రేగి పోతున్నాయి. ఇది మిగతా దేశాలకు కూడ ప్రాకుతుంది.ఉత్తర కోరియ కూడ తన శత్రు దేశం పైన ఎప్పుడైనా దాడి చేయవచ్చు. అలాగే చైనా కూడ భారత్ పై కాలు దువ్వడానికి సిద్ద పడిన పడవచ్చు. అయితే భారత్ పై దాడి అంత సులువు కాదు. ఇజ్రాయెల్, ఉక్రైన్, ఇరాన్ చిన్న దేశాలు ఇక్కడ అమెరికా, ఇజ్రాయెల్, ఉక్రైన్ దేశాలకే తన సపోర్ట్ ఇస్తోంది. ముఖ్యంగా నెతన్యాహు, బైడెన్ కు స్నేహ సంబంధాలు మిక్కు టంగా ఉన్నాయి. ఉక్రైన్ చిన్న దేశమే అయినా భారీ సహాయం దానికి అందుతోంది.
ఇరాన్ ఒక ముస్లిం దేశం కనుక దాని ప్రక్కన నిలబడ లేదు. ముందు సిరియా లోని ఇరాన్ కాన్స్ లేట్ భవనం పై ఇజ్రాయెల్ దాడి చేసింది. దానికి ఇరాన్ ప్రతీకారం తప్పదు అని ఘాటుగానే సమాధానం ఇచ్చింది. ఇజ్రాయెల్ ని అప్పుడు అగ్రదేశం వారించి ఉంటే సరిపోయేది. ఇజ్రాయెల్ కూడ ఇరాన్ కు సర్ది చెప్పి ఉంటే సరిపోయేది. నేడు ఈ విపత్కర పరిస్థితి వచ్చేది కాదు. ప్రతీకారం తో ఇరాన్ రగిలి దాదాపు రెండువందలకు పైగా డ్రోన్ ల దాడి చేసింది. నష్టం తీవ్రంగా జరిగినా వాటిని కూల్చేశాం అని ఇజ్రాయెల్ చెబుతోంది. ఏది ఏమైనా నష్టం అటు ఇజ్రాయెల్ కు, ఇటు ఇరాన్ కు సంభవించింది. ఇవి దేశాల సామర్ధ్యం చూసుకుంటున్నాయే కాని పౌరుల భద్రత, దేశ సంక్షేమం చూసుకోవడం లేదు. యుద్ధం లో మాదే పై చేయి అనే లక్ష్యం తోనే మొండిగా ఉన్నాయి. అటువంటి మొండి వైఖరే నేడు ఉక్రైన్ అవలంబిస్తోంది.
ఈ యుద్దాలా పట్ల భారత్ కలవర పడుతోంది. ఇది యుద్దాల యుగం కాదు. దేశాలు శాంతి బాట పట్టాలి అనేదే భారత్ ఆకాంక్ష. కాని ఇప్పటికే అటు రష్యా, ఇటు ఉక్రైన్, ఇజ్రాయెల్, గాజ, ఇరాన్ ఎంతో నష్ట పోతూన్నాయి. రష్యా, ఉక్రైన్ లో శిధిలమైన భవనాలు అందమైన తోటలు వికృత రూపంలో ఉన్నాయి. ఇక గాజ, రాఫాలో అయితే చెప్పలేం. ఇప్పటికీ అక్కడ శవాలే కనిపిస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ తమ వారి కోసం వెతుకులాట చూస్తుంటే గుండె తరుక్కు పోతుంది. ఇవన్నీ ఐక్యరాజ్య సమితి కంట పడలేదా, ఎందుకు దృఢ నిర్ణయం తీసుకోలేక పోతోంది. శాంతే దాని లక్ష్యం కదా. యుద్దాలు ఆపకపోతే ఇక సమితి ఉండి లాభమేమి. దీన్ని బట్టి చుస్తే ఐక్యరాజ్య సమితి అగ్రదేశం కనుసన్నలలో నడుస్తోందని, నిధులు అమెరికానే భారీగా సమాకూర్చుతోందనే అది మిన్నకుండి పోయింది . కేవలం శాంతి, చర్చలు అనే మాట పట్టుకుందనే విమర్శలు వస్తున్నాయి.ఐక్యరాజ్య సమితి లోని భద్రతమండలిలో ఐదు శాశ్వత సభ్య దేశాలు (అమెరికా, చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్) ఉన్నా అమెరికాదే పెత్తనం. అందుకే ‘ విటో ‘ అధికారం అన్ని దేశాలకు కల్పించింది. ఈ విటో అధికారం ముందు రద్దు చేయాలి. కానీ ఇది జరిగే పని కాదు. ఇజ్రాయెల్ ఇరాన్ వివాదంతోనే అది ఓ బొమ్మ అనేది స్పష్టంగా తెలిసిపోతోంది.
-కనుమ ఎల్లారెడ్డి,
93915 23027.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News