Friday, September 20, 2024
Homeఫీచర్స్Abortion Pill: జ‌పాన్ మ‌హిళల విజ‌యం

Abortion Pill: జ‌పాన్ మ‌హిళల విజ‌యం

ఆధునిక సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకోవ‌డంలో జ‌పాన్‌కు ఉన్న నైపుణ్యం మ‌రోదేశానికి లేదంటే అతిశ‌యోక్తి కాదు. ప‌నిని దైవంగా .. జీవితం కేవ‌లం ప‌ని చేయ‌డానికి మాత్ర‌మే అన్న‌ట్లుగా జ‌ప‌నీయులు ప‌ని చేస్తార‌ని ప్ర‌పంచ‌ ప్ర‌జ‌లు భావిస్తారు. జ‌పాన్‌లో స్త్రీ, పురుషులు ప‌నిలో మునిగిపోయి వివాహాలు, పిల్ల‌ల‌ను క‌న‌డం కూడా వాయిదా వేస్తున్నారు. వ్య‌క్తిగ‌త ప‌నులు .. ఆఫీసు ప‌నుల కోసం రోబోల‌పై ఆధార‌ప‌డుతున్నారు. రోబోల‌తో మాట్లాడుతూ రాకెట్ యుగంలోకి దూసుకెళుతున్న జ‌పాన్‌లోనూ మ‌హిళ‌ల‌పై వివ‌క్ష కొన‌సాగుతోంది. అయితే జ‌పాన్ మ‌హిళ‌లు పోరాడి మ‌రీ వారి హ‌క్కుల‌ను సాధించుకున్నారు. గ‌ర్భ‌ధార‌ణ‌, అబార్ష‌న్ విష‌యాల‌పై హ‌క్కుల‌ను సాధించుకున్నారు.

- Advertisement -

జపాన్ మహిళలు విజయం సాధించారు. ప్రభుత్వంపై పోరాడి మ‌రీ తమ హక్కును సాధించుకున్నారు. ఫలితంగా తొలిసారి ఆ దేశంలో అబార్షన్ పిల్ అందుబాటులోకి రాబోతోంది. ఈ మేరకు ఆ దేశ ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. గర్భం దాల్చిన ప్రారంభ‌ రోజుల్లోనే గ‌ర్భ‌విచ్ఛిత్తి కోసం అబార్ష‌న్ పిల్ ఉప‌యోగిస్తారు. అయితే .. జ‌పాన్‌లో అబార్ష‌న్ పిల్స్‌పై నిషేధం అమ‌ల్లో ఉంది. మ‌హిళ‌లు వారి 22 వారాల గర్భాన్ని తొలగించుకోవడం ఆ దేశంలో చట్టబద్ధమే. అయితే, అందుకు భాగస్వామి లేదా పార్ట్‌నర్ అంగీకారం తప్పనిసరి. అయితే.. అబార్ష‌న్ పిల్స్ ఉప‌యోగించ‌డానికి అనుమ‌తి కోరుతూ జ‌పాన్ మ‌హిళ‌లు పోరాటం చేశారు. మ‌హిళ‌ల పోరాటానికి జ‌పాన్ ప్ర‌భుత్వం త‌ల‌వంచింది. వారి డిమాండ్‌ను అమ‌లు చేయ‌డానికి ముందుకొచ్చింది. దీంతో .. జ‌పాన్ మ‌హిళ‌ల పోరాటం విజ‌య‌వంత‌మైంది.

