Thursday, November 21, 2024
Homeఫీచర్స్Dirty smell: ఇంట్లో బ్యాడ్ స్మెల్ వస్తుందా?

Dirty smell: ఇంట్లో బ్యాడ్ స్మెల్ వస్తుందా?

రూమ్ ఫ్రెష్నర్స్ వాడితే దీర్ఘకాలంలో మీకు శ్వాస సమస్యలు వస్తాయి

ఇంట్లోని దుర్వాసనలు ఇలా పోగొట్టుకోవచ్చు…

- Advertisement -

ఇంట్లో కాలుపెట్టగానే సువాసనలు మిమ్మల్ని చుట్టుముడితే ఎంతో ఆహ్లాదంగా ఫీలవుతారు. దీంతో మనసు ప్రశాంతమవడమే కాదు మీ మూడ్ కూడా మారుతుంది. ఎంతో ఉషారుగా అవుతారు. అలా మీ ఇంటిని సువాసనలు చిందించేలా చేసే కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేమిటంటే…

 ఇంట్లోని మీ ఎసి ఫిల్టర్ కి రసాయనాలు లేని ఎయిర్ ఫ్రెష్ నర్ అయిన ఎసెన్షియల్ ఆయిల్ ని ఉపయోగిస్తే తో ఇల్లంతా మంచి సువాసనలతో నిండుతుంది.

 కార్ ఫ్రెష్నర్ ని ఎసి దగ్గర పెడితే ఇల్లంతా మంచి సువాసనలు వ్యాపిస్తాయి. దాన్ని గదిలో పెడితే మరింత సువాసనలు చిందిస్తాయి.

 స్ట్రాంగ్ టీ మీ ఇంటిని సువాసనలతో నింపుతుంది. ఎలా అంటారా? మీరు చేయాల్సిందల్లా రకరకాల టీ బ్యాగ్స్ ను తీసుకుని వేడి నీళ్లల్లో వేసి తక్కువ హీట్ లో ఉంచాలి (సిట్రస్ తొక్కలు కూడా ఇందులో వేయొచ్చు). దీనివల్ల ఇల్లంతా సువాసనలతో నిండడమే కాకుండా ఆ వాసనలు మిమ్మల్ని ఎంతో ఉత్తేజపరుస్తాయి.

 క్యాండిల్ వాక్స్ బర్నర్ కూడా గదిని సువాసనలతో నింపుతుంది. ట్రెడిషనల్ క్యాండిల్ వాక్స్ బర్నర్ తో గదిలో గాలి శుభ్రం అవుతుంది. గది అంతా మంచి సువాసనలతో నిండుతుంది.

 రూమ్ ఎయిర్ ఫ్రెష్నర్స్ గా సహజమైన పదార్థాలను, ఎసెన్షియల్ ఆయిల్స్ ను కలిపి వాడొచ్చు.

 ఇంట్లోని దుర్వాసన పోగొట్డడంలో క్రాక్ పాట్ బాగా పనిచేస్తుంది. ఇందులో కొద్దిగా నీళ్లు, కాస్త బేకింగ్ సోడా వేసి సన్నని సెగపై వేడి చేయాలి.

 వంటింట్లోని దాల్చినచెక్క, రకరకాల వన మూలికలు, కమలాపండు తొక్కలు వంటి వాటన్నింటినీ కలిపి ఒక సాస్ ప్యాన్ లో వేసి సన్నటి సెగన ఉడికించాలి. ఇలా చేస్తే ఇంటి నిండా మంచి సువాసనలు వ్యాపిస్తాయి.

 వెనీలా కాఫీ సెంట్ గింజలుండే జార్ లో టీ లైట్ క్యాండిల్స్ ని పెట్టాలి. ఇలా చేయడం వల్ల గాలిలో ఉండే దుర్వాసన పోవడమే కాదు ఇల్లంతా మంచి సువాసనలతో నిండుతుంది.

