అతివల బెస్ట్ సెంట్స్ ఇవి…
మన వ్యక్తిత్వాన్ని పరిమళించేవే పర్ఫ్యూమ్స్. అలాగే నలుగురిలో ఆడవాళ్లను ప్రత్యేకంగా నిలిపేవి కూడా వాళ్లు వాడే పరిమళాలే…అదేనండి సెంట్లే. అందులో ఆధునిక మహిళలకు నప్పే బెస్ట్ పెర్ఫ్యూమ్స్ కొన్ని ఉన్నాయి. ఇవి స్త్రీలకు ఉండే ప్రత్యేక అవసరాలను తీరుస్తాయి కూడా. సెంట్ల వాడకంలో వ్యక్తిగత ప్రాధాన్యతలు కీలకంగా వ్యవహరిస్తాయి. ఎవరైనా సరే తమకు నచ్చిన వాసనలకు తగ్గ పెర్ఫ్యూములను ఎంపిక చేసుకోవాలి. అలా స్త్రీలకు బెస్ట్ అని చెప్పే సెంట్లు కొన్ని ఉన్నాయి. సి యు డె పర్ఫ్యూమ్ వాటిల్లో ఒకటి. ఇది ఫ్లోరల్ సెంట్. బలమైన వ్యక్తిత్వంతో పాటు స్త్రీత్వం తొణికిసలాడే ఆధునిక మహిళలకు నప్పే సెంట్ ఇదిట. ఇందులో ఆధునిత్వపు పరిమళంతో పాటు ఛారిస్మాటిక్ ఫ్రాగ్రెన్స్ ఉంటుందిట. ఇందులోంచి వచ్చే ఫ్లోరల్ స్వీట్ నెస్ ఎంతో ఆకర్షణీయంగా, అందరినీ కట్టిపడేసేలా ఉంటుంది. ఆధునిక మహిళలకు సరిగ్గా సరిపోయే ఈ సెంటును రోజూ వేసుకోవచ్చుట కూడా. ఇంకొకటి లా వై ఎస్ట్ బెల్లె ఫ్రాగ్రెన్స్. దీని సువాసన ఎదుటివాళ్లను కట్టిపడేసేలా ఉంటుందిట. ఈ ఫ్లోరల్ పెర్ఫ్యూమ్ అరేబియన్ జాస్మిన్ సువాసనలను చిందిస్తుంది.
తమ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఆడవాళ్లకు నప్పే ఫ్రాగ్రెన్స్ ఇదిట. దీన్నికూడా ఆడవాళ్లు నిత్యం వాడొచ్చుట. బ్లాక్ ఓపియం అతివలకు నప్పే మరో మంచి పెర్ఫ్యూమ్. తీయనైన ఫ్లోరల్ స్మెల్ తో
ఇది అందరినీ ముగ్ధులను చేస్తుంది. యువతలను స‘మ్మోహితు’లను చేసే సెంట్ కూడా ఇది. ఇది డేట్ నైట్ కు సరిపోయే పెర్ఫ్యూమ్. ఈ ఫ్లోరల్ పెర్ఫ్యూమ్ ఖరీదు కూడా అందరికీ అందుబాటులోనే ఉంటుంది.
ఇంకొకటి డైసీ. ఇది ఫ్రూటీ ఫ్లోరల్ పర్ఫ్యూమ్. ఎంతో ఆధునికమైంది. మరింతగా ఆకట్టుకునేది. ఛాన్సే సెంట్ కూడా అలాంటిదే. ఇది తాజా ఫ్రూటీ ఫ్లోరల్ సువాసనలను చిందిస్తుంది. స్త్రీలను ఉత్తేజితులుగా
ఉంచుతుంది. మహిళలు ఈ సెంట్ ను నిత్యం వాడొచ్చు. క్లోయ్ సిగ్నేచర్ సెంట్ మరొకటి. ఇది స్త్రీల యాక్టివ్ వ్యక్తిత్వాన్ని మరింతగా పరిమళింపచేస్తుందిట. ఎంతో తాజా సువాసనలను చిందిస్తుంది. గుస్సీ
బ్లూ పెర్ఫ్యూమ్ తాజా ఫ్లోరల్ గ్రీన్ వాసనలను వెదజల్లుతుంది. ఇది డేట్ నైట్ లో బాగుంటుంది. అలాగే ముఖ్యమైన సమావేశాలకు వెళ్లేటప్పుడు కూడా దీన్ని వాడొచ్చు.
