Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Women empowerment: మహిళా సాధికారతకు కృషి

Women empowerment: మహిళా సాధికారతకు కృషి

మహిళా సాధికారత సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మానసికంగా ఒక మహిళ తనంతట తానే నిర్ణయాలు తీసుకోగలిగే అధికారం. ఆకాశంలో సగం జనాభాలో సగం ఓటు హక్కు వినియోగించే దానిలో సగం కంటే ఎక్కువ, అబల, సభల అని దేవతతో సమానం మహిళలను పొగడ్తలకే పరిమితం చేస్తూ రాజకీయ వ్యవస్థ ఒక పద్ధతి ప్రకారం దూరం పెడుతూ వచ్చింది, మహిళను ఎక్కడ కూడా సరియైన స్థానం కల్పించలేకపోయింది. మహిళలకు అధికారం చేపట్టే అవకాశం కలిపించకుండా పథకా లకే పరిమితం చేయడం, సంబురాలలో ముంచేదాం మహిళ సాధి కారతకు దక్కకుండ చేయడంలో జరిగే కుట్రలు అన్నీ ఇన్నికావు.
రాజ్యాంగం పరముగా మహిళా సాధికరత సాధనాకోసం ఉన్న నిబంధనలు రాజ్యాంగపరమైన అంశాలు చట్టం ముందు అందరూ సమానులే స్త్రీ, పురుష వివక్ష చూపరాదు ప్రభుత్వ ఉద్యోగాల్లో లింగ వివక్ష చూపరాదు, స్త్రీలను అసభ్య, అశ్లీల, అవి నీతి కార్యకలాపాలకు వినియోగించకూడదు, మహిళలకు పురుషు లతో సమాన అవకాశాలు కల్పించాలి, స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, మహిళల ఆత్మగౌరవాన్ని కించ పరిచే పద్ధతులను విడనాడాలిపై అంశాలు చెప్పడానికి వినడానికి ఆధారశమూగ వుంటాయి కానీ ఆచరణలో మాత్రము సాధ్యము కావడములేదు. ప్రపంచ ఆర్థిక నివేదిక 2022 ప్రకారం లింగ సమానత్వ సూచీలో 146 దేశాల జాబితాలో భారతదేశం స్థానం 135లో నిలిచి అపఖ్యాతిని మూటగట్టుకుంది. స్త్రీ పురుషుల సమానత్వ మదింపు కోసం నిర్దేశించిన నాలుగు అవకాశాలు ఆర్థిక భాగస్వామ్యంలో 143 స్తానంలో వుంటూ, రాజకీయ సాధికారత అధికారంలో 48వ స్థానం విద్యాభ్యాసంలో 107వ స్థానంలో వైద్యములో చిట్ట చివరి స్థానంలో నిలిచింది సమానత్వ సూచీలో 135వ స్థానంలో ఉన్న భారత్‌ వెనుక కేవలం 11 దేశాలు మాత్రమే వెనుకబాటు ఉంటూ మన చుట్టుపక్కన ఉన్న చిన్న దేశాలు బంగ్లా దేశ్‌ నేపాల్‌ వంటివి స్త్రీ పురుష సమానత్వంలో మనకంటే ముం దంజలో ఉన్నాయి.
సాధికారతను పెంపొందించే అంశాలలో అక్షరాస్యత చాలా కీలక పాత్రను పోషిస్తుంది. ఏ దేశం యొక్క అక్షరాస్యత ఎక్కు వుంటే సాధికారత అదే స్థాయిలో ఉంటుంది అనేది నిజం భారత్‌ ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారతదేశ అక్షరాస్యత రేటు సగ టునా 78% అందులో పురుషుల అక్షరాస్యత 84% మహిళల అక్ష రాస్యత 70% ఈ అక్షరాస్యత రేటు కొన్ని రాష్ట్రాలలో కాస్త అటు ఇటు ఉండొచ్చు కానీ కొన్ని సామాజిక వర్గాలలో 50% వరకే ఉంటుంది మహిళల అక్షరాస్యత తక్కువ ఉండడము వారి కోసం ప్రవేశపెట్టిన పథకాలు అవి సాధించిన విజయాలు అంతంత మాత్రమే. విద్యను పెంపొందించ అవకాశం వున్న బడ్జెట్‌ కేటా యింపులు చాలా తక్కువ.
భారత రాజకీయ వ్యవస్థ అన్ని వ్యవస్థలను స్వాచించే వ్యవస్థ ఈ రాజకీయ వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం ఇప్పటికీ కూడా చట్టసభలలో 10 నుంచి 15 శాతానికి మించలేదు, స్థానిక సంస్థ లలో 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా కేవలం క్రింది స్థాయి లో 33 శాతం మాత్రమే ఒరిస్సా, తెలంగాణ, బీహార్‌ లాంటివి 50 శాతం వరకు కొన్ని రాష్ట్రాలలో భాగస్వామ్యం కల్పించబడుతుంది దీనికి గల కారణాలు అనేకం ఉన్న ప్రధానముగా, దనప్రభవం, రాజకీయాలు పెట్టుబడిగా మారడం, ఆర్ధిక స్వతంత్రము లేకపో వడం, రాజకీయ పార్టీలు గెలుపు గుర్రలను పేటడం, వారసత్వ రాజకీయాలు వెలడం మైదాలయినవి. స్థానిక సంస్థలో మహిళా రిజర్వేషన్‌ ఆచరణలోఅనేక అడ్డంకులు వాటిలో కూడా కీలకమైన పాత్ర పోషించి భర్త సహకారం పూర్తిగా లేకుండా మహిళలే తమ అధికారాలను చెలాయించే వారి శాతం ఎంత శాతం, స్వంత నిర్ణ యాలు తీసుకొని గెలిచే మహిళల శాతం ఎంత ఈల అనేక ప్రశ్న లు అప్పుడప్పుడు తట్టు తుంటాయి.
