ఆ రెండూ కాదని
తమిళనాడులో ఉచితాల ప్రపంభజనం కొన సాగింది. డీఎంకే, ఏంఐడీఎంకేలు పోటీలు పడి మరీ ఉచితాలు ప్రజలకు పంచాయి. అంతేకాదు జీవన ప్రమాణాల పెరుగుదల కంటే వాటిపైనే ఎక్కువ దృష్టి పెట్టాయి. ఆ రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోలపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈసారి ఎన్నికల్లో కూడా ఆశ్చర్యం కలిగించే ఉచితాలనే పార్టీలు ఓటర్లకు ఆఫర్లుగా ప్రకటిం చాయి. మగవారికీ ఉచిత బస్సు ప్రయాణమని చెప్పారు. వాషింగ్ మెషిన్లను ఉచితంగా ఇస్తామ న్నారు. బస్సు, బంగారం గురించి చెప్పాల్సిన పని లేదు. విజయ్ పార్టీ మేనిఫెస్టో వైపునే ఓటర్లు మొగ్గు చూపారు. ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. విజయ్ మిగతా పార్టీల మాదిరిగా ద్రవిడ వాదాన్ని ఎత్తుకోలేదు. అట్లాగని దాన్ని విస్మరించలేదు. ఆయన చేసిన మరో గొప్ప విషయం కూడా ఒకటి ఉన్నది. అది మిగతా పార్టీలు పట్టించుకోలేదు. విజయ్ గుర్తించి తన ఎన్నికల్లో వాడుకున్నారు. అదే అంబేద్కర్ పేరు. ప్రతీ దగ్గర పార్టీ బ్యానర్‌పై ఫూలే, పెరియార్, అంబేద్కర్ ఇమేజెస్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీలు, క్రిస్టియన్ మైనార్టీలను తనవైపు తిప్పుకున్నారు. తమిళనాడులో ఉన్న పదిహేడు శాతం ఎస్సీల్లో అగ్రభాగం విజయ్ వెంటే ఉన్నారని అక్కడి రాజకీయ పండితులు చెప్తున్నారు. మిగతా పార్టీలు గుర్తించని విషయాలను, గుర్తించ నిరాకరించిన అంశాలను విజయ్ గుర్తించారు. తనకు అనుకూలంగా మలుచుకున్నారు. ఒకరిద్దరు తప్పా విజయ్ గెలుపు గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. పైగా ఆయన గురించిన పట్టింపే లేదు.
ఢిల్లీలో సంచలనం
పదేళ్ల కింద దేశ రాజధాని ఢిల్లీలో కేజ్రీవాల్ సాధించిన విజయం కూడా మాములూదేమీ కాదు. కాస్మోపాలిటన్ నగరం ఢిల్లీలో కేవలం ప్రచార ఖర్చు మినహా ఆయన పెద్దగా ఖర్చు చేసిందేమీ లేదు. ఓట్లు, నోట్లు అనే చర్చ లేనే లేదు. ఆయన జనం మధ్యలో ఉన్నారు. ఎజెండా కూడా జనమే తయారు చేశారు. వాటిని ఆయన అమలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆమ్ ఆద్మీ గెలుపు భారత రాజకీ యాలకు మలుపు అని అంతా భావించారు. దేశ రాజధానితో పాటు మిగత రాష్ట్రాల్లోనూ పార్టీ విస్తరిస్తూ ఉన్నది. రెండేళ్ల కిందటి నుండి జరుగుతున్న పరిణామాలు వేరు. కానీ భారత రాజకీయాల్లో కేజ్రీ వాల్ సంచలనమే. విద్య, వైద్యం, ప్రజల మధ్య సోదరభావం అనే సామరస్య భావనలను ప్రధానంగా అంశాలుగా ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ప్రజ ల మధ్య విభజన ఉండొద్దన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన గాంధేయ మార్గాన్ని అనుసరిం చారు. అధికారాన్ని దక్కించుకున్నారు. కేజ్రీవాల్ పార్టీలో ఉన్నత సామాజిక వర్గాల వారే ఎక్కువగా ఉన్నప్పటికీ సగటు మనుష్యులకూ ఆయన స్థానం కల్పించారు. అసెంబ్లీకి పంపించారు.