బ్రిటిష్ కంపెనీ లైన్‌ఫార్మా తయారుచేసే అబార్షన్‌ పిల్‌కు జపాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆమోద ముద్ర వేసింది. ఈ డ్రగ్‌కు ఆమోదం కోరుతూ డిసెంబరు 2021లో ప్రభుత్వానికి లైన్‌ఫార్మా నివేదించింది. ఇది మిఫెప్రిస్టోన్, మిసోప్రొస్టోల్‌తో కూడిన రెండు దశల చికిత్సను అందిస్తుంది. అబార్షన్ పిల్‌కు ఆమోదం తెలిపిన తొలి దేశంగా ఫ్రాన్స్ రికార్డులకెక్కింది. అది 1988లోనే జ‌పాన్ అబార్ష‌న్ పిల్‌ను ఆమోదించింది. 2000వ సంవత్సరం నుంచి అమెరికాలో మ‌హిళ‌ల‌కు ఈ డ్రగ్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు జ‌పాన్ మ‌హిళ‌ల‌కు సైతం ఈపిల్ అందుబాటులోకి రావ‌డంతో వారు హ‌ర్షం ప్ర‌క‌టించారు.
స్థానిక ఎన్నిక‌ల్లో సైతం జ‌పాన్ మ‌హిళ‌లు ఘ‌న విజ‌యం సాధించి కొత్త రికార్డు నెల‌కొల్పారు. పురుషాధిక్య‌త ఎక్కువ‌గా ఉన్న జ‌పాన్ రాజ‌కీయ రంగంలో మొద‌టిసారి మ‌హిళ‌లు రికార్డు స్థాయిలో విజ‌యాల‌ను న‌మోదు చేశారు. సిటీ అసెంబ్లీల‌కు ఎన్నికైన వారిలో 21 శాతం మ‌హిళ‌లు కావ‌డం కొత్త రికార్డును సృష్టించింది.
జ‌పాన్ అధికార పార్టీ లిబ‌ర‌ల్ డెమోక్ర‌టిక్ పార్టీలో కేవ‌లం 10 శాతం మాత్ర‌మే సిటీ లెవ‌ల్ ఎల‌క్ష‌న్స్‌లోప్ర‌తినిధ్యం వ‌హిస్తున్నారు. జ‌పాన్‌లో ఇప్ప‌టికీ మ‌హిళా ప్ర‌జాప్ర‌తినిధుల సంఖ్య చాలా త‌క్కువ‌గా ఉంది. జీ-7 దేశాల్లోని ఏడు స‌భ్య‌దేశాల్లో అతిత‌క్కువ మ‌హిళా పార్ల‌మెంటేరియ‌న్ల సంఖ్య ఉన్న దేశం జ‌పాన్ మాత్ర‌మే కావ‌డం గ‌మ‌నార్హం.
సిటీ అసెంబ్లీ ఎన్నిక‌లు దేశంలో రాబోవు గ‌ణ‌నీయ‌మైన రాజ‌కీయ‌ మార్పుల‌కు సంకేత‌మ‌ని ఆ దేశ మ‌హిళ‌లు అభిప్రాయ ప‌డుతున్నారు. టోక్యోలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌ల‌భై ఏళ్ల లోపు మ‌హిళ‌లు ఒక్క‌రు కూడా వార్డు మెంబ‌ర్‌గా విజ‌యం సాధించ‌ లేదు. అయితే మొద‌టిసారి 30 సంవ‌త్స‌రాల మిజ్యుకి ఓనో టోక్యో వార్డు మెంబ‌ర్‌గా గెలుపొందారు. 30 ఏళ్ల లోపు మ‌హిళ‌లు న‌లుగురు వార్డు స‌భ్యులుగా ఎన్నిక‌య్యారు.
ఏప్రిల్‌లో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో మ‌హిళ‌లు సాధించిన విజ‌యం ఎంద‌రో మ‌హిళ‌ల‌కు స్ఫూర్తిగా నిలుస్తుంద‌ని ఎన్నికైన మ‌హిళా ప్ర‌జాప్ర‌తినిధులు అంటున్నారు.
ఏప్రిల్ 23 న జ‌రిగిన సిటీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో దేశ‌వ్యాప్తంగా 1,457 మ‌హిళ‌లు ఎన్నిక‌య్యారు. ఎన్నికైన ప్ర‌జాప్ర‌తినిధుల్లో 20శాతం మంది మ‌హిళ‌లు జ‌పాన్ చ‌రిత్ర‌లో మొద‌టిసారి ఎన్నిక‌య్యారు. దీంతో జ‌పాన్ మ‌హిళా శ‌క్తికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News