తీవ్రమైన మానసిక ఆందోళనతో ఏదో జరుగుతోందనే భ్రమ ల మాయాజాలంలో కొట్టు మిట్టాడుతూ మానసిక రుగ్మ తల బారినపడతారు. ఇగ నా బతుకింతే అన్న ఒక రకమైన భావనలోకి మ్్ైండ ను తీసుకొని వెళ్తారు. దీంతో తమదైన ఒక ప్రపంచాన్ని సృస్టించుకొని, వింత ప్రవర్తనలతో జీవితాన్ని వెళ్లదీస్తూ బతికేస్తారు. రోజు మా ఇంటికి ఎవరెవరో వస్తున్నారు. నన్నే చూస్తున్నారు. నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. నేను ఎటు వెళితే అటు నన్ను వెంబడిస్తున్నారు. నాకే ఎందుకిలా జరుగు తోంది.
ఒక వైపుకు మనిషి ప్రపంచాన్ని శాసిస్తూ అతి పిన్న వయసులోనే అందలం ఎక్కుతున్న వారు, మరో వైపు ఏమి సాధించలేమనే నిరాశ, నిస్పృహలు, ఒత్తిడి, ఆందోళనలు కలగలిపి మనిషి పిచ్చివాడుగా తయారై శరీరంపైన బట్టలు లేకుండా రోడ్లపై తిరుగుతున్న వారు ఎందరో కనిపిస్తు న్నారు. మానసిక సమస్యలు మితిమీరి మతి గతి తప్పి చివరకూ ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు కూడా ఉన్నారు. సృష్టికి ప్రతి సృష్టికి చేయగల సత్తా మానవ మెదడుకు మాత్రమే ఉంది. మెదడును కాపాడుకోవడంలో తగు జాగ్రత్తలు తీసుకోవడంలో మనిషి అశ్రద్ద చేస్తున్న ట్లుగా సర్వేలు తెలియజేస్తున్నాయి. మెదడు అతి చిన్న విష యానికైన స్పందిస్తుంది. ఒక్కొక్క సారి ఎలాంటి విషయ మైన స్పందించకుండా బండరాయి వలే ఉంటూ ఉంటుం ది. మనసు మన ఆధీనంలో ఉంచుకోగలిగితే దేన్నైనా శాసించే స్థాయిలో ఉంటామనడంలో సందేహం లేదు.
అస్పష్ట ఆకారాలు కనిపిస్తున్నాయా..
మనిషి యొక్క ప్రవర్తన ఆధారంగానే మానసిక సమ స్యలు ఎదుర్కొంటున్నాడనే విషయం బయటకు వస్తుంది. ఎవరో తనతో మాట్లాడుతున్నట్లుగా దానికి సమాధానం ఇవ్వడం, చుట్టూ వ్యక్తులు లేకపోయిన స్పష్టంగా మాటలు వినపడుతున్నట్లుగా, ఒక్కొక్క సారి మనసులోని ఆలోచన లను బయటకు గొంతెత్తి అరుస్తుండడాన్ని, ఎవరో తనను వెంబడిస్తున్నారంటూ, ఎవేవో అస్పష్ట ఆకారాలు కనిపిస్తు న్నాయని చెబుతూ ఉంటారు. ఇలాంటి మానసిక రుగ్మ తను స్కిజోఫ్రెనియాగా పిలుస్తారు.
మానసిక ఒత్తిడితోనే
స్కిజోఫ్రెనియా జబ్బు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి వంద మందిలో ఒకరికి ఉంది. మన దేశంలో ఒక కోటి పది లక్షల మంది ఈ జబ్బుతో బాధపడుతున్నారని సర్వే నివేధి కలు తెలియ చేస్తున్నాయి. స్కిజోఫ్రెనియా వంశపారం పర్యంగా వచ్చేందుకు ‘అవకాశం’ మాత్రమే ఉంది. శరీ రంలో జన్యువులు ఉన్నంత మాత్రాన అందరికి జబ్బుగా బయట పడాలనేమీ లేదు. సామాజిక పరిసరాలు, పరిస్థి తులు అనుకూలంగా ఉంటే జబ్బుగా బయట పడవచ్చు. సామాజిక పరిసరాలు అంటే మానవ సంబంధాలు, ఆర్థిక పరిస్థితులు, విద్య, ఉపాధి మొదలయిన అంశాలలో ప్రతి కూల వాతావరణం ఉండటం, ఈ సమయాలలో కలిగే మానసిక ఒత్తిడి ఎక్కువయ్యే కొద్దీ జబ్బు లక్షణాలు బయట పడడానికి అవకాశాలు పెరుగుతూ ఉంటాయి.