 ఎసెన్షియల్ ఆయిల్ తో చేసిన కార్పెట్ డియొడరైజర్ గురించి వినే ఉంటారు. ఇది కార్పొట్ నుంచి వచ్చే దుర్వాసనను పోగొడుతుంది. ఎసెన్షియల్ ఆయిల్స్ తో చేసే ఈ డియొడరైజర్ పౌడర్ ఆ వాసనలను పోగొట్టడంలో ఎంతో బాగా పనిచేస్తుంది. ఇంటిని సువాసనలతో నింపుతుంది.

 ఒవెన్ డిష్ లో కొన్ని టీస్పూన్ల వెనీలా ఎక్స్ ట్రాక్టు వేసి 300 డిగ్రీలలో బేక్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఇల్లంతా విలక్షణమైన సువాసనలతో నిండిపోతుంది.

 గదిని వెంటనే మంచి సువాసనతో నిండేలా డ్రయ్యర్ షీట్స్ చేస్తాయి. మీరు వీటిని బాక్స్ ఫ్యాన్ కు అతికిస్తే చాలు.

 వాషింగ్ మెషీన్, వాక్యూమ్ క్లీనర్ల నుంచి దుర్వాసనలు వస్తాయన్నది అందరికీ అనుభవమే. వీటిని పోగొట్టే సొల్యూషన్ ఉంది. ఇది వాటిల్లోని దుర్వాసనను పోగొడుతుంది.

 ఎసెన్షియల్ ఆయిల్ డిఫ్యూజర్స్ గదిని సువాసనలతో నింపుతాయి.

 ఇంట్లో దుర్వాసన పోవాలంటే వెనిగర్ ని నీళ్లల్లో వేస్తే చాలు.

 దుర్వాసనను పీల్చే పదార్థాలు కొన్ని ఉంటాయి. వైట్ వెనిగర్, యాసిల్ సిడార్ వెనిగర్, రైస్ వెనిగర్, సిట్రస్, బేకింగ్ సోడా, కాఫీ పొడి, చార్కోల్ వంటివి అలాంటివే.

 టాయిలెట్ పేపర్ రోల్ పై ఎసెన్షియల్ ఆయిల్స్ చుక్కలు వేస్తే టాయ్లెట్ దుర్వాసన మిమ్మల్ని బాధించదు.

 బాత్ రూముల్లో వచ్చే దుర్వాసనలను పోగొట్టే టాయ్లెట్ స్ప్రే కూడా ఉంటుంది. దీన్ని వల్ల బాత్ రూము లో నుంచి వచ్చే దుర్వాసనలు మిమ్మల్ని బాధించవు.

 తక్కువ ఖర్చుతో ఇంటిని సువాసనల మయంగా చేయాలంటే కొన్ని సహజ పద్ధతులు ఉన్నాయి. ఇంటి కిటికీలను ఎప్పుడూ తెరిచి ఉంచాలి. దీంతో తాజా గాలి ఇంట్లోకి వచ్చి ఇల్లు ఎంతో హాయిగా ఉంటుంది. అలాగే దాల్చినచెక్క, లవంగాలు, నిమ్మ, కమలాపండు తొక్కలు వంటి వాటిని నీళ్లల్లో వేసి స్టవ్ మీద సన్నని సెగపై ఉడికించడం వల్ల ఇల్లు వాటి సువాసనలతో నిండుతుంది. అలాగే బేకింగ్ సోడా వేసిన బౌల్స్ ను గదిలో, ఇంటి మొత్తంలోని కొన్ని మూలల్లో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని దుర్వాసనలను బేకింగ్ సోడా పీల్చేస్తుంది. ముందే చెప్పినట్టు ఎసెన్షియల్ ఆయిల్ డిఫ్యూజర్స్ కూడా ఇంటిని సువాసనలతో నింపుతాయి. నిమ్మ, లవండర్, సిట్రస్, లెమన్ గ్రాస్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఈ పని బాగా చేస్తాయి.

అలాగే చార్కోల్ కూడా ఇంటిలోని దుర్వాసనలను పీల్చేస్తుంది.  యాక్టివేటెడ్ చార్కోల్ బ్యాగ్స్ కూడా ఈ విషయంలో బాగా సహాయపడతాయి. ఇంట్లో వ్యాపించిన గాలిలో పరుచుకున్న దుర్వాసనలను ఇవి పోగొడతాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News