కాన్షీరాం మార్క్
ఈ రెండు పార్టీల కంటే ముందు ఉత్తర ప్రదేశ్ లో కాన్షీరాం చేసిన బహుజన్ సమాజ్ పార్టీ ప్రయో గం దేశ చరిత్రలో ఒక మైలు రాయిగా చెప్పొచ్చు. ఆయన కూలీ నాలీ చేసుకునే వారిని అసెంబ్లీకి పంపించారు. భారతీయ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో అట్టడుగున ఉన్న పంచములు అసెంబ్లీలోకి అడుగు పెట్టేలా చేశారు. రూపాయి ఇవ్వాలి.. ఓటు వేయాల నే నినాదాన్ని ఆయన దేశం బహుజనుల ముందు పెట్టారు. దాన్ని వారు ఆచరించారు. బీఎస్పీని గెలిపించారు. సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. 1980ల నాటికే కొన్ని రాష్ట్రాల్లో నోట్లు ఖర్చు పెట్టే తిరోగమన సంస్కృతి ప్రారంభం అయింది. తెలుగు రాజకీయాల్లో దాని ప్రభావం మరీ ఎక్కువగా ఉండేది. అలాంటి సమయంలో ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకుండా ఓట్లు సాధించు కున్నారు. పంచడానికి బీఎస్పీ వద్ద అప్పుడు డబ్బులు కూడా లేవు. అప్పటికే పాతుకు పోయి ఉన్న అగ్రవర్ణ నాయకత్వాన్ని ఢీ కొట్టి కాన్షీరాం నిలబడగలిగారు. తాజాగా కేజ్రీవాల్, విజయ్ సాధించిన విజయాలను కాన్షీరాం ప్రయోగంతో పోల్చక పోయినా ఆధునిక రాజకీయాల్లో వారి గెలుపు గొప్ప విషయమే.
ఓటే కీలకం
ప్రతీ సందర్భంలో నోట్ల ప్రభావమే ఉండదు. ప్రజలు పనిచేసే వారిని గుర్తిస్తారు. ప్రత్యామ్నాయం లేని దగ్గర పాత పార్టీలు తిరిగి అధికారంలోకి వస్తు న్నాయి. వీరు కాకుండా మరోపార్టీ అనే సదు పాయం ఉన్న దగ్గర ఒకే పార్టీ ప్రభుత్వం ఉండటం లేదు. ఉండేందుకు అవకాశం లేదు. అన్నింటి కంటే భారతీయ కుల సమాజం కొందరికి గౌరవంగా జీవించే హక్కును ఇవ్వలేదు. అన్ని రకాల హక్కులను హరించింది. మనుధర్మం దుర్మార్గాన్ని భారత రాజ్యాంగం తిప్పి కొట్టింది. సమాన హక్కుల ద్వారా భారతీయులందిరినీ ఏకం చేసింది. తామంతా ఒక్కటే ననే మానసిక భావనను కలించింది. ఓటు హక్కు ఉండటం వల్లనే పంచమ కులాల వారి ఆత్మగౌరవం, అధికారం దక్కుతున్నాయి. లేకపోతే ఊరికావల ఉండాలనే మనుధర్మం బోధ చేస్తున్నది. భారతీయ సమాజం ఆత్మను ఆర్థం చేసుకున్న దార్శనికుడు బాబా సాహేబ్ అంబేద్కర్. అందుకే ఆయన ఓటు ద్వారానే ఈ దేశ భవిష్యత్తును మార్చొచ్చని భావించారు.
ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం అంద రికీ దక్కాలంటే ఓటే శరణ్యమని, దాన్ని సమర్థుల గెలుపు కోసం ఉపయోగించాలని ఆయన సూచిం చారు. దాని ద్వారా వ్యక్తి పురోగతి, సామాజిక పురో గతి, సమత, ఐక్యతా సాధించాలని ఆయన కోరుకు న్నారు. ఇలాంటి వారు ఓటు ద్వారా ప్రజాస్వామ్యా న్ని, అంబేద్కర్ ఆలోచనను ముందుకు తీసుకెళ్తారని చాలామంది భావించేలా చేస్తున్నారు.
గోర్ల బుచ్చన్న

