Sunday, November 24, 2024
Homeఓపన్ పేజ్What is Khalistani movement? ఏమిటీ 'ఖలిస్తాని' అంటే?

What is Khalistani movement? ఏమిటీ ‘ఖలిస్తాని’ అంటే?

ఖలిస్థాన్ కు విదేశీ శక్తుల అండ

ఖలిస్తానీ ఉద్యమం 1940ల్లో ప్రారంభమైంది. ఖలిస్తానీ అంటే ‘పవిత్రమైన భూమి’అని పంజాబీలో అర్థం. సిక్కులకు ఒక ప్రత్యేకదేశం కావాలన్నదే ఖలిస్థానీ ఉద్యమ అసలు లక్ష్యం. ఈ లక్ష్య సాధన కోసం అనేక సిక్కు సంఘాలు పోరాటాలు చేశాయి. ఈ సందర్భంగా చాలా సార్లు హింస చెలరేగింది. అప్పటినుంచి ఖలిస్తానీ ఉద్యమం అనేక మలుపులు తీసుకుంది. 1970-80ల ప్రాంతంలో ఖలిస్తానీ ఉద్యమం తీవ్ర స్థాయికి వెళ్లింది. 80వ దశకంలో సంత్ జర్నైల్‌ సింగ్ భింద్రన్‌వాలే హయాంలో ఖలిస్తానీ ఉద్యమం తీవ్రస్థాయికి చేరింది. సంత్ జర్నైల్‌ సింగ్ భింద్రన్‌వాలేను పట్టుకోవడానికి అప్పటి కేంద్ర ప్రభుత్వం అనేకసార్లు ప్రయత్నించింది. అయితే పోలీసుల కళ్లుగప్పాడు భింద్రన్‌వాలే. ఎవరికీ దొరకలేదు. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో దాక్కున్నాడు. అక్కడి నుంచే చక్రం తిప్పేవాడు. ఎలాగైనా సంత్ జర్నైల్‌ సింగ్ భింద్రన్‌వాలేను పట్టుకోవాలని అప్పటి ఇందిర నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుంది. దీంతో ఆపరేషన్ బ్లూస్టార్‌కు రంగం సిద్ధం చేసింది. ఆపరేషన్ బ్లూస్టార్‌ అంటే స్వర్ణ దేవాలయంపై దాడి చేసి అక్కడ దాక్కున్న భింద్రన్‌వాలేను మట్టుపెట్టడమే. ఆపరేషన్ బ్లూస్టార్‌ బాధ్యతను సైన్యానికి అప్పగించింది. 1984 జూన్ 1 నుంచి 10 వరకు ఆపరేషన్ బ్లూ స్టార్‎ జరిగింది. ఇందులో భాగంగా అదే ఏడాది జూన్ ఆరో తేదీన జర్నైల్‌ సింగ్ భింద్రన్‌వాలేను మట్టుబెట్టింది భారత సైన్యం. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధిని ఆమె సెక్యూరిటీ సిబ్బందే హతమార్చారు. ఇందిర హత్యను నిరసిస్తూ దేశవ్యాప్తంగా సిక్కులపై దాడులు జరిగాయి. ఆ తరువాత ఖలిస్తానీ ఉద్యమం చల్లబడింది. అయితే ఇటీవలి కాలంలో ఖలిస్తానీ ఉద్యమం మళ్లీ రెక్కలు తొడిగింది. అది కూడా కెనడాలోనే. ఈ దేశంలో చాలాసార్లు హిందూ దేవాలయాల మీద దాడులు జరిగాయి. అంతేకాదు హిందూ దేవాలయాల మీద ఖలిస్తానీ ఉద్యమ అనుకూల నినాదాలు కూడా రాశారు. ఈ నేపథ్యంలో కెనడాలో ఇటీవల ఖలిస్తానీ ఉద్యమం జోరందుకుంది. కెనడాలో స్థిరనివాసం ఏర్పరచుకున్న పంజాబీ సిక్కుల ఓట్లకోసం జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఖలిస్తానీ సానుభూతిపరులకు పరోక్షంగా మద్దతు ఇవ్వడం ప్రారంభించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News