చేతబడులు, దయ్యం పట్టిందా…
స్కిజోఫ్రీనియా వ్యాధి తీవ్రమైన మానసిక రుగ్మత, ప్రతి వంద మందిలో ఒకరు ఈ వ్యాధికి గురవుతున్నారు. ఈ వ్యాధి 17 సంవత్సరాలలో ఉన్న వారికి ఎక్కువగా వస్తుంది. కొంత మందిలో 40 సంవత్సరాలు దాటిన కూడా రావచ్చు. ఈ వయస్సులో ఆడవాళ్లకు ఎక్కువగా వస్తుంది. ఆడవారితో పోలిస్తే ఈ వ్యాధి మగవారిలో తక్కు వ వయస్సులోనే వస్తుంది. స్కిజోఫ్రీనియా గురించి అవ గాహన లేకపోవడంతో జాడలు విరబూసికొని అరుస్తుం డడం, తనలో తాను మాట్లాడుకోవడం చేస్తూన్న లక్షణాలు కనిపించగానే చేతబడి, మనిషి కోడి, దేవుని కోడి, దయ్యం పట్టింది, చెడుగాలి సోకిందని చికిత్స తీసుకోకుండా వ్యాధి తీవ్రత పెరిగే వరకు సమయాన్ని వృథా చేస్తుంటారు. వ్యాధి తొలిదశలోనే గుర్తించి తొందరగా చికిత్స ప్రారంభిస్తే సుమారుగా 20 శాతం రోగులు పూర్తిగా కోలుకునే అవకా శం ఉంది. మనోబలంతో స్కిజోఫ్రీనియా వ్యాధిని జయించవచ్చు.
గమ్యం లేని జీవితంతో గడుపుతూ ఉండడం….
స్కిజో ఫ్రెనియా వల్ల వ్యక్తుల లక్షణాలు ఖచ్చితంగా ఇవి అని గుర్తించడం కష్టం. స్కిజోఫ్రెనియా లక్షణాలు ఏ ఇద్దరి వ్యక్తులలో కూడా ఒకే రకంగా ఉండకపోవచ్చు. ఈ లక్షణాలు దినచర్యలో భాగంగా ప్రవర్తిస్తున్నట్టుగానే ఉం టాయి. తన ఆలోచనలు తనకే చెవుల్లో వినపడటం. ఇత రుల ఆలోచనలు తన మెదడులోకి నాటుతున్నారని, తన ఆలోచనలు ఇతరులకు తెలిసి పోతున్నట్టు అపోహ పడడం జరుగుతుంది. టీవీ రేడియో, మైకులలో తన విషయాలే ప్రసారం అవుతున్నాయని, తన ప్రవర్తన గురించి, చేతల గురించి ఇతరులు మాట్టాడుకుంటున్నట్టు, వారిలోవారే గుసగుస లాడుకుంటున్నట్టు అనిపిస్తుంది. తమలో అతీం ద్రియ శక్తులు ఉన్నట్టు భ్రమ పడుతుంటారు. ఇతరులను అనుమానిస్తారు. అక్రమ సంబంధాలను అంటగడతారు. ఆలోచనలో మధ్యమధ్యలో ఆగిపోవటంవల్ల మాటలు ఆ సందర్భంగా ఇతరులకు అర్థం కాని విధంగా ఉంటాయి. ఏ పని చేసినా నిదానంగా గంటల కొద్దీ చేస్తారు. ఇతరు లతో మాట్లాడటానికి ఇష్టపడరు. శూన్యంలోకి చూస్తూ కూర్చుంటారు. తమలో తామే మాట్లాడుకోవటం, నవ్వుకో వటం చేస్తుంటారు. ఉద్వేగాలకు తగ్గట్టు ముఖంలో హావ భావాలు ఉండకపోవడం. తనను గురించి తాను స్నానం, బట్టలు, శుభ్రత విషయంలలో పట్టించుకోకపోవటం, భవిష్యత్తుపట్ల ముందుచూపు లేకపోవటం, పరిస్థితులను బట్టి వ్యవహరించలేకపోవటం లోపంగా ఉంటుంది. గ మ్యంలేని జీవితాన్ని గడుపుతుంటారు. తనూ, తన కుటుం బం, చుట్టూ ఉన్న సమాజంతో సంబంధం లేకుం డా వారి లోకంలోనే జీవిస్తూ ఉంటారు. తమకు రోగం ఉందన్న విషయాన్ని గుర్తించలేరు. ఎదుటివారు చెప్పినా ఒప్పుకోరు.