పరిపాలనలో మహిళాలకు రిజర్వేషన్‌ వల్ల వారి శాతం క్రమ ముగా పెరగుతుంది. కానీ నిర్ణయం తీసుకునే స్థాయిలో వారి పాత్ర చాలా తక్కువ రాజకీయ అధికారం ద్వారా రాజకీయ నిర్ణ యీకరణ ద్వారా వారు తమ సమస్యలను ప్రస్ఫుటంగా వ్యక్తీక రించడానికి అవకాశం కలుగుతుంది. రాజకీయ సాధికారత లభిస్తే ఇతర సాధికారతలపైనా గణనీయమైన ప్రభావం ఉంటుంది. ఏ పార్టీలు అయితే మహిళలకు తక్కువ ప్రాతినిధ్యం కల్పిస్తుందో అవే పార్టీలు మహిళా సాధికారత ఎక్కువ కావాలని మాట్లాడమని చాలా విచిత్రం ఒక పార్టీ మహిళాను పోటీలో పెట్టినప్పుడు ప్రత్య ధిపార్టీలు కూడా మహిళాను పోటీలో పెట్టాలి అపుడు కనీసం వారి ప్రాతినిధ్యం పెరుగుతుంది. సమాజంలో మహిళలు ఆత్మగౌరవం తో, స్వశక్తితో తమ ఆర్థిక అవసరాలను తామే తీర్చుకోగలిగే ఆర్థిక సాధికారత కలిగి ఉండాలి, అప్పుడే వారు ఆర్థికంగా పురుషులపై ఆధారపడే అవసరం తగ్గుతుంది,మానవ వనరుల సంపూర్ణ విని యోగంలో వీరి పాత్ర కూడా కీలకమవుతుంది. భారత దేశములో ఆర్ధిక రంగ ములో మహిళల సాధికరత అధి నుండి నేటివరకు చాలా తక్కువ మహిళ పరిశ్రామికుల సంఖ్య కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం ఆర్ధికముగా బాలహీనము అవడము ద్వా రా రాజకీయ అధికారని చెపేటటలేక పోవడం. బలమైన కుటుంబ వ్యస్త బాధ్యతను మోసుకొనిరావడం సంఘ కార్యకలప లో పలుగొనకపోవడం ప్రశ్నించేతత్వం తక్కువగా వుండడం సామాజిక సమస్యలపై స్పందన తక్కువగా ఉండడం, ఈ మద్య కాలంలో శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధితో మహిళలు కొంత ఆర్థికముగా బలపడుతున్నారు. మహిళల సాహధికారత సెలవు లతో, సెలబ్రేషన్లతో సాగదిం పుతు కొత్త కొత్త లాజిక్కులతో మహిళ లను పైకి రాకుండా వారి యొక్క మానసిక, శారీరక జీవన కార్య క్రమాలను ఒక బలహీనతగా చూపిస్తూ ఊకదంపుడు ఉపన్యాసా లతో రాజకీయ పార్టీలు మహిళలకు కల్పించవలసిన హక్కులను అధికారాన్ని సార్థకత చేయకుండా సాగదీస్తున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు స్పష్టమైన మహిళా ప్రాతినిధ్యం ఉండేలాగా అటు పార్టీ లోనూ ఇటు పదవులలోనూ వారి జనాభా శాతానికి అనుగుణంగా ప్రాతినిథ్యం కల్పించి, సార్ధకత చేర్పించ వలసిన బాధ్యత రాజకీయ పార్టీలది, అన్ని రాజకీయ పార్టీలు మహిళా సార్ధకతపై ఒక స్పష్టమైన ఎజెండాతో ముందుకు రావాలి. ఇటు మహిళా సంఘాలు మహిళా ప్రతినిధులు మహిళల హక్కుల కోసం పోరాటం చేసే సంఘాలు ముందుకొచ్చి సాధికారతను పరి పుష్టం చేయవలసిన బాధ్యత ఉన్నది. 75 సంవత్సరాల స్వాతంత్య్ర భారత్‌ దేశంలో కేవలం 10 % మహిళలు చట్టసభకు పరిమితం కావడం చాలా బాధాకరం జనభాకు తగట్టు ప్రాతినిదయం దక్కే డానికి ఇంకా ఇంత సమయం కావాలో అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.
-డా. శంకర్‌ నాయక్‌
అసోసియేట్‌ ప్రొఫెసర్‌, 9110716674


సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News