Tuesday, April 8, 2025
Homeఫీచర్స్Coconut: కొబ్బరికాయలో నీళ్లు ఉన్నాయా లేదా.. చూసి ఇలా చెప్పేయండి

Coconut: కొబ్బరికాయలో నీళ్లు ఉన్నాయా లేదా.. చూసి ఇలా చెప్పేయండి

వేసవిలో కొబ్బరి నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. అనేక పోషకాలు అందిస్తుంది. కానీ, కొబ్బరికాయలను కొనుగోలు చేసే సమయంలో అసలు కొబ్బరికాయను ఎలా గుర్తించాలో తెలియక చాలా మంది తప్పులు చేస్తారు. సరైన కొబ్బరికాయను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

- Advertisement -

నీటి శబ్దం పరిక్ష: కొబ్బరికాయను చెవికి దగ్గరగా ఉంచి, నెమ్మదిగా ఊపండి. లోపల నుంచి నీటి శబ్దం వస్తే, అందులో ఎక్కువ నీరు ఉన్నట్లు అర్థం. శబ్దం వినిపించకపోతే, కొబ్బరికాయ ఎండిపోయింది.

బరువు పరీక్ష: ఎక్కువ మలై (కొబ్బరి గుజ్జు) ఉన్న కొబ్బరికాయను కొనాలనుకుంటే, బరువైన కొబ్బరికాయను ఎంచుకోండి. తేలికగా ఉన్న కొబ్బరికాయలో ఎక్కువ నీరు ఉంటే, బరువైనది ఎక్కువ మలై (కొబ్బరి గుజ్జు) కలిగి ఉంటుంది.

గుండ్రటి గుర్తులు: కొబ్బరికాయ పై మూడు గుండ్రటి కళ్ళు ఉంటాయి. ఇవి మృదువుగా, తేలికగా ఉంటే, అందులో ఎక్కువ నీరు ఉంటుంది. కఠినంగా, లోతుగా ఉన్న కళ్ళు ఉంటే, అది పాత కొబ్బరికాయ.

పరిస్థితి: కొబ్బరికాయ ఉపరితలం ఆకుపచ్చగా, మెరిసేలా ఉంటే, అది తాజా కొబ్బరికాయ. గోధుమ రంగులో కఠినంగా ఉన్నది పాతది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News