Saturday, November 15, 2025
Homeగ్యాలరీOnam Special: బొద్దుగా ముద్దొస్తున్న నివేదా థామస్

Onam Special: బొద్దుగా ముద్దొస్తున్న నివేదా థామస్

Nivetha Thomas Onam Photos: గ్లామర్ తో కంటే నటనతో ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో నివేదా థామస్ ఒకరు. తాజాగా ఈ బ్యూటీ ఓనం పండుగ సందర్భంగా తెల్ల చీరకట్టులో సొగసుల విందు చేసింది. ఈ పిక్స్ నెట్టింట ట్రెండింగ్ గా మారాయి.

నాని ‘జెంటిల్ మాన్’ చిత్రంతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నివేదా థామస్. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వెనుదిరుగు చూసుకోలేదు.
నిన్ను కోరి, జై లవకుశ, బ్రోచేవారెవరురా, 118, వకీల్ సాబ్ లాంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.
నివేదా చివరిసారిగా తెలుగులో ’35 చిన్న కథ కాదు’ అనే మూవీలో నటించింది.
రెండు నెలల కిందట ఈ చిత్రానికి గానూ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నివేదా గద్దర్ ఫిలిం అవార్డును అందుకుంది.
గద్దర్ అవార్డ్స్ కార్యక్రమంలో నివేదా చాలా బొద్దుగా కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. ఆ ఫోటోలు చూసి నెటిజన్స్ కూడా కామెంట్ చేశారు.
కేరళలో అత్యంత ఘనంగా జరిగే ఓనం పండుగ సందర్భంగా చీరకట్టులో అందాల విందు చేసింది నివేదా. ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad