Homeఎడిటోరియల్ / బహుళStudent Welfare : వెయ్యి రోజుల పాలనలో విద్యార్థుల సంక్షేమం ఎక్కడ?

Student Welfare : వెయ్యి రోజుల పాలనలో విద్యార్థుల సంక్షేమం ఎక్కడ?

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినా, ఎన్నికల సమయంలో విద్యా ర్థులు, యువత, నిరుద్యోగులకు ఇచ్చిన అనేక హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్య మంలో విద్యార్థులు, యువత కీలక పాత్ర పోషించారు. పదేళ్ల కేసీఆర్‌ పాలన వద్దని రాష్ట్రంలో మార్పు రావాలని, విద్యార్థులు-నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం కావాలని ఆశించి 2023లో కాంగ్రెస్కు మద్దతుగా నిలి చారు. వారి మద్దతుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వారి సమస్యలను పరిష్క రించి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టు కోవాల్సిన నైతిక బాధ్యత ఉంది.

- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలను అమలు చేశామని చెబుతున్నప్పటికీ, విద్యా ర్థులు, యువతకు ఇచ్చిన కీలక హామీల్లో అనేకం ఇంకా అమలుకు నోచుకోలేదు. ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూరయిన తరుణంలో హామీల అమలుకు ఇంకా ఎంత సమయం కావాలి? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయ డానికి ప్రభుత్వం ఇంకా ఎన్ని రోజులు తీసుకుంటుంది? విద్యార్థులు ఇంకెంతకాలం ఎదురుచూడాలి? అని విద్యార్థి, యువత ప్రశ్నిస్తోంది.

ఉద్యోగాల భర్తీ, జాబ్‌ క్యాలెండర్‌, నిరుద్యోగ భృతి ఏది?
నిరుద్యోగులకు జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని, అధి కారంలోకి వచ్చిన ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి, నిరుద్యోగ భృతి 4 వేలు కూడా ఇస్తామని ప్రకటించింది. కానీ రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి? ఎప్పుడు నోటిఫికేషన్లు విడుదల చేస్తారు? అనే అంశాలపై ఇప్పటికీ పూర్తి స్పష్టత లేదు. నిరుద్యోగుల కోసం ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌ను సమర్థవం తంగా అమలు చేసి, ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలి. నిరుద్యోగ భృతి కోసం ఇప్పటికి బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేశారు.

విద్యా భరోసా కార్డులు, స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు ఎక్కడ?
పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి విద్యార్థులకు రూ.5 లక్షల విలువైన విద్యా భరోసా కార్డు, వడ్డీరహిత ఆర్థిక సాయం, పరిశోధన పరికరాలు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులు, ఇతర విద్యా అవసరా లకు ఆర్థిక సదుపాయాలు కల్పిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించింది. ఉన్నత విద్యలో పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో ఈ హామీ విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆశలు కల్పించింది. విద్యార్థి నులకు స్కూటీలు అందిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ కూడా ఇప్పటికీ అమలు కాలేదు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల్లోని కళాశాలలకు వెళ్లే విద్యార్థినులు రవాణా విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకురావడానికి ల్యాప్‌టాప్‌లు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. డిజిటల్‌ విద్య ప్రాధాన్యత పెరిగిన ఈ కాలంలో ల్యాప్‌టాప్‌ అనేది విద్యార్థులకు విలాస వస్తువు కాదు.. చదువులో ఉపయోగపడే ఒక ముఖ్యమైన సాధనం. పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు సొంతంగా ల్యాప్‌టాప్‌ కొనుగోలు చేయడం ఆర్థికంగా భారంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇస్తామన్న ల్యాప్‌టాప్‌ల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. అదే విధంగా ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఏర్పాటు, విద్యార్థినులకు ఎలక్ట్రిక్‌ స్కూటీలు, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ఇంటింటికీ ఉచిత ఇంటర్నెట్‌ వంటి హామీలను కూడా ఇచ్చి, వాటి అమలుపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలి.

విద్యకు 15 శాతం బడ్జెట్‌ కేటాయించాలి
ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వద్దే విద్యాశాఖ ఉంది కాబట్టి విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రాష్ట్ర బడ్జెట్‌లో 15 శాతం నిధులను విద్యారంగానికి కేటాయిస్తామని ప్రకటించింది, కానీ 2 సార్లు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లలో విద్యకు కేవలం 7.3% నిధులు మాత్రమే కేటాయించారు. ఆ నిధులు కేటాయింపు చూస్తే విద్యారంగ హామీల అమలుకు ఈ నిధులు ఏ మాత్రం సరిపోవు. ఎన్నికల్లో ఇచ్చినహామీకి అనుగుణంగా విద్యకు బడ్జెట్‌లో నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేయాలి. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యం కల్పిం చాలి. ప్రభుత్వ పాఠశాలలు, కళా శాలలు, సంక్షేమ హాస్టళ్లు, గురుకు లాలు, కేజీబీవీలకు తగినన్ని నిధులు కేటాయించాలి.

యూనివర్సిటీలను బలోపేతం చేయాలి
గత ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యానికి గురైన రాష్ట్రంలోని యూని వర్సిటీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా, ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలి. యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న టీచింగ్‌, నాన్‌-టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయడంతో పాటు, పాలనాపరమైన సమస్యలకు పరిష్కారం చూపాలి.

ఫీజు రీయింబర్స్​‍మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలు..

పేద విద్యార్థులు ఉన్నత విద్య చదివేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్​‍మెంట్‌ పథకం బకాయిలు వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వెంటనే పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్​‍మెంట్‌ బకాయిలను ఏకకాలంలో విడుదల చేస్తామని హామీ ఇచ్చి అధికా రంలోకి వచ్చి 32 నెలలు గడుస్తున్న, ఇప్పటికీ పూర్తి స్థాయిలో బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా విద్యా ర్థులు సర్టిఫికెట్లు తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు అప్పులు చేసి ఫీజులు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్ప డింది. ఫీజు రీయింబర్స్​‍మెంట్‌, స్కాలర్‌ షిప్‌ బకాయిలు విడుదల కాక బడ్జెట్‌ కళాశాలల యాజమాన్యాలు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భవ నాల కిరాయి ఇవ్వలేక సిబ్బందికి జీతాలు ఇవ్వలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

1000 రోజుల పాలన పూర్తయినా విద్యార్థులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయకపోవడం అంటే విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరిం చిడమే. కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రకటించి విద్యార్థులు, యువత, నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలి. విద్యార్థుల సంక్షేమానికి, ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి అత్య ధిక ప్రాధాన్యత ఇచ్చి తెలంగాణను విద్యా రంగంలో ముందుకు తీసుకెళ్లాలి.

కసిరెడ్డి మణికంఠ రెడ్డి
ఏఐఎస్ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు
7569548477

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News