Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Women safety: పార్టీలకు చెలగాటం, మహిళలకు ప్రాణసంకటం

Women safety: పార్టీలకు చెలగాటం, మహిళలకు ప్రాణసంకటం

ఇది నిజంగా ప్రజాస్వామ్యానికి పరీక్ష. దేశంలో మహిళల మీద హింస పెరిగిపోవడమే కాదు, దీనికి దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలన్నిటి నుంచి, ప్రజల నుంచి ఆమోదం కూడా లభిస్తున్నట్టు కనిపిస్తోంది. మహిళలపై అత్యాచారాలకు పాల్పడినవారికి శాసనసభ స్థానాలకు టికెట్లు ఇవ్వడం అనేది గత అయిదారేళ్ల కాలంలో పెరుగుతూ వస్తోంది. సుమారు 260 మంది అభ్యర్థులు ఈ అత్యాచారాలకు పాల్పడిన వారేనంటే ఆశ్చర్యం కలుగుతుంది. అటువంటి అభ్యర్థులకు పార్టీలు టికెట్లు ఇస్తున్నాయి. న్యాయస్థానాలు మౌనం వహిస్తున్నాయి. ప్రజలు ఎన్నుకుంటున్నారు. నిజానికి, ఎన్నికలు వచ్చాయంటే భారతీయ ప్ర జాస్వామ్యానికి, రాజకీయ పక్షాలకు ఒక విధంగా పరీక్ష ప్రారంభమైనట్టే. ఏ పార్టీ ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చిందో గమనిస్తే ఆ పార్టీ గురించి అర్థమైపోతుంది. దేశంలో మహిళల జీవితాలకు భరోసా ఏమీ ఉండదు. ఇంట్లోనూ, ఆఫీసులోనూ, వీధుల్లోనూ ప్రమాదం పొంచి ఉంటుంది. వీరెంత ప్రమాదంలో ఉన్నారన్నది దేశంలో ఒక అమానుష అత్యాచారం జరిగితే తప్ప, పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తితే తప్ప ఒక పట్టాన ఎవరికీ అర్థం కాదు. ఇది పూర్తిగా మహిళల సమస్యే. కానీ, పాలకులు, పార్టీలకు కూడా ఇది సమస్య అయితే తప్ప ఈ మహిళల సమస్య పరిష్కారం కాదు.
విచిత్రమేమిటంటే, ఇది మహిళల సమస్య అనేవారు, మహిళల వస్త్ర ధారణ కారణంగానే వారిపై అత్యాచారాలు, లైంగిక దాడులు జరుగుతున్నాయని వాదిస్తుంటారు. ఇటువంటి వారికి నటి ప్రియాంక చోప్రా మాటలే తగిన సమాధానం అవుతుంది. “నేను వీధుల్లో నగ్నంగా తిరిగినా నా మీద అత్యాచారం జరగకూడదు.” అని ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో అన్నారు. మహిళల మీద లైంగిక దాడులు జరగ డం అనేది ఎక్కడో చెదురు మదురుగా జరుగుతున్న సంఘటనలుగా తీసిపారేయలేం. ఇది సర్వే సర్వతా పథకం ప్రకారంగా జరుగుతుంటాయి. ఇది దేశానికి సిగ్గుచేటైన విషయం. ఎక్కడైనా అత్యాచారం జ రగడం తరువాయి, రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు విమర్శలు, ఆరోపణలు సాగిస్తుంటారు. అత్యాచారానికి పాల్పడినవారు బాధితురాలిని, ఆమె కుటుంబాన్ని, ఆమెకు వత్తాసు వచ్చేవారిని, చివరికి పోలీసులను కూడా భయపెట్టి, బెదరించి నోరు మూయిస్తుంటారు. భారత ప్రజాస్వామ్యంలో ఇప్పుడు జరుగుతున్నది ఇదే. ఇక్కడ చట్టాలూ పని చేయవు, శిక్షలూ పడవు. వెరసి ఎక్కడా రక్షణ లేదు.
ఎక్కడి గొంగళి అక్కడే
ఉదాహరణకు, పార్టీలను, పార్టీల నాయకులనే తీసుకోండి. గత అయిదేళ్ల కాలంలో నేరస్థులకు ప్రతి పార్టీ టికెట్లు ఇచ్చింది. ముఖ్యంగా అత్యాచారాలకు పాల్పడిన నేరస్థులకు 260 మందికి ముందూ వెనుకా చూడకుండా పార్టీలు టికెట్లు ఇచ్చాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇందులో కాంగ్రెస్ 26, బీజేపీ 24, సమాజ్వాదీ పార్టీ 16, బహుజన్ సమాజ్ పార్టీ 18 టికెట్లు ఇవ్వడం జరిగింది. కాగా, 36 మంది శా సనసభ్యులు అనేక పర్యాయాలు అత్యాచారాలకు పాల్పడినవారే. వారి మీద పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి. కోర్టుల్లో కేసులు విచారణల్లో ఉన్నాయి. తమిళనాడులో ఒక ఎం.పి, పశ్చిమ బెంగాల్లో ఒక ఎం.పి మీద అత్యాచార ఆరోపణలున్నాయి. విచిత్రమేమిటంటే, మహిళలే నాయకులుగా ఉన్న పార్టీలు కూడా అత్యాచారాల నేరస్థులకు టికెట్లు ఇవ్వడం, గెలిపించడం జరిగింది. దేశంలోని రాజకీయ పార్టీలన్నీ నేరాలను దాదాపు ప్రత్యక్షంగానే ప్రోత్సహిస్తున్నాయి.
