కాసేపట్లో ఆకాశంలో అద్భుతం జరగనుంది. ఒకే లైన్ లో ఏడు గ్రహాలు కనిపించనున్నాయి. వీటిలో మన సౌరకుటుంబంలోని ఐదు గ్రహాలను నేరుగా మనం కంటితోనే చూడొచ్చు. శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని గ్రహాలను ఎటువంటి ప్రత్యేక పరికరాలను లేకుండానే కనిపిస్తాయంట. కానీ నెప్ట్యూన్, యురేనస్ను టెలిస్కోప్ ద్వారా మాత్రమే స్పష్టంగా చూడటం సాధ్యం అవుతుంది. అందుకే టెలిస్కోప్ లేదా బైనాక్యులర్ దగ్గర ఉంచుకోవాలి.
సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాల్లో.. ఈ ఏడు ఒకే సరళ రేఖపై మనకి కనిపిస్తాయి. మహాకుంభమేళా వంటి అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అద్భుతంగా జరుపుకుని పూర్తిచేసుకుంటున్న వేళ గ్రహాలన్నీ సాక్షాత్కారం కావడం గొప్ప విషయమని పండితులు అంటున్నారు. ఇలా 144 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
2022లో ఐదు గ్రహాలు ఒకే వరుసలో కనిపించాయి. కానీ ఏడు గ్రహాలు ఇలా ఒకేసారి ఒకే రేఖలో కనిపించడం చాలా అరుదు. ఈ విధమైన గ్రహ సముదాయం ఒకే సరళ రేఖపై మళ్లీ 2036లోనే కనిపిస్తుంది. అప్పుడు కూడా కేవలం ఐదు గ్రహాలే కనిపిస్తాయి. హిందూ ఆచార సంప్రదాయాల్లో గ్రహకూటమిని విశేషంగా భావిస్తారు. భారత్‌లో రాత్రి వేళ బుధుడు, శుక్రుడు, అంగారకుడు, గురుడు, శని గ్రహాలను నేరుగా చూడొచ్చు.