Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్World statistics day: సుస్థిరాభివృద్ధికి గణాంకాలే పునాది

World statistics day: సుస్థిరాభివృద్ధికి గణాంకాలే పునాది

ప్రపంచ స్టాటిస్టిక్స్ డే

మానవ అభివృద్ధిలో సంక్షేమ సాధనలో గణాంకాలు ముఖ్య పాత్ర పోషిస్థాయి. కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలు అభివృధి ప్రణాళికలు సంక్షేమ పథకాలు ఆర్థిక విధానాల రూపకల్పనలో గణాంకాలు (గణాంక శాస్త్రం) దిక్షూచిగా పనిచేస్తాయి. ప్రభుత్వ విధానాల రూపకల్పనకు గణాంకాలే పునాది. కేంద్ర రాష్ట్రాల మధ్య వనరుల పంపిణీ కేటాయింపు పెట్టుబడులు స్థాయిని నిర్ణయించడానికి ఆధునిక ప్రభుత్వాలకు గణాంకాలు అవసరం.
ఐరాస ప్రపంచ గణాంక శాస్త్ర దినోత్సవం
1947లో ఐక్యరాజ్య సమితి లో భాగమైన యునైటెడ్‌ నేషన్స్‌ స్టాటిస్టికల్‌ కమిషన్‌ నేతృత్వంలో ప్రతి 5 ఏళ్లకు ఒక సారి అక్టోబర్‌ 20న ప్రపంచ గణాంక శాస్త్ర దినోత్సవం జరపడం సాంప్రదాయం 2010’ 2015’ 2020’ 2025 సంవ త్సరాలలో అనేక దేశాలు ప్రపంచ గణాంక శాస్త్ర దినోత్సవం ప్రతి 5 యేళ్ళకు ఒక సారి పాటిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా దేశాలు సుస్తిరాభివృద్ది కోసం గణాంక శాస్త్రాన్ని ఎక్కువగా వినియోగించు కుంటాయి. ప్రభుత్వాలు ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాల రూపకల్పన ‘సర్వేల నిర్వహణ సమాచార సేకరణ’ క్రోడీ కరణ పథకాల అమలు సమీక్ష నూతన ప్రభుత్వ విధానాల నిర్ణయాలకు గణాంకాలే కీలకం ప్రపంచ గణాంక దినోత్సవం నినాదంగా ‘కనెక్టింగ్‌ థి వరల్డ్‌ విత్‌ డాటా వి కెన్‌ ట్రస్ట్‌’ అనే అంశాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది.
ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాలకు సంబంధించిన ఖచ్చితమైన డాటా కను గొనడానికి గణాంకాలు ఉపయోగపడుతాయి. ఉదాహరణకు 10 సంవత్సరా లలో జనాభా పెరుగుదల తెలియాలంటే గణాంకాలు డాటాను చూడవలసిందే.
29 జూన్‌ జాతీయ గణాంకాల దినోత్సవం
గణాంక ఆర్థిక ప్రణాళిక రూపకల్పనలో ప్రొఫెసర్‌ కీర్తి శేలు ప్రశాంత చంద్ర మహలనోబిస్‌ స్వాతంతంత్ర అనంతరం ఆర్థిక ప్రణాళికా మరియు గణాంక అభివృధి రంగాలకు ఆయన చేసిన గణనీయమైన విశేష సేవలకు కృషి కి గుర్తింపుగా భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్‌ 29వ తేదీని ఆయన జయంతిని భారత ప్రభుత్వం గణాంకాల దినోత్సవంగా ప్రకటించింది.
సామాజిక ఆర్థిక ప్రణాళిక మరియు ఆర్థిక యాజమాన్య విధాన రూప కల్పనలో గణాంక శాస్త్రం యొక్క పాత్ర ప్రాముఖ్యత గురించి ప్రొఫెసర్‌ మహ లనోబిస్‌ నుండి ప్రేరణ పొందడానికి యువతరంలో గణాంక శాస్త్రం పై అవ గాహన కల్పించడం సదస్సులు సమావేశాలు చర్చలు ఏర్పాటు చేయడం గణాం కాల ప్రాధాన్యత మీద అవగాహన చైతన్యం కలిగించడం ఈ దినం యొక్క ముఖ్య లక్ష్యం.