ప్రతి సమస్యకూ పరిష్కారం
దిగాలుకు దిక్కు లేదు మనాదికి మందు లేదనేది గతంలో మన పూర్వికులు వాడిన సామెత. ప్రస్తుతం దిగా లుకు దిక్కు ఉంది, మనాదికి మందు ఉంది. వ్యక్తుల ప్రవ ర్తనా లోపాలను గుర్తించడం చాలా సంక్లిష్టమైనదే అయిన ప్పటికీ మానసిక ఆరోగ్య నిపుణులు, సైకాలజిస్ట్‌లు, సైక్రి యాట్రిస్ట్‌లు, క్లినికల్ సైకాలజిస్ట్‌లు, సైకో థెరపిస్ట్‌లు ఎంతో నైపుణ్యతతో, సూక్ష్మ పరిశీలన ద్వారా, ఆధునిక పరికరా లతో వారి వారి పరిధులకు లోబడి విశ్లేషణ చేయగలుగు తున్నారు. ఆధునిక పరిశోధనలతో ప్రతి సమస్యకు పరి ష్కారం కనుక్కోబడింది. సైకాలాజికల్ కౌన్సెలింగ్ సైకో థెరపీలు చాలా వరకు వారి ప్రవర్తనలో మార్పులను సరి దిద్దుకోవడానికి పనిచేస్తుంటాయి. సైక్రియాట్రిస్టులు సూ చించిన మందులతో స్కిజోఫ్రెనియాను తగ్గించవచ్చు. పెరి గిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఇప్పుడు కొత్త కొత్త మందులు, వైద్య పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. మానసిక సమస్యను గుర్తించడం. దగ్గరలోని కౌన్సెలర్‌ను గాని, సైకాలజిస్ట్ , క్లినకల్ సైకాలజిస్ట్, సైక్రియాట్రిస్ట్‌ను సంప్రదించి సమస్య ఉందా లేదా? ఆ సమస్య తీవ్రతను గుర్తించాలి. మానసిక సమస్యలు ఏవి లేకపోయినా ఉన్నా యని ఊహించడం, భయపడటం కూడా సైకాలజికల్ డిజార్డరే. మనిషిలో పట్టుదల, మానసిక దృఢత్వం ఉంటే ఆదర్శవంతమైన వ్యక్తిత్వం ఏర్పరుచుకోవచ్చు. కౌన్సెలింగ్ పర్సనాలిటి డెవలప్ మెంట్ కార్యక్రమాలు దోహదం చేస్తాయి.
ఆత్మవిశ్వాసం అవసరం
స్కిజోఫ్రెనియాతో ఎదుర్కొంటున్న వ్యక్తిలో ఆత్మవిశ్వా సం తిరిగి నెలకొల్పడానికి తల్లిదండ్రులు సరైన ప్రోత్సాహం అందించాలి. మేధాశక్తికి లోటు లేదన్న భరోసాను కుటుం బ సభ్యులు అందించాలి. సానుభూతి చూపుతున్నారన్న ఆలోచన రాకుండా జాగ్రత్త పడాలి. మానసిక ఆరోగ్య నిపు ణుల సూచనలతో పాటుగా కుటుంబ సభ్యుల సహాకారం తో స్కిజోఫ్రెనియాను తరిమి కొట్టవచ్చు.
- డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి
9703935321