స్టార్ యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

స్టార్ యాంకర్ అనసూయ గ్రీన్ డ్రెస్ లో పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై కూడా ఆమె వైవిధ్యమైన పాత్రలతో దూసుకెళ్తోంది. ఈమెకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ లో మంచి క్రేజ్ ఉంది. అందుకనే ఎప్పుటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను ఆమె తెలియజేస్తుంటుంది. అందులో భాగంగా ఫొటోలను షేర్ చేసింది.

బుల్లి తెరపై స్టార్ యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె.. గ్లామర్ ఇమేజ్‌ను సంపాదించుకుంది. ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షోలో అనసూయ తనదైన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అనసూయ కారణంగా ఈ షోకు ఆదరణ మరింతగా పెరిగిందనటంలో సందేహం లేదు.

అనసూయకు నటిగా పేరు తెచ్చిన సినిమాల్లో రంగస్థలం ముందు వరుసలో ఉంటుంది. రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో రూపొందిన ఈ చిత్రంలో ఈమె రంగమత్త పాత్రలో నటించింది. తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.

అనసూయ నెమ్మదిగా సినిమాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటూ వచ్చింది. రంగస్థలం హిట్ తర్వాత ఈమెకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. ఈమె లీడ్ రోల్‌లో, నెగెటివ్ టచ్ ఉన్న రోల్స్‌లోనూ నటించటింది. ఎప్పుడైతే సినిమాల్లో బిజీగా మారిందో, టీవీ షోస్ నుంచి తప్పుకంది. సినిమాలపైనే ఫోకస్ చేసింది.

అనసూయకు క్రేజ్ తీసుకొచ్చిన రీసెంట్ సినిమా పుష్ప. రెండు భాగాలుగా రూపొందిన ఈ మూవీలో అనసూయ దాక్షాయణి అనే పాత్రలో నటించింది. ఇందులో చందనపు స్మగ్లర్ మంగళం శీను పాత్రలో నటించిన సునీల్ భార్యగా అనసూయ కనిపించింది.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు చిత్రంలో అనసూయ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వనుంది. ఓ పాటలో ఆమె కనిపిస్తుందని సినీ సర్కిల్స్ అంటున్నాయి. జూలై 24న ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుండటం విశేషం.