Thursday, November 21, 2024
Homeఫీచర్స్Hair styles: మెరిసేటి జుట్టుతో అదిరేటి జడలు

Hair styles: మెరిసేటి జుట్టుతో అదిరేటి జడలు

“జుట్టున్న అమ్మ ఏ కొప్పేసినా అందమే .. కానీ, జుట్టు ఉన్న వారందరికీ, అందమైన కొప్పులు వేసుకోవడం రాకపోవచ్చు. ఎందుకంటే .. అందమైన జడలు .. కొప్పులు వేయడం ఒక అద్భుతమైన కళ. ఆ విద్యలో ఆరితేరారు అనితానాయుడు. పెళ్లి .. పుట్టినరోజు . పెళ్లిరోజు .. ఓణీలు .. ఎంగేజ్‌మెంట్ … వంటి వేడుక ఏదైనా సరే, అందమైన మేకప్‌.. హెయిర్‌ స్టయిలింగ్‌లో ఆమెది అందె వేసిన చెయ్యి. అంతేకాదు ఆడపిల్లలు సొంతకాళ్లపై నిలబడాలన్న లక్ష్యంతో సుమారు 262 మందికి హెయిర్‌ స్టయిలింగ్‌లో శిక్షణనిచ్చారు. .. మహిళలు సొంత కాళ్లపై నిలబడి .. ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజంలో సమానత్వం లభిస్తుందని, ఆడపిల్లలు వారికంటూ కచ్చితంగా ఒక విద్య నేర్చుకోవాలని అనితా నాయుడు అంటున్నారు”.

- Advertisement -

సుమారు పదిహేడు సంవత్సరాలుగా హెయిర్ స్టయిల్ .. బ్యుటీషియన్‌ .. టీచింగ్‌ రంగంలో రాణిస్తున్నారు అనితానాయుడు. మేకప్‌, హెయిర్‌స్టయిలింగ్‌పై ఆరో తరగతిలోనే అనితానాయుడు ఆసక్తి పెంచుకున్నారు. అందుకే చదువు కంటే బ్యూటీ కోర్సులపై దృష్టి పెట్టారు. బెంగళూరు లోని సర్‌ బ్యూటీసెలూన్‌, హైదరాబాద్‌ అనూస్‌లో బ్యుటీషియన్‌, హెయిర్‌ స్టయిల్స్‌ కోర్సుల్లో ఆమె శిక్షణ తీసుకున్నారు. కొద్దిరోజుల పాటు పలు బ్యూటీపార్లర్లలో అనితానాయుడు పనిచేశారు. అయితే .. హెయిర్‌ స్టయిలింగ్‌లో ఆమె ప్రతిభను గమనించిన కస్టమర్ల ప్రోత్సాహించడంతో, హైదరాబాద్‌లో సొంతంగా హనీ ప్రొఫెషనల్ బ్యూటీ సెలూన్‌ను ఆమె ప్రారంభించారు. సినిమా యాక్టర్లు, సీరియల్ ఆర్టిస్టులు .. మోడల్స్‌కు మేకప్, హెయిర్‌ స్టయిలింగ్ చేసిన ఆమె వేలాది డాన్స్‌షోలు.. రియాల్టీ షోలకు హెయిర్‌ స్టయిలిస్ట్‌గా కూడా పనిచేశారు. మరోపక్క బ్యూటీకోర్సులపై యువతకులకు శిక్షణ నిస్తున్నారు. ప్రొఫెషనల్ బ్యుటీషియన్‌ ట్రైనింగ్‌ కోర్స్‌, బ్రైడల్ మేకప్‌ హెయిర్‌ స్టయిల్స్‌, శారీ డ్రాపింగ్‌, మెహందీ కోర్స్‌, హెయిర్‌ డ్రెస్సర్‌ కోర్సుల్లో అనిత శిక్షణనిస్తున్నారు. కోర్సును బట్టి ట్రైనింగ్ ఒక నెల రోజుల నుండి ఆరు నెలల వరకు ఉంటుందని ఆమె తెలిపారు. కోర్సు ఫీజు రూ. 10,000 నుండి రూ.50,000లు ఉంటుందని అన్నారు. వృత్తిపరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని అందుకే, ఆడపిల్లలను వారి కాళ్లపై ఉండేలా ప్రోత్సహిస్తున్నట్లు అనితానాయుడు చెప్పారు. తక్కువ ఫీజుతో యువతులకు బ్యుటీషియన్ ట్రైనింగ్ ఇస్తున్నట్లు ఆమె వెల్లడించారు. సుమారు 262 మంది తన వవద్ద బ్యూటీకోర్సుల్లో శిక్షణ పొందారని వెల్లడించారు. తన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వారు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నారని .. వారందరూ సొంతంగా బ్యూటీపార్లర్లు నడుపుతూ ప్రొఫెషనల్‌గా స్థిర పడటం తనకెంతో గర్వంగా ఉందని ఆమె అన్నారు.
అనితానాయుడు
7993923948
హనీ ప్రొఫెసనల్‌ బ్యూటీ సెలూన్‌
ఎన్‌ఆర్‌ఆర్‌పురం, బోరుబండ-హైదరాబాద్‌.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News