Payal Rajput Latest Photos: తెలుగు ప్రేక్షకులను అందాల ఆరబోతతో ఆకట్టుకున్న పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలోనూ నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలను చూస్తుంటే అందాల ఆరబోతతో మత్తెక్కిస్తుందనటంలో సందేహం లేదు.
RX 100 చిత్రంతో పరిచయమైన పాయల్ రాజ్‌పుత్ తొలి సినిమాలోనే లిప్ లాక్, అందాల ఆరబోతతో రెచ్చిపోయింది. యూత్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును దక్కించుకుంది.
టాలీవుడ్ ఎంట్రీకి ముందు పలు హిందీ సీరియల్స్, పంజాబీ సినిమాల్లో నటించింది పాయల్ రాజ్‌పుత్
ఆర్డిఎక్స్ లవ్, వెంకీ మామ, డిస్కో రాజా చిత్రాల్లో నటించిన పాయల్ రాజ్‌పుత్‌కు ఈ సినిమాలేవీ ఆశించిన స్థాయిలో గుర్తింపునివ్వలేదు
2023లో అజయ్ భూపతి తెరకెక్కించిన మంగళవారం సినిమాలో బోల్డ్ పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచిన పాయల్.. మంచి విజయాన్ని కూడా సాధించింది
సినిమాలతో పాటు ఆహా రూపొందించిన 3 రోజెస్ అనే వెబ్ సిరీస్‌లోనూ నటించింది పాయల్
ప్రస్తుతం కిరాతక అనే తెలుగు చిత్రంతో పాటు ఎంజెల్, గోల్ మాల్ అనే తమిళ సినిమాల్లోనూ పాయల్ నటిస్తోంది