Wednesday, February 18, 2026
HomeTop StoriesSBI Jobs 2026: డిగ్రీ అర్హతతో ఆఫీసర్ కొలువులు.. పూర్తి వివరాలు ఇవే!

SBI Jobs 2026: డిగ్రీ అర్హతతో ఆఫీసర్ కొలువులు.. పూర్తి వివరాలు ఇవే!

Bank Jobs 2026 : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిరుద్యోగులకు , బ్యాంకింగ్ రంగంలో అనుభవం ఉన్న నిపుణులకు అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల భర్తీ కోసం ఎస్‌బీఐ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు నేరుగా ఆఫీసర్ కేడర్‌లో విధుల్లో చేరే అవకాశం ఉంటుంది.

- Advertisement -
భారీగా ఖాళీలు – సర్కిళ్ల వారీగా భర్తీ

ఎస్‌బీఐ ఈసారి మొత్తం 2,273 పోస్టులను భర్తీ చేస్తోంది. ఇందులో రెగ్యులర్ ఖాళీలు 2,200 కాగా, మిగిలినవి బ్యాక్‌లాగ్ ఖాళీలు. అభ్యర్థులు తమకు ఇష్టమైన ఏదైనా ఒక సర్కిల్‌కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏ సర్కిల్‌కు దరఖాస్తు చేసుకుంటారో, ఆ రాష్ట్రం స్థానిక భాష (ఉదాహరణకు తెలుగు రాష్ట్రాలకు అయితే తెలుగు) మాట్లాడటం, చదవడం , రాయడం తప్పనిసరిగా తెలిసి ఉండాలి.

Democracy : ప్రశ్నిస్తే సంకెళ్లు.. ప్రశ్నించకుంటే సన్మానాలు! మోదీ పాలనపై డా. రేఖ బోయలపల్లి నిప్పులు

అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు

  • విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా సబ్జెక్టులో డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పూర్తి చేసి ఉండాలి. మెడికల్, ఇంజనీరింగ్, చార్టర్డ్ అకౌంటెంట్ వంటి వృత్తి విద్యా కోర్సులు చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • పని అనుభవం: దరఖాస్తు చేసుకునే నాటికి ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లేదా రీజినల్ రూరల్ బ్యాంక్ (RRB)లో ఆఫీసర్ కేడర్‌లో కనీసం రెండేళ్ల అనుభవం ఉండటం తప్పనిసరి.
  • వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ (నాన్-క్రీమీలేయర్) అభ్యర్థులకు 3 ఏళ్లు , దివ్యాంగులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం – మూడు దశలు
  • ఆన్‌లైన్ పరీక్ష: ఇందులో ఆబ్జెక్టివ్ టెస్ట్ (120 మార్కులు) , డిస్క్రిప్టివ్ టెస్ట్ (30 మార్కులు) ఉంటాయి. ఆబ్జెక్టివ్ పరీక్షలో ఇంగ్లీష్ లాంగ్వేజ్, బ్యాంకింగ్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్ , కంప్యూటర్ ఆప్టిట్యూడ్ వంటి అంశాలు ఉంటాయి.
  • స్క్రీనింగ్: రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల డాక్యుమెంట్లు , వారి పని అనుభవాన్ని ఆన్‌లైన్ ప్యానెల్ పరిశీలిస్తుంది. వారు సమర్పించిన వివరాలు నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే తదుపరి దశకు పంపుతారు.
  • ఇంటర్వ్యూ: చివరి దశలో 50 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. రాత పరీక్ష , ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా తుది మెరిట్ జాబితాను తయారు చేస్తారు.
ఆకర్షణీయమైన జీతభత్యాలు

ఎస్‌బీఐలో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్‌గా ఎంపికైన వారికి ప్రారంభ బేసిక్ పే రూ. 36,000/- ఉంటుంది. దీనితో పాటు ప్రభుత్వ నిబంధనల ప్రకారం డియర్నెస్ అలవెన్స్ (DA), హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ , మెడికల్ బెనిఫిట్స్ వంటి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. సర్కిల్ బేస్డ్ ఆఫీసర్లకు ప్రమోషన్లు కూడా వేగంగా ఉంటాయి.

దరఖాస్తు విధానం , ఫీజు

ఆసక్తి గల అభ్యర్థులు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ https://bank.sbi/careers లేదా https://www.sbi.co.in/careers సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ , ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 750/- ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ , దివ్యాంగులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

Medaram Jatara 2026: గద్దెపై కొలువుదీరిన సమ్మక్క.. మేడారంలో జనసంద్రం.!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News