Thursday, September 19, 2024
Homeఫీచర్స్Kitchen tips: వంటింటి చిట్కాలు

Kitchen tips: వంటింటి చిట్కాలు

 వంటిట్లో గ్యాసు గట్టు, గోడలపై నూనె, వంట పదార్థాల మొండి మరకలు ఉంటాయి. అవి పోవాలంటే వెనిగర్, వంటసోడాలను సమాన పరిమాణంలో తీసుకుని వాటిని బాగా కలిపి ఆ మిశ్రమంతో గోడలపై రుద్ది పది నిమిషాల తర్వాత కడిగితే ఆ మరకలు పోతాయి.

- Advertisement -

 చేపలకు శెనగపిండి పట్టించి ఐదు నిమిషాలు తర్వాత శుభ్రం చేస్తే నీచు వాసన సులువుగా పోతుంది.

 బొంబాయి రవ్వతో ఉప్మా చేసేటప్పుడు ఉండకట్టకుండా ఉండేందుకు నూకలో చెంచా నూనె వేయాలి.

 తేనె సీసాలో నాలుగైదు మిరియాలు వేస్తే చీమలు చేరవు.

 కత్తికి ఉప్పు రాయడం వల్ల పదును ఎక్కుతుంది.

 బ్రెడ్ ప్యాకెట్ లో బంగాళాదుంప ముక్కలు వేస్తే తొందరగా పాడవవు.

 అగరవత్తుల నుసితో ఇత్తడి సామాను తోమితే బాగా శుభ్రమవుతాయి.

 బియ్యం నిల్వ చేసిన డబ్బాలో గుప్పెడు పుదీనా ఆకులు వేస్తే పురుగు పట్టదు.

 పచ్చిబటానీలను ఉడికించేటప్పుడు వాటిల్లో చిటికెడు పంచదార వేస్తే రంగు మారకుండా ఉంటాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News