Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Diomedes Islands: రెండు దీవుల మధ్య దూరం 4km, కానీ 21 గంటల తేడా!

Diomedes Islands: రెండు దీవుల మధ్య దూరం 4km, కానీ 21 గంటల తేడా!

ఐ ల్యాండ్స్ లో అడుగు పెడితే టైమ్ మెషిన్లో పాస్ట్, ఫ్యూచర్ లోకి వెళ్లచ్చు

ఈ సువిశాల భూగోళంపై ప్రపంచంలో మనకు తెలియని వింతలు, విడ్డూరాలు ఎన్నో ఉన్నాయి. మనకు తెలిసినవి కొన్నైతే, తెలియని వాటి గురించి తెలుసుకున్నప్పుడు ఔరా అనిపించక మానదు. గడ్డకట్టే ధృవాలు, అతిపెద్ద సముద్రాల నుండి అతి చిన్న ద్వీపాల వరకు, మన భూగోళం యొక్క స్థలాకృతి మనం ఊహిం చగలిగే దానికంటే చాలా వైవిధ్యంగా ఉంటుంది. ప్రకృతి యొక్క అద్భుతాలను చూసినప్పుడు లేదా తెలుసుకున్న ప్పుడు మనం సంభ్రమాశ్చర్యాలకు గురికావడం అత్యంత సర్వసాధారణం. సృష్టిలోని అలాంటి ఒక అద్భుతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ‘డయోమీడ్‌ అనే ఒకే పేరుతో అమెరికా మరియు రష్యాలలో రెండు దీవులున్నాయి. రష్యా ఆధీనంలో ఉండే బిగ్‌ డయోమీడ్‌ మరియు అమెరికా ఆధీనంలో ఉండే ది లిటిల్‌ డయోమీడ్‌ దీవుల మధ్య దూరం కేవలం 3.8 కిలో మీటర్లు లేదా 2.4 మైళ్ళు అయినప్పటికీ సమయం పరంగా 21 గంటల వ్యత్యాసం ఉంటుంది. ఈ దీవులను మొట్టమొదటగా 1728 ఆగస్టు 16న డానిష్‌ నావిగేటర్‌ విటస్‌ బెరింగ్‌ కనుగొన్నాడు. అదే రోజున రష్యన్‌ ఆర్థోడక్స్‌ చర్చి సెయింట్‌ డయోమీడెస్‌ జ్ఞాపకార్థం ఉత్సవాలు జరుపుకోవడంతో, ఈ దీవులకు డయోమీడ్ ఐలాండ్స్‌ అని పేరు వచ్చింది. 1732లో, ఒక రష్యన్‌ జియోడెసిస్ట్‌, మిఖాయిల్‌ గ్వోజ్‌దేవ్‌, ఈ రెండు ద్వీపాలకు రేఖాంశం మరియు అక్షాంశాలను నిర్ణయించారు. అలాస్కా మరియు సైబీరియా మధ్య బేరింగ్‌ జల సంధిలో బిగ్‌ డయోమీడ్‌ మరియు ది లిటిల్‌ డయోమీడ్‌ అనే ఈ రెండు దీవులున్నాయి. అంతర్జాతీయ తేదీ రేఖకు ఇరువైపులా ఉన్నందున వీటిని ఎస్టర్‌ డే అండ్‌ టుమారో ఐలాండ్స్‌ అని కూడా పిలుస్తారు. వేసవిలో సగటున 40 నుండి 50 డిగ్రీల ఫారెన్‌హీట్‌ వరకు ఉండే ఉష్ణోగ్రతలు శీతాకాలంలో మరింత చల్లగా, సగటున 6 నుండి 10 డిగ్రీల ఫారెన్‌హీట్‌ వరకు ఉంటుంది. ప్రతి సంవత్సరం, ఆర్కిటిక్‌ సముద్రపు మంచు దక్షిణ దిశగా బేరింగ్‌ మరియు చుక్చి సముద్రాల నుండి జలసంధిలోకి విస్తరిస్తుంది. అయితే, జూన్‌ నాటికి సాధారణంగా కరగడం ప్రారంభమయ్యే మంచు, ఉత్తరం వైపుకు వెనక్కి వెళ్లి, నల్లని నీటిని విసర్జిస్తుంది. రెండు ద్వీపాల మధ్య ఉన్న నీరు రెండు దేశాల సముద్ర సరిహద్దు ద్వారా విభజించబడింది. ఈ ప్రకరణానికి చారిత్రాత్మకంగా ‘మంచు తెర’ అని పేరు పెట్టారు. అంతర్జాతీయ తేదీ రేఖ ఈ రెండు ద్వీపాలను విభజిస్తుండటంతో, లిటిల్‌ డయోమీడ్‌ ద్వీపంలో నిలబడిన వ్యక్తి బిగ్‌ డయోమీడ్‌లోని దృశ్యాన్ని వీక్షిస్తున్నప్పుడు 21 గంటలు భవిష్యత్తులోకి చూస్తున్నట్టు అన్నమాట.
1867లో యునైటెడ్‌ స్టేట్స్‌, రష్యా నుండి అలాస్కాను కొనుగోలు చేసినప్పుడు, అందులో 7.3 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో గల లిటిల్‌ డయోమీడ్‌ లేదా క్రుసెన్‌స్టెర్న్‌ ద్వీపం ఉంది. కాగా, ఆ కొనుగోలు ఒప్పందంలో రత్మనోవ్‌ ఐలాండ్ అని పిలువబడే బిగ్‌ డయోమీడ్‌ చేర్చబడక పోవడంతో అది రష్యా ఆధీనంలోనే ఉండిపోయింది. తదనంతర కాలంలో, రెండు దేశాలు ద్వీపాల మధ్య సరిహద్దు రేఖను నిర్ణయించుకున్నాయి. ఈ రెండు దీవుల మధ్య మార్గాన్ని ‘మంచు తెర’ అని పిలుస్తారు. సాధారణంగా శీతాకాలంలో ఈ రెండు ద్వీపాల మధ్య ఒక మంచు వం తెన విస్తరిస్తుంది. అందువల్ల కొన్నిసార్లు యునైటె్‌డ స్టేట్స్‌ మరియు రష్యాల మధ్య కాలినడకన చేరుకోవడం సిద్ధాంత పరంగా సాధ్యమైనప్పటికీ అటువంటి ప్రయాణం చట్టబద్ధంగా ఖచ్చితంగా నిషేధించబడినది.
జీవన ప్రమాణాలు
డయోమీడ్‌ దీవుల నైసర్గిక స్వరూపం మరియు కఠినమైన వాతావరణ పరిస్థితుల కారణంగా అక్కడి ప్రజలు అనేక సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. శీతాకాలంలో డయోమీడ్ దీవులలో కనిష్ట ఉష్ణోగ్రతలు గరిష్టంగా మైనస్‌ 14 డిగ్రీల స్థాయికి చేరుకోవడంతో పాటు డిసెంబర్‌ నుండి జూన్‌ వరకు మంచుతో గడ్డ కట్టుకుపోయి వేసవిలో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల స్థాయికి చేరుకుంటుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వనరుల పరిమిత సౌలభ్యత మరియు కనీస ఆర్థిక అవకాశాలు తీరే మార్గాలు లేక పోవడంతో అక్కడి ద్వీపవాసులు ఎన్నో ఇక్కట్లు ఎదుర్కోవలసి వస్తుంది. అయినప్పటికీ, అలాస్కాకు చెందిన ఇను పియాట్‌ జాతి ప్రజలు 3,000 సంవత్సరాలకు పైగా లిటిల్‌ డయోమీడ్ ద్వీపంలో ప్రమాదకరమైన పరిస్థితులను సైతం ఎదురొడ్డి విశేషమైన స్థితిస్థాపకత మరియు నిబ్బరాన్ని ప్రదర్శిస్తూ తమ సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకుంటున్నారు. 1990 నాటి అమెరికా జనాభా లెక్కల ప్రకారం లిటిల్‌ డయోమీడ్‌లో గరిష్టంగా 178 మంది నివసిస్తుండగా, 2010 నాటికి అది 115కు మరియు జనవరి 2023 నాటికి 77 కు క్షీణించింది. ఈ ద్వీపం యొక్క పశ్చిమ భాగంలోగల ఒక చిన్న బీచ్‌ ప్రాంతంలోని నివాసితులు తమ ఇళ్ల నుండి రష్యా ఆధీనంలో గల బిగ్‌ డయోమీ్‌డ లోని ఇళ్ళను వీక్షించే అవకాశం ఉంది. ఈ ద్వీపంలో దాదాపు 30 భవనాలు, ఒక పాఠశాల, ఒక లైబ్రరీ, తపాలా కార్యాలయం చిన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఒక చర్చి మరియు హెలిపోర్ట్‌ ఉన్నప్పటికీ రోడ్లు లేవు. పట్టణంలో రెస్టారెంట్‌లు లేదా హోటళ్లు లేవు. అలాస్కాలోని నోమ్‌ పట్టణం నుండి సముద్రం ద్వారా సరఫరా చేయబడే పరిమితమైన రకాల ఆహారం, దుస్తులు, ఆయుధాలు మరియు ఇంధనం లభించే ఒక దుకాణం మాత్రమే ఇక్కడ ఉంది. ఇక్కడి నివాసితులు తమ ఆహారం కోసం తిమింగలాలు మరియు సీల్‌లతో పాటు తమపై దాడి చేసే అవకాశం ఉండే ధృవపు ఎలుగుబంట్లను వేటాడుతారు. ఐవరీ చెక్కడంలో మంచి నైపుణ్యం కలిగిన వీరు తమ ఉత్పాదనలను అలస్కాలో అమ్ముతారు. ఇక్కడ జనాభా అప్పుడప్పుడు మైనింగ్‌, భవన నిర్మాణం లాంటి చిన్ని ఉద్యోగాలు చేస్తూ ఉంటారు.