నిజానికి, అటువంటి నేరస్థులకు పార్టీలు టికెట్లు ఇచ్చి అధికారాలను కట్టబెట్టడం, ప్రోత్సహించడం శ్రేయస్కరం కాదు. వారిని గెలిపించడం ప్రజలకు కూడా ఏమాత్రం మంచిది కాదు. చిట్టచివరగా సుప్రీంకోర్టు వారి నేరాలను నిర్ధారించి శిక్ష విధించేవరకూ వారు శాసనసభ్యులుగానో, పార్లమెంట్ సభ్యులుగానో కొనసాగడం జరుగుతోంది. ఇది నిజంగా లా కమిషన్కు కూడా పరీక్ష లాంటిదే. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 8వ నిబంధనలో పేర్కొన్న నేరాల (లైంగిక నేరాలు కూడా)న్నిటిని వెంటనే పరిగణనలోకి తీసుకోవాలని, ఆరోపణలు వచ్చిన వెంటనే అటువంటి నేరస్థులను చట్టసభలకు పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించాలని లా కమిషన్ చాలా కాలం కిందటే సూచించింది. దీన్ని అమలులోకి తీసుకు రావడానికి కమిషన్ ఇప్పటికైనా గట్టిగా ప్రయత్నించాలి. అంతేకాదు, వారు నిర్దోషులుగా తేలే వరకూ పార్టీలు కూడా వారిని పార్టీ నుంచి బహిష్కరించాలి. వారు స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడడానికి మాత్రం న్యాయస్థానాలు ఎందుకు అనుమతించాలి? కండబలం, ధనబలంతో ఇటువంటి సంస్కరణలను ఆపడం ఏమైనా భావ్యంగా ఉందా?
సరికొత్త సాకులు
ఆ సమయంలో తాగి ఉన్నాడనే సాకుతో, బాధితురాలి అనుమతితోనే సంపర్కం జరిగిందనే నెపంతో కసులు కొట్టేయడాన్ని బ్రిటిష్వారి శిక్షా స్మృతి అంగీకరిస్తుంది. ఈ శిక్షా స్మృతి ఇప్పుడు పాతబడిపోయింది. ఇదే చట్టం సహాయంతో 2012లో ఒక అత్యాచారం కేసులో న్యాయస్థానం మరణ శిక్షను తగ్గించింది. సందేశ్ అనే ఒక వ్యక్తి ఒక గర్భిణీపై అత్యాచారం జరిపి, అడ్డువచ్చిన ఆమె అత్తగారిని హతమార్చా డు. అతను తాగి ఉండడం వల్ల ఇలా చేయడం జరిగిందనే కారణంతో అతని శిక్షను తగ్గించడం జరిగింది. తాగి ఉన్నాడనే కారణంతో బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటికి వరకు లక్షల సంఖ్యలో నేరస్థులు శిక్షల నుంచి తప్పించుకున్నారు. ఇంకా చాలా మంది తప్పించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. అత్యా 2012 చార నిరోధక చట్టంలో సవరణ తీసుకు రావడానికి ప్రయత్నం జరిగింది. అత్యాచారం అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో లైంగిక దాడి అనే పదాన్ని ప్రవేశపెట్టాలని ప్రయత్నించారు. ఈ సవరణ బిల్లు (పకారం, అత్యాచారానికి లేదా లైంగిక దాడికి పాల్పడినవారిని నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణించి, వి చారిస్తారు. పైగా 18 ఏళ్లు పైబడ్డ బాధితురాలు అంగీకరిస్తేనే అది సాధారణ సంపర్కమవుతుంది. బాధితురాలు మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడానికి అవకాశం కల్పించడం కూడా జరిగింది. ఈ బిల్లు రాజకీయ సంఘీభావాన్ని పొందకుండానే పార్లమెంట్ ఆమోదం పొందింది.
కాగా, దేశంలో అత్యాచారాలకు సంబంధించిన కేసులు ఆయేటికాయేడు విపరీతంగా పెరిగిపోతున్నా యి. గత అయిదేళ్ల కాలంలో దేశంలో 1,09,979 అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఇందులో 26 శాతం కేసుల్లో మాత్రమే శిక్షలు పడ్డాయి. దారుణమైన విషయమేమిటంటే, అత్యాచారానికి సంబంధించిన కేసులను బాధితులెవరూ పోలీసులకు ఫిర్యాదు చేయరు. దర్యాప్తులు, విచారణలు అతి దారుణంగా, జుగుప్సాకరంగా ఉంటాయని అందరికీ తెలుసు. అత్యాచారాల కేసులను విచారించడానికి ఢిల్లీలో కనీసం అయిదు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అవసరమని ఒకప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ విజ్ఞప్తి చేశారు. ఇక సాధారణంగా న్యాయమూర్తులు సెలవుల్లో ఉంటారు. న్యాయస్థానాల్లో న్యాయమూర్తులకు కొరత ఉ ంది. అత్యాచారాల కేసులలో సైతం విచారణకు రావడానికి, విచారణ పూర్తవడానికి, శిక్షలు పడడానికి ఏళ్లూ పూళ్లూను ఏర్పాటు పడుతుంది. చేయాలని, అత్యాచార కేసులను దర్యాప్తు చేయడానికి, విచారించడానికి ప్రత్యేక వ్యవస్థల త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని, కఠిన శిక్షలు విధించాలని గతంలో న్యాయమూర్తులు గీతా మిట్టల్, క్షేత్రపాల్ తదితరులు సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News