Saturday, October 12, 2024
Homeఓపన్ పేజ్World's Largest Health Insurance Scheme: వృద్ధులకు ఎట్టకేలకు ఆరోగ్య బీమా పథకం

World’s Largest Health Insurance Scheme: వృద్ధులకు ఎట్టకేలకు ఆరోగ్య బీమా పథకం

వృద్ధులకు ఆరోగ్య భద్రతకు సంబంధించి..

వృద్ధుల విషయంలో ఎట్టకేలకు ఒక అత్యవసర సంక్షేమ పథకం ప్రారంభం అయింది. డెబ్భ య్యేళ్లు, అంతకు పైబడినవారికి ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమాను వర్తింపజేయడం నిజంగా ఎంతో సంతోషించాల్సిన విషయం. ఆరోగ్య భద్రతకు సంబంధించినంత వరకూ ఇది అతి ప్రధానమైన చర్య అనడంలో సందేహం లేదు. ఆరోగ్య బీమా పథకంలో ఉన్న అతి ప్రధాన లోటుపాట్లను ఇది భర్తీ చేస్తుంది. సామాజిక, ఆర్థిక స్థితిగతు లతో సంబంధం లేకుండా దేశంలోని 4.5 కోట్ల కుటుంబాలలో ఆరుకోట్ల మందికి పైగా వృద్ధులకు ఇది లబ్ధి చేకూరుస్తుంది. మేలో జరిగిన లోక్‌ సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాల్లో ఇదొకటి. దీనికి కేంద్ర మంత్రివర్గం గత బుధవారం రోజున ఆమోద ముద్ర వేసింది. దీని మీద కేంద్ర ప్రభుత్వానికి మొదటి సంవత్సరంలో రూ. 3437 కోట్లు ఖర్చవుతాయని అంచనా. ప్రైవేట్‌ బీమా సంస్థల బీమా పథకాలను, ఇ.ఎస్‌.ఐ బీమా పథకాలను అనుభవిస్తున్న వారికి కూడా ఈ తాజా బీమా పథకం వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) తీసుకున్నవారు ఈ పథకానికి, తాజా పథకానికి మధ్య ఏదో ఒకదానిని ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటించిన బీమా పథకానికి కొన్ని పరిమితులున్నాయి. దీని కింద వృద్ధు లకు 5 లక్షల రూపాయల వరకే బీమా సౌకర్యం లభిస్తుంది. ఒక కుటుంబంలో ఒకరిని మించి వృద్ధులున్న పక్షంలో వారిద్దరూ ఈ పథకాన్ని పంచుకోవాల్సి ఉంటుంది. లబ్ధిదారులు ఇదివరకే ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో ఉన్న పక్షంలో కుటుంబంలో ఒకరికి మించిన సంఖ్యలో వృద్ధు లున్నా వారు పంచుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ పథకం అతి త్వరలో అమలులోకి రాబో తోంది. ఈ పథకానికి కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ, దీనివల్ల కలిగే లాభాలను తీసిపారేయలేం. దేశంలో వృద్ధుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నందువల్ల ప్రభుత్వం వారికి లబ్ధి చేకూర్చడమనేది ఏ విధంగా చూసినా హర్షణీయ విషయమే. ముఖ్యంగా వృద్ధులకు ఆరోగ్యం ప్రధాన అవసరంగా ఉన్న స్థితిలో ప్రభుత్వం దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం వల్ల కోట్లాది మంది వృద్ధులకు తప్పకుండా మేలు జరుగుతుంది. ఇది ప్రభుత్వ బాధ్యత కూడా. నిజానికి దేశంలో ఆరోగ్య బీమా వర్తిస్తున్న వృద్ధుల సంఖ్య అతి తక్కువ. కేవలం 27 శాతం ప్రజలు మాత్రమే ఆరోగ్య బీమా పొందు తున్న స్థితిలో అందులో వృద్ధుల సంఖ్య మరీ తక్కువగా ఉంటోంది. ఇటువంటి పరిస్థితుల్లో వృద్ధులకు ఆరోగ్య భద్రతకు సంబంధించి ఏ చిన్న చర్య తీసుకున్నా అది తప్పకుండా ఉపయో గకరంగానే ఉంటుంది. ఇది అతి ముఖ్యమైన సామాజిక సంక్షేమ కార్యక్రమం.
ఆరోగ్య భద్రత, సంరక్షణ పథకాలకు సంబంధించి ప్రభుత్వం మరింత ముందుకు పోవలసిన అవసరం ఉంది. సి.జి.హెచ్‌.ఎస్‌ తో సహా ప్రస్తుతం అమలులో ఉన్న అనేక ఆరోగ్య పథకాలు ఆస్పత్రులలో చేరిన వారికి, సంబంధిత ఖర్చులకు మాత్రమే వర్తిస్తాయి. ఓపీడీలకు, ఔట్‌ పేషెంట్‌ సేవలకు వర్తించవు. నిజానికి, సుమారు 60 శాతం రోగుల విషయంలో రోగ నిర్దారణకు, పరీక్షలకు, మందులకు మాత్రమే ఎక్కువగా ఖర్చవుతుంటుంది. రోగులకు ఈ వ్యవహారమే మరింతగా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. ఇతర దేశాల్లో ఇటువంటి బీమా పథకాలు అమలు జరుగుతున్న తీరును పరిశీలించి, ఆరోగ్య బీమాను కొత్త విభాగాలకు విస్తరించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన వృద్ధుల ఆరోగ్య బీమా పథకం సత్ఫలితాలనివ్వాలన్న పక్షంలో ప్రాథమిక సౌకర్యాలను పెంచడం, అవినీతిని తగ్గించడం, చికిత్సలను తిరస్కరించకపోవడం వంటివి తప్పనిసరిగా జరగాల్సిన అవసరం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News