మహలనోబిస్‌ రచనలు కృషి
భారత ప్రభుత్వం 2007 లో మొట్టమొదటి సారిగా ప్రొఫెసర్‌ మహాల నోబిస్‌ జన్మదినమైన జూన్‌ 29ని జాతీయ గణాంకాల దినోత్సవంగా ప్రకటిం చింది. స్టాటిస్టిక్స్‌ రంగములో మహాలనోబిస్‌ విశేష రచనలు చేశారు. మహాల నోబిస్‌ చేసిన శాంపిల్‌ సర్వే పరిశోధన ఫలితంగా దేశంలో పరిశోధన శిక్షణ సంస్థలు ఏర్పడ్డాయి. 1931 లో ప్రొఫెసర్‌ మహలనోబిస్‌ ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్స్టిట్యూట్‌ స్థాపించారు. ఆయనను ఫాథర్‌ ఆఫ్‌ ఇండియన్‌ స్టాటిస్టిక్స్‌ అని కూడా పిలుస్తారు. పెద్ద ఎత్తున నమూనా సర్వే రూపకల్పన విధానాలు రూపొం దించాడు.
మల్టీవియారిట్‌ పై స్పేస్‌లోని రెండు డాటా సెట్ల మధ్య పోలిక కొలమాన మైన మహలనోబిస్‌ దూరం అనబడే పద్ధతిని రూపొందించాడు. ఈపద్ధతి ద్వారా అతను బాగా గుర్తుండి పోయాడు. రెండూ లేదా అంతకంటే ఎక్కువ వెరియబుల్స్‌ పరస్పర సంబంధం కలిగి ఉన్నప్పుడు మహల్‌ దూరం ఉపయోగ పడుతుంది. మరియు పాలకుడితో దూరాన్ని కొలవడం సాధ్యం కాదు. ఈ కొల త సమస్యను పరిష్కరిస్తుంది.
ఎందుకంటే ఇది బహుళ వేరియబుల్స్‌ కోసం పాయింట్లు మధ్య దూరా లను పరస్పర సంబంధం ఉన్న పాయింట్లను కూడా కొలుస్తుంది. ప్రణాళిక బద్దంగా సమాచారాన్ని రాబట్టడంలో గణాంకాలు అన్ని రంగాలలో బహుముఖ పాత్ర పోషిస్తాయి. గణాంకాల ద్వారా కచ్చితమైన సమాచారాన్ని స్పష్టం గా సంక్షిప్తంగా పొందవచ్చు.మహలనొబిస్‌ అనువర్తిత గణాంక వేత్త మహాల నోబిస్‌ దూరం ‘గణాంక కొలత’ యాదృచ్ఛిక నమూనా పద్ధతిని ప్రవేశ పెట్టాడు.
నేటి సర్వేలకు ఆద్యుడు మహలనోబిస్‌ నేడు నిర్వహిస్తున్న పలు సర్వేల విధానాన్ని పైలట్‌ సర్వేల భావాన్ని నమూనా పద్ధతుల ప్రాముఖ్యతను చాటి చెప్పాడు. భారత ప్రణాళిక వ్యవస్థ పితామహుడిగా గుర్తింపు పొందిన మహా లనో బిస్‌ సేవలను గుర్తించి భారత ప్రథమ ప్రధాన మంత్రి జవహర్లాల్‌ నెహ్రూ భారత ప్రభుత్వ గణాంక సలహాదారుగా నియమించాడు.
