మనిషికి ఇప్పటి వరకూ తీరని ఓ కల టైం ట్రావెల్. గతంలోకి వెళ్లడం.. భవిష్యత్తును తెలుసుకోవడం. దీని కోసం శాస్త్రవేత్తల పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ అంశంపైనే అనాకానేక సైన్స్ ఫిక్షన్ సినిమాలు కూడా మనం చూశాం. అన్ని భాషల్లోనూ దీనికి సంబంధించిన సినిమాలు ఎన్నో వచ్చాయి. అయితే ఇవన్నీ ఊహాజనితమైనవే. ఏదీ వాస్తవం కాదు. అయితే అలా టైం ట్రావెల్ చేయడం సాధ్యమేనా ఈరోజు మనం దాని గురించి తెలుసుకుందాం.
నిజానికి టైం ట్రావెలింగ్ సాధ్యమేనని పరిశోధకులు చెబుతున్నారు. ఎలా అంటే ఈ సృష్టిలో కాంతిని మించిన వేగం లేదు. ద్రవ్యరాశి ఉన్న ఏ వస్తువు కూడా కాంతి కన్నా ఎక్కువ వేగంతో ప్రయాణించలేదు. అయితే కాంతితో సమానంగా ప్రయాణించగలిగితే భూత, భవిష్యత్ కాలాలను చేరుకోవచ్చని శాస్త్రవేత్తల భావన. కాంతి వేగాన్ని అందుకోవాలంటే సెకనుకు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాల్సి ఉంటుంది. ఉదాహరణకు వేల సంవత్సరాల క్రితం భూమి పై జరిగిన ఘటనలు ఇప్పటికీ అంతరిక్షలో కాంతి రూపంలో వెళ్తూనే ఉంటాయని నిపుణులు చెబుతుంటారు. వాటిని మనం ఇప్పుడు చూస్తున్నాం అంటే.. అవి ఎప్పుడో జరిగనవని అర్థమట.
వాటిని మనం లైవ్ లో చూడాలంటే కాంతికంటే వేగంగాప్రయాణించాలి. శూన్యంలో ఆ సంఘటనలు ఎంత దూరం ప్రయాణించాయో.. అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తే అప్పుడా కాలంలోకి చేరుకోవచ్చుని చెపుతున్నారు. అంటే నిన్నటి సూర్యోదయాన్ని చూడాలంటే 24 గంటలు వెనక్కి వెళ్లాలి. ఆ సమయంలో కాంతి ప్రయాణించిన రెండు వేల 592 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవాలి. అది కూడా సెకను కంటే తక్కువ సమయంలోనే . అది జరిగితే నిన్నటి సూర్యోదయాన్ని చూడగలమంటున్నారు. అయితే దీనిపై పరిశోధనలు ఇంకా జరుగుతున్నాయి. ఒకవేళ భవిష్యత్తులో టైం ట్రావిలింగ్ చేయడం అసాధ్యం కాదని అంటున్నారు. (గమనిక : ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది.. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించడం లేదు.)