సూర్యుడు హైడ్రోజన్, హీలియంతో రూపొందిన భారీ నక్షత్రం. సుమారు 4.5 బిలియన్ సంవత్సరాలుగా మన సౌర వ్యవస్థకు కేంద్రంగా ఉంది. సౌర వ్యవస్థలో కేంద్ర నక్షత్రంగా భూమిపై జీవానికి కాంతి, వెచ్చదనం, శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది సూర్యుడు. అయితే సూర్యుడికి అంతం ఉంటుందా.. ఎంతకాలం కొనసాగుతుంది. సూర్యుడు, భూమికి ఎప్పుడు అంతం.. వంటి సందేహాలు చాలా మందికి వస్తుంటాయి. ఇటీవల నాసా శాస్త్రవేత్తలు సూర్యుడి గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. ఇందులో సూర్యుడి అంతం గురించి కూడా వివరించారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, సూర్యుడి జీవితకాలం దాదాపు సగం దాటింది. సూర్యుడు తన జీవిత చక్రం ముగిసేలోపు అంటే.. మరో ఐదు బిలియన్ సంవత్సరాల వరకు మండుతూనే ఉంటాడని అంచనా వేస్తున్నారు. ఇతర నక్షత్రాల మాదిరిగానే, సూర్యుడి శక్తి కూడా చివరికి నశిస్తుందంట.. ఇది జరిగినప్పుడు కొన్ని అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.
సూర్యుడు బాగా విస్తరిస్తాడు, శాస్త్రవేత్తలు ఈ దశను రెడ్ జెయింట్ గా పేర్కొంటున్నారు. ఈ దశలో చాలా పెద్దదిగా పెరుగుతాడు. దీంతో భూమి సమీపంలోని బుధుడు, శుక్రడు గ్రహాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉందంట. ఈ పరిస్థితులు మానవజాతికి ఆధారంగా ఉన్న భూ గ్రహం అంతానికి దారి తీస్తాయంట. రెడ్ జెయింట్ దశ తర్వాత, సూర్యుడు దాని బయటి పొరలను కోల్పోతాడు. చివరికి ప్లానెటరీ నెబ్యులా ఏర్పడుతుంది. ప్లానెటరీ నెబ్యులా అంటే అంతరించిపోతున్న నక్షత్రం చుట్టూ ఏర్పడే వాయువు మేఘం. సూర్యుడు తన బయటి పొరలను కోల్పోయినప్పుడు, ఈ కలర్‌ఫుల్ క్లౌడ్‌ని సృష్టిస్తుంది.
నెబ్యులాలోని వాయువు ప్రకాశవంతంగా మెరుస్తుంది. ఇది సూర్యుడిలో మిగిలిన కోర్ నుంచి ఎనర్జీ పొందుతుంది. ప్లానెటరీగా పేర్కొన్నప్పటికీ, ఈ నెబ్యులాకు గ్రహాలతో ఎటువంటి సంబంధం లేదు. కాలక్రమేణా, సెంట్రల్ స్టార్ మసకబారుతుంది. నెబ్యులా అంతరిక్షంలో భాగమైపోతుంది. ఓ అధ్యయనం ప్రకారం, సూర్యుడి వల్ల భూమి అంతం జరుగుతుందని తెలిపింది. దాదాపు 100 కోట్ల (బిలియన్ ఇయర్స్) తర్వాత ఈ విపత్తు సంభవిస్తుందంట. సూర్యుడి నుంచి వచ్చే రేడియేషన్ పెరుగుతుంది. ఈ ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగి, భూమిపై మొత్తం ఆవిరైపోతాయి. శ్వాస తీసుకోవడానికి ఆక్సిజన్ ఉండదు. సూర్యుడి నుంచి వచ్చే వేడి, రేడియేషన్ ఇతర గ్రహాలను ఆవిరి చేస్తుంది.