సాధారణంగా పువ్వులు అందరికీ నచ్చుతాయి. ప్రకృతి మనకిచ్చిన అందమైన బహుమతి పువ్వులు. ఇవి చాలా రంగులు, సువాసనలతో పువ్వులు లభిస్తుంటాయి. వీటిని పూజలకు, అలంకరణకు ఎక్కువగా ఉపయోగిస్తారు. కొన్ని రకాల పువ్వులను చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. ప్రత్యేకంగా దేవుడి పూజల్లో విరివిగా ఉపయోగిస్తారు. దేవాలయాలలో విగ్రహాలను అలంకరించడానికి, ప్రార్థనలలో సమర్పించడానికి, దేవతల వస్త్రధారణలో వినియోగిస్తారు. మల్లె, గులాబీ, కమలం, బంతి వంటి పువ్వులకు హిందూ ఆరాధనలో ప్రత్యేక స్థానం ఉంది.
ఇదిలా ఉంటే చాలా మంది సాయంత్రం లేదా సూర్యాస్తమయం తర్వాత పువ్వులు కోయకూడదని చెబుతుంటారు. నిజానికి పువ్వులు సాయంత్రం కోయకూడదనే నమ్మకానికి కేవలం మతపరమైన కారణాలే కాకుండా, కొన్ని సైంటిఫిక్, ప్రాక్టికల్ రీజన్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మొక్కలు కూడా మనలాగే విశ్రాంతి తీసుకుంటాయి. మనకు సహజమైన దినచర్య ఉంటుందిలా, మొక్కలకూ ఉంటుంది. పగటిపూట అవి కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆక్సిజన్, శక్తి ఉత్పత్తి చేస్తాయి. సాయంత్రం అయ్యేసరికి అవి విశ్రాంతి తీసుకుంటాయి. సాయంత్రం పూలు కోయడం వల్ల వాటి సహజ విశ్రాంతికి భంగం కలుగుతుంది. మొక్కలు కూడా నిద్రపోవాలని పెద్దలు చెబుతుంటారు. శాస్త్రీయ కారణాలు చూస్తే, మొక్కలు పగటిపూట ఆక్సిజన్, రాత్రిపూట కార్బన్ డయాక్సైడ్ విడుదల చేస్తాయి. సాయంత్రం పూలు కోయడం వల్ల ఈ సహజ వాయు మార్పిడికి ఆటంకం కలుగుతుంది. ఇది మొక్క ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మనలాగే మొక్కలకూ సహజ సమతుల్యత ఉంటుందని గుర్తుంచుకోవాలి.
హిందూ మతం ప్రకారం, దేవుళ్లు పూలలో ఉంటారని నమ్ముతారు. ఉదాహరణకు లక్ష్మీదేవి కమలంలో ఉంటారు, కాళీమాతకు మందార పువ్వు ఇష్టం. బంతి పువ్వును చాలా మంది దేవతలకు సమర్పిస్తారు. సాయంత్రం కోయడం వల్ల పూలలోని దైవిక శక్తికి ఆటంకం కలుగుతుందని భావిస్తారు. అందుకే సాయంత్రం పూలు కోయకూడదని అంటారు. రాత్రిపూట వికసించే పువ్వులు కీటకాలను ఆకర్షిస్తాయి. ఈ కీటకాలు చీకటిలో దాక్కొనవచ్చు. సాయంత్రం పూలు కోయడం వల్ల కీటకాలు మిమ్మల్ని కరవచ్చు లేదా కుట్టవచ్చు. కాబట్టి సాయంత్రం పువ్వులు కోసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
పువ్వులు మొక్కల మనుగడకు అవసరం. అవి విత్తనాలను ఉత్పత్తి చేసి కొత్త మొక్కలను పెంచుతాయి. పూలను కోసినప్పుడు విత్తనాల ఉత్పత్తి తగ్గుతుంది. తరచుగా పూలు కోయడం వల్ల మొక్క బలహీనపడి భవిష్యత్తులో పువ్వులు పూయడం ఆగిపోవచ్చు. కాబట్టి పువ్వులు కోసే ముందు మొక్కల గురించి తెలుసుకోవడం మంచిది. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించడం లేదు.)