భారీవ్యూహం మహలనోబిస్‌ మోడల్‌
భారీ పరిశ్రమలకు ప్రాముఖ్యత ఇచ్చిన భారత రెండవ పంచ వర్ష ప్రణాళిక (1956_61)లో మహాలనోబిస్‌ సభ్యుడు సోవియెట్‌ ఆర్థిక వేత్తGA ఫీల్డ్‌ మాన్‌ తో కలిసి రెండవ పంచ వర్ష ప్రణాళిక కోసం రెండు రంగాల ఇన్పుట్‌ అవుట్‌ పుట్‌ మోడల్‌ ఫీల్డ్‌ మెన్‌ _ మహలనోబిస్‌ మోడల్‌ ను రూపొందించాడు. వర్థమాన ఆర్థిక వ్యవస్థకు ఉపయోగకరమైన ప్రమాణాలను మహాలనోబిస్‌ ప్రవేశ పెట్టాడు . మహలనోబిస్‌ జాతీయాదాయ కమిటీ చైర్మన్‌ గా స్థూల జాతీయ ఉత్పత్తి అంచనాలు జాతీయ ఆదాయ అంచనాలకు ప్రాతి పదికలను రూపొందించాడు.
ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి ఉత్పాదకత ఉపాధి మూలధన ఉత్పత్తి నిష్పత్తి పొదుపు పెట్టుబడి వృది అభివృధి మధ్య ఉన్న సంబoధాన్ని మహలనోబిస్‌ సమ గ్రంగా అధ్యయనం పరిశోధన చేశారు. జాతీయ గణాంక వ్యవస్థను స్థాపించ డంలో మహలనోబిస్‌ కీలకపాత్ర పోషించాడు.
గణాంకాల ప్రాధాన్యత
గణాంకాలు డేటాను సేకరించడం విశ్లేషించడం నిర్వహించడం ప్రాతి నిధ్యం వహించడం లాంటి అంశాలు ప్రాముఖ్యాన్ని కలిగి వుంటాయి. దేశ ఆర్థిక ప్రణాళికలు ఆర్థిక విధానాలు వనరుల పంపిణీ కేటాయింపు వినియోగం వివిధ రంగాల మధ్య పెట్టుబడులు కేటాయింపుకు వివిధ రంగాల మధ్య బడ్జెట్‌ కేటాయింపు. ఆర్థిక ప్రగతి పురోగతి పథకాల రూపకల్పన సమీక్షా అమలుకు ఉపయోగ పడతాయి.
విద్య వైద్య రంగం గణాంకాలు
ఆరోగ్య సంరక్షణ రంగములో గణాంకాలు కీలక పాత్ర పోషిస్తాయి. సామాజిక ఆర్థిక పారిశ్రామిక సర్వేలు నిర్వహించడం లో సహాయపడతాయి. దేశములో లభించే వనరులను సద్వినియోగం పరుచుకోవడానికి అవలంభించా ల్సిన విధానాల రూపకల్పనలో ఉపయోగ పడతాయి. విద్య వైద్య రంగాల అభి వృద్ధికీ అవసరమగు ప్రణాళికలు రూపొందించడానికి ప్రణాళిక సంఘం గణాంకాలను ఉపయోగిస్తుంది.
అభివృద్ధి వ్యూహాలు గణాంకాలు
ఆరోగ్య సంరక్షణ మాత్రమే కాకుండా పారిశ్రామిక సేవా రంగాలలో అభివృద్ధి వ్యూహాలను ప్రణాళికను రూపొందించడానికి సహాయ పడుతుంది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ నిర్మాణ రంగం అమ్మకాలు మార్కెటింగ్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ ఇన్సూరెన్స్‌ రవాణా మొదలగు రంగాలకు గణాంకాలు దిక్సూచి లాగా పనిచేస్తాయి. మానవ జీవితములో ప్రభుత్వాల ఆర్థిక వ్యవహారాల్లో కీల క పాత్ర పోషించిన గణాంకశాస్త్ర పరివ్యాప్తికి విశేష కృషి చేసిన ప్రొఫెసర్‌ మహాలనొబిస్‌ కృషిని విశ్వ వ్యాప్తంగా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం. ఐక్యరాజ్య సమితి లక్ష్యమైన సుస్థిర అభివృధి లక్ష్య సాధనలో ముందుకు వెళ్ళడానికి పౌర సమాజం ప్రభుత్వాల భాగస్వామ్యం సమన్వయము సామర్థ్యం పెంచు కొని సుస్థిర అభివృద్ధి సిద్ధిస్తుందని ఆశిద్దాం.

  • నేదునూరి కనకయ్య
    9440245771
    (నేడు ప్రపంచ గణాంక శాస్త్ర దినోత్సవం )
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News