Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Women rights: మహిళా హక్కుల మాటేమిటి?

Women rights: మహిళా హక్కుల మాటేమిటి?

దేశంలో సమాన హక్కుల గురించి సర్వే సర్వత్రా చర్చ జరుగుతున్నప్పుడు, దేశంలో వివిధ వర్గాలలో ఏ స్థాయిలో సమాన హక్కులు అమలు జరుగుతోందో పరిశీలించాలన్న ఆసక్తి కలగడం సహజం. రెండు రోజుల క్రితం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, కేరళలో వివిధ వర్గాల కు చెందిన మహిళలు సమావేశమై, దేశంలోని ముస్లిం పర్సనల్‌ లా మహిళలకు అనుకూలంగా, మహిళా హితంగా మారాల్సిన అవసరంపై ప్రకటనలు, ప్రసంగాలు చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్ట వలసిన అవరసం ఉందన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ముస్లింలలో మహిళల పట్ల కొనసాగు తున్న పక్షపాత ధోరణిని, హక్కుల కోసం ఆ మహిళలు చేస్తున్న పోరాటాలను మరింతగా వెలుగులోకి తీసుకు వచ్చేందుకు దేశవ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహించాలని కూడా వారు భావించారు. ఇం తవరకూ చాటుమాటుగా వ్యక్తమవుతున్న ముస్లిం మహిళల అభిప్రాయాలు, మనోభావాలు ఈ మధ్యనే బహిరంగం కావడం ప్రారంభించాయి.
ఇందుకు ప్రధాన కారణం, ప్రముఖ న్యాయవాది సి. షుకూర్‌, ఆయన భార్య, విద్యావేత్త అయిన డాక్ట ర్‌ షీనాల తిరుగుబాటు ధోరణి. ముస్లిం వారసత్వ చట్టాలను తమకు వర్తించకుండా చేయడానికి, తమ ముగ్గురు కుమార్తెలకు తమ ఆస్తి సంక్రమించడానికి వారు పునర్వివాహం చేసుకోవాలనుకోవడం ముస్లింలలో ఒక పెద్ద వివాదానికి దారి తీసింది. ప్రస్తుతం అమలులో ఉన్న ముస్లిం పర్సనల్‌ లా ప్రకార ౦, తండ్రికి మగ సంతానం లేనప్పుడు ఆయన ఆస్తి ఆయన సోదరులకు సంక్రమిస్తుంది. ఇది మహిళ ల ప్రయోజనాలకు విరుద్ధమని మహిళా వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాదు, ఖురాన్‌ బోధలకు, స్పూర్తి కి కూడా వ్యతిరేకమని అవి అభిప్రాయపడుతున్నాయి. షరియా మౌలిక పవిత్రతకు భంగం కలగకుండా అనేక దేశాలు ముస్లిం పర్సనల్‌ లాను సంస్కరించిన విషయాన్ని ఈ మహిళా వర్గాలు గుర్తు ఈ సంద ర్భంగా చేస్తున్నాయి.
ఇది ఇలా ఉండగా, కేరళ పరిణామాలను అనేక ముస్లిం సంఘాలు అనుమానంగానూ, భయంగానూ పరిశీలిస్తున్నాయి. దేశంలో యూనిఫామ్‌ సివిల్‌ కోడ్ను అమలు చేయడానికి అవసరమైన పరిస్థితులను సృష్టించే ప్రయత్నం జరుగుతోందని, ఇస్లాం మతానికి సంబంధించిన ప్రతి చర్య మీదా ఏదో రూపేణా దాడి చేయడం ఈ మధ్య కాలంలో ఆనవాయితీగా మారిపోయిందని ఈ ముస్లిం వర్గాలు అభిప్రాయప
డుతున్నాయి. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి కొందరు ముస్లిం పెద్దలు నడుం బిగించి, ఇటువంటి పరి స్థితులకు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించడం కూడా జరిగింది. అయితే, యూనిఫామ్‌ సివిల్‌ కోడ్ను ప్రవేశపెట్టాలన్నది తమ అభిమతం కాదంటూ మహిళా వర్గాలు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. హి దూ, క్రైస్తవ వారసత్వ చట్టాల మాదిరిగానే ముస్లిం పర్సనల్‌ లాలో కూడా మహిళలకు అనుకూలంగా కొన్ని మార్పులు చేయాలని మాత్రమే తాము కోరుతున్నామని ఆ వర్గాలు వివరణ ఇచ్చాయి.
కాగా, ఈ చర్చకు ప్రస్తుతానికి రాజకీయ పార్టీలన్నీ వీలైనంత దూరంగా ఉంటున్నాయి. కానీ, దీని వీ ద ఆరోగ్యకరమైన, సజావైన చర్చ జరగాలని మాత్రం అవి కోరుకుంటున్నాయి. ఫలితంగా, పరిస్థితిని అధ్వానం చేయడానికి, విషమం చేయడానికి, రాజకీయంగా లబ్ధి పొందడానికి ఇంకా ప్రయత్నాలు ప్రారంభం కాలేదు. మహిళా వర్గాలు వ్యక్తం చేసే సజావైన సమస్యలపై పాలకులు దృష్టి పెట్టాల్సి ఉంది. అదే సమయంలో మత భావనలను గౌరవించే ప్రయత్నం కూడా చేయాల్సి ఉంటుంది. ఈ డిమాండ్ల ను అవకాశంగా తీసుకుని, ఒక వర్గంవారిని కించపరిచే వారిని సాధ్యమైనంత దూరంగా ఉంచడం మం చిది. ఈ డిమాండ్లను, వాటి పర్యవసానాలను, ముస్లిం మతంలోని మహిళల కష్టనష్టాలను నిష్పాక్షికంగా పరిశీలించడానికి, ఆరోగ్యకరంగా చర్చించడానికి ప్రయత్నం జరగాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News