స్త్రీలకు నప్పే మరో సెంట్ మిస్ డియోర్. ఇది వార్మ్ ఫ్లోరల్ సెంట్. స్త్రీలకు బాగా నప్పే పెర్ప్యూమ్.
దీన్ని స్ప్రే చేసుకున్న స్త్రీలు తమ చుట్టూ ఉన్నవారిని సమ్మోహితులను చేస్తారు. దీన్నిరోజూ వాడొచ్చు. దీని సువాసనలు చాలా సమయమే మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉంటాయి. ఎంతో ఆధునాతనమైంది కూడా. మీ మనసుకు, శరీరానికి వెచ్చటి అనుభూతిని ఈ ఫెర్ఫ్యూమ్ పంచుతుంది. ఉడ్ సేజ్ అండ్ సీ సాల్ట్ స్త్రీలకు నప్పే మరొక బెస్ట్ పెర్ఫ్యూమ్. ఎర్తీ అండ్ వుడీ సువాసనలు చిందించే ఈ సెంట్ మీ వ్యక్తిత్వాన్ని ప్రతిఫలించేలా ఉంటుంది.. కానీ ఖరీదు ఎక్కువే. లైట్ బ్లూ టాయిలెట్టే డోల్కా గబ్బనా స్త్రీలకు నప్పే మరో సెంట్. ఇది ఫ్రెష్ అండ్ ఫ్రూటీ పెర్ప్యూమ్. మంచి రంగుతో, తాజాదనంతో, ఫ్లోరల్ ఫ్రూటీ వాసనలతో మైమరపిస్తుంది. అంతేకాదు మెడిటరేనియన్ లైఫ్ స్టైల్ లోని సెన్సువాలిటీని ఇది పరిమళిస్తుంది. పైగా ఇది అత్యంత ఆధునికమైనది. స్త్రీత్వ సుగంధాలను ఎంతగానో పరిమళించేది కూడా.
ఇవి తెలిస్తే సెంట్స్ ఎంపిక సులభం..
పెర్ఫ్యూమ్స్ కొనుక్కునే వారు సెంట్స్ కు సంబంధించి కొన్ని ప్రాథమిక విషయాలలో అవగాహనతో ఉండాలి. సెంట్స్ తేలిక పాటి సువాసనలతో, గాఢ సువాసలతో, తక్కువ సమయం మాత్రమే ఉండే సువాసనలతో ఇలా రకరకాల టైప్స్ లో ఉంటాయి. సెంటును ఎంపిక చేసుకునేటప్పుడు ఎలాంటి పదార్థాలు వాటిల్లో ఉండాలని మీరు కోరుకుంటున్నారో దాని గురించిన అవగాహన అత్యావశ్యకం.
అప్పుడు మీకు కావలసిన పర్ప్యూమ్ ను సులభంగా ఎంపిక చేసుకోగలరు. పెర్ఫ్యూమ్స్ లో టాప్ నోట్స్ కిందకు వచ్చే సెంట్లు కొన్ని ఉంటాయి. అవి లైట్ సెంట్స్. వీటి సువాసనలు శరీరంపై కొద్దిసేపు
మాత్రమే ఉండి తర్వాత ఆవిరైపోతాయి. ఉదాహరణకు టాప్ నోట్స్ లో ఆరంజ్, పియర్, గ్రేప్, యాపిల్స్ వంటివి వస్తాయి. ఇది కాకుండా మిడల్ నోట్స్ అని కూడా సెంట్లల్లో ఉంటాయి. ఈ రకమైన సెంట్లు
టాప్ నోట్స్ కన్నా కాస్త పవర్ఫుల్ గా ఉంటాయి. అంతేకాదు టాప్ నోట్స్ సెంట్స్ కన్నా కాస్త ఎక్కువ సేపు శరీరాన్ని అంటిపెట్టుకుని ఉంటాయి. వీటిని టాప్ నోట్స్ తో బ్లెండ్ చేసి ఫ్రాగ్రెన్స్ ఇస్తారు. మిడిల్ నోట్స్ కింద వచ్చే సెంట్ల లో దాల్చినచెక్క, జాస్మిన్, వయొలెట్, రోజ్ వంటివి ఉంటాయి ఫ్రాగ్రెన్స్ లో చివరిది బేస్ నోట్స్. శాండల్ వుడ్, వెనిల్లా, సెడార్ వంటి ఫ్రాగ్రెన్సులు దీని కేటగిరిలోకి వస్తాయి.