1948లో సైనిక స్థావరం స్థాపించబడిన తర్వాత బిగ్‌ డయోమీడ్‌ ద్వీపంలో శాశ్వత స్థానిక జనాభా లేకుండా పోయింది. సోవియట్‌ ప్రభుత్వం, ద్వీపంలోని స్థానిక జనాభాను రష్యా ప్రధాన భూభాగానికి తరలించింది. ఇప్పుడు అక్కడ ద్వీపంలో రష్యన్‌ వాతావరణ కేంద్రం మరియు రష్యన్‌ బోర్డర్‌ గార్డ్‌ దళాల స్థావరాలు నెలకొని ఉన్నాయి. ఈ ద్వీపంలో నిరంతరం నివసించే జనాభా ఉండరు. కేవలం రష్యన్‌ సైనికులు వస్తూ పోతూ ఉంటారు. అలాగే ఇంటర్నెట్‌, వార్తా పత్రికలు, వినోదాలు లాంటి సౌకర్యాలు కూడా లేని ఈ ద్వీపంలో ఒకప్పుడు నివసించే ఎస్కిమోస్‌ కూడా అక్కడ నుండి అలస్కాకు తరలి పోయారు. ఏదో ఒక దీవి ఉంది అంటే ఉంది. ఇక్కడ ఆహార పదార్థాలు మంచుతో గడ్డ కట్టుకుపోయి ఉంటాయి కాబట్టి, వాటిని వేడిచేసి కరిగించుకుని తినాలి. ఇక్కడ ఉండే రష్యన్‌ సైనికులు వారానికి ఒక సారి స్నానం చేస్తారు. ఇక్కడ కొన్ని చోట్ల వాల్రస్‌ లాంటి నీటి జంతువులు ఉంటాయి.
దీవుల మధ్య రాకపోకలు
1948 వరకు సోవియట్‌ మిలిటరీ కఠినమైన సరిహద్దు నియంత్రణను అమలు చేయడం ప్రారంభించే వరకు కూడా ఈ రెండు ద్వీపాల మధ్య రాకపోకలు సాధారణంగానే కొనసాగేవి. సోవియట్‌లు బిగ్‌ డయోమీడ్‌ జనాభాను సైబీరియా ప్రధాన భూభాగానికి బలవంతంగా తరలించి బిగ్‌ డయోమీడ్‌లో జనావాసాలు లేకుండా చేశారు. సోవియట్‌ యూనియన్‌ చేపట్టిన ఈ చర్య సాధారణంగానే సరిహద్దులో నివసించే కుటుంబాల మధ్య విభజనకు కారణమయ్యింది.
విచిత్రమైన అనుభూతి
అంతర్జాతీయ తేదీ రేఖకు డయోమీడ్‌ దీవులు అతి సమీపంలో ఉండడంతో రెండు దీవులలో సమయం చాలా విచిత్రంగా ఉంటుంది. రష్యా మరియు యునైటెడ్‌ స్టేట్స్‌ మధ్య సమయ వ్యత్యాసం కారణంగా, బిగ్‌ డయోమీడ్‌ ఒక రోజు ముందు అంటే ‘రేపు‘లో ఉంటే అదే లిటిల్‌ డయో మీడ్‌ దాదాపు ఒక రోజు వెనుక అంటే ‘ఈరోజు‘ లేదా ‘నిన్న‘లో ఉంటుంది. విభిన్న ప్రాంతాలు మరియు సమయంలో వ్యత్యాసం కారణంగా ఈ రెండు దీవులు అంతర్జాతీయ సరిహద్దుల సంక్లిష్టతలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తాయి. వీటిని సందర్శించిన వారు అక్షరాలా భవిష్యత్తు లేదా గతంలోకి అడుగు పెట్టడానికి అవకాశం ఉండడంతో, విచిత్రమైన అనుభూతికి లోనవుతారు.
యేచన్‌ చంద్ర శేఖర్‌
మాజీ రాష్ట్ర కార్యదర్శి
ది భారత్‌ స్కౌట్స్‌, గైడ్స్‌, తెలంగాణ

  • 8885050822
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News