Saudi Accident updates: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మృతుల వివరాల కోసం సౌదీ ఎంబసీని సంప్రదించినట్టుగా మంత్రి దుదిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఇప్పటివరకు అందిన నివేదికల ప్రకారం మృతుల్లో దాదాపు 16 మంది తెలంగాణ వాళ్లు ఉన్నట్లు తెలుస్తోందని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. మరణించిన 16 మంది మల్లేపల్లి బజార్‌ఘాట్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించినట్టుగా తెలిపారు.
మరణించిన వారి వివరాలు: గౌసియా బేగం, మహ్మద్ మౌలానా, రహీమున్నీసా, అబ్దుల్ ఖాదీర్ మహమ్మద్, ఫర్హీన్ బేగం, మహ్మద్ మస్తాన్, గౌసియా బేగం, మహ్మద్ మౌలానా, ఫర్వీన్ బేగం, షెహనాజ్ బేగం, షౌకత్ బేగం, మహ్మద్ సోహైల్, జకీన్ బేగం, జహీయా బేగం సౌదీ ప్రమాదంలో మృతి చెందిన వారిగా గుర్తించారు. వీరితో పాటుగా మరో నలుగురు మల్లేపల్లి నుంచి సౌదీ వెళ్లినట్లు తెలుస్తోంది. వీరంతా హైదరాబాద్ నుంచి ఉమ్రా యాత్రకు వెళ్లినవాళ్లని తెలుస్తోంది.

















