Thursday, May 1, 2025
Homeఫీచర్స్Chips : పొటాటో చిప్స్ పై గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా.. కారణం ఇదే..!

Chips : పొటాటో చిప్స్ పై గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా.. కారణం ఇదే..!

చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకూ.. అందరూ పొటాటో చిప్స్ ను ఎంతో ఇష్టపడతారు. దీని చరిత్ర ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. పొటాటో చిప్స్‌ను 1853లో న్యూయార్క్ రాష్ట్రంలోని సరటోగా స్ప్రింగ్స్‌లో కనుగొన్నారు. అప్పుడు ప్రముఖ చెఫ్ జార్జ్ క్రమ్ సరటోగా స్ప్రింగ్స్‌లోని మూన్ లేక్ లాడ్జ్ అనే రెస్టారెంట్‌లో పనిచేస్తుండేవారంట. ఆ సమయంలో ఒక కస్టమర్ ఫ్రెంచ్ ఫ్రైస్‌ను ఆర్డర్ చేయగా, అవి చాలా మందపాటిగా రావడంతో.. హోటల్ నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు.

- Advertisement -

దీంతో చెఫ్ జార్జ్ క్రమ్ చిరాకు చెంది.. బంగాళాదుంపలను బాగా పలుచగా కోసి, కరకరలాడేలా గట్టిగా వేయించి.. ఉప్పు చల్లి సర్వ్ చేశారంట. అయితే ఆశ్చర్యంగా ఆ కస్టమర్ చిప్స్‌ను ఎంతో ఇష్టపడ్డాడు.. ఆ తర్వాత అవి చిప్స్ గా ప్రాచుర్యం పొందాయి.. వీటిని సరటోగా పిలిచేవారంట. ఇక 1920 సంవత్సరంలో హెర్మన్ లే (Herman Lay) అనే వ్యాపారి.. తన సొంత కంపెనీ ద్వారా చిప్స్ అమ్మకాన్ని ప్రారంభించాడు.. ఆ తర్వాత ఆ కంపెనీ లేస్ (Lay’s) గా మారింది. ప్రస్తుతం ఈ సంస్థ ప్రపంచంలో ప్రముఖ బ్రాండ్లలో ఒకటిగా ఉన్న విషయం తెలిసిందే.

పేరు గల వ్యాపారి, తన సొంత కంపెనీ ద్వారా చిప్స్‌ను అమ్మడం ప్రారంభించాడు. తరువాత, అతని కంపెనీ “లే’స్” (Lay’s) గా మారింది, ఇది ఇప్పటికీ ప్రపంచంలో ప్రముఖ బ్రాండ్లలో ఒకటి.

ఇక ప్రస్తుతం పొటాటో చిప్స్ అనేక రకాల రుచుల్లో, సీజనింగ్స్‌తో అందుబాటులో ఉన్నాయి. ప్రాథమిక ఉప్పు రుచి నుండి, స్పైసీ, సవారీ, బార్‌బిక్యూ, మసాలా లాంటి వెరైటీలు వచ్చాయి. సాధారణంగా మనం బయట కొనుగోలు చేసే ప్యాకెడ్‌ చిప్స్ పై జిగ్‌జాగ్ డిజైన్‌లతో కూడిన లైన్లు కనిపిస్తాయి. చిప్స్‌పై ఉండే ఈ లైన్‌లను చాలా మంది డిజైన్‌గా భావిస్తారు. కానీ నిజానికి చిప్స్ ఇలా ఉండటానికి పెద్ద రహస్యమే ఉందంట.

నిజానికి ఈ గీతలు లేదా లైన్లు చిప్స్ రుచికి సంబంధించింది. ప్యాకెట్ చిప్స్ లో మాత్రమే ఈ గీతలు కనిపిస్తాయి. చిప్స్‌పై మసాలాలు అంటుకునే విధంగా వీటిని డిజైన్ చేశారు. ఈ లైన్ల కారణంగానే ప్యాకెట్ చిప్స్ రుచిగా ఉంటాయి. ఇలా జిగ్ జాగ్ చేయడం వల్ల అందులో మసాలా కూడా బాగా ఒదిగిపోతుంది. దీంతో ఆ చిప్స్ కి రుచి పెరుగుతుంది. అందుకే ప్యాకెట్ లో చిప్స్ మొత్తం ఒకే రుచిలో ఉంటాయి. ఒకవేళ ఎలాంటి గీతలు లేకపోతే మసాలా అనేది చిప్స్ కి సరిగా అంటుకోదు. దీనివల్ల అవి ఒకొక్క దగ్గర చప్పగా అనిపిస్తాయి. మరో దగ్గర కాస్త రుచిగా అనిపిస్తాయి.. మొత్తంగా రుచి అసలు బాగోదు.

అంతేకాదు ఇలా చిప్స్ పై జిగ్ జాగ్ డిజైన్ ఉండటం వలన అవి త్వరగా విరిగిపోవని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలా రకాల కంపెనీలు మన దేశంలో పెద్ద ఎత్తున పొటాటో చిప్స్ విక్రయిస్తున్నాయి.. వీటిలో చాలా వరకు ఇలా జిగ్ జాగ్ గీతలతోనే ఉంటున్నాయి. ఒక్కో కంపెనీ నాలుగైదు వెరైటీల రుచులను అందిస్తున్నాయి. వీటిని చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్లు కూడా ఇష్టంగా తింటుంటారు. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది.. దీనిని తెలుగుప్రభ ధృవీకరించడం లేదు.)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News