హీరోయిన్ మాళవిక మోహనన్ తమిళ సినీ ప్రేక్షకులకు పరిచయమే. తమిళం, మలయాళం భాషల్లో వరుస సినిమాల్లో అలరిస్తుంది. ఇప్పుడు తెలుగులో ప్రభాస్ సరసన ‘రాజా సాబ్’ చిత్రంలో నటిస్తోంది.
అయితే ఈమె నటిస్తున్న ఓ సినిమా కోసం మాళవిక కేవలం 2 వారాల్లోనే 8 కిలోల బరువు పెరిగిందట. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఆమె ఇంతకు ముందే 14 రోజుల్లో 8 కిలోల బరువు తగ్గిందట. ఇంతటి కష్టమైన పనిని ఎంత అవలీలగా చేసిందో.
ఆహారంలో తక్కువ కేలరీలు తీసుకోవడం సహా అదే సమయంలో శారీరకంగా చాలా కష్టపడి స్టంట్స్, యాక్షన్ సీన్ రిహార్సల్స్ చేయడం వల్ల శరీరంపై ఒత్తిడి కలిగి బరువు తగ్గినట్లు ఆమె చెప్పుకొచ్చింది.
అయితే తాను ఫోలో అయిన డైట్ ప్లాన్ శరీరంపై చెడు ప్రభావాన్ని కలిగిస్తుందని హీరోయిన్ మాళవిక చెప్పింది.
ప్రస్తుతం హీరోయిన్ మాళవిక మోహనన్ ప్రభాస్ జోడిగా ‘రాజా సాబ్’ చిత్రంలో నటిస్తుంది. హారర్ కామెడీ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగానూ నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ టీజర్ రిలీజై.. ప్రేక్షకులలో అంచనాన్ని పెంచేసింది.