Actress Ruhani Sharma Saree Look: నార్త్ బ్యూటీ రుహానీ శర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఈ మధ్య సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేకపోయినప్పటికీ అభిమానులను మాత్రం సామాజిక మాధ్యమాలతో పలకరిస్తూనే ఉంది. మరిన్ని వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించటానికి ఈ ముద్దుగుమ్మ వెయిట్ చేస్తోంది. గత ఏడాది ఈమె నటించిన శ్రీరంగ నీతులు సినిమా తర్వాత మరో సినిమాను తెలుగులో చేయలేదు

రుహానీ శర్మ హిమాచల్ ప్రదేశ్‌లో పుట్టి పెరిగింది. 2017లో కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టటం ద్వారా తన కెరీర్‌ను స్టార్ట్ చేసింది. కడసీ బెంచ్ కార్తి అనేది నటిగా ఆమె తొలి చిత్రం. భరత్ హీరోగా నటించిన ఈ చిత్రానికి రవి భార్గవన్ దర్శకత్వం వహించారు.

రుహానీ శర్మకు బ్రేక్ వచ్చింది మాత్రం తెలుగు సినీ ఇండస్ట్రీలోనేనని చెప్పాలి. 2018లో సుశాంత్ హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చి.ల.సౌ సినిమా నటిగా తెలుగులో ఆమెకు తొలి చిత్రం. ఇందులో ఆమె ఇండిపెండెట్ గర్ల్ పాత్రలో నటించింది. ఈ సినిమా డీసెంట్ హిట్ కావటంతో పాటు రుహాననీ శర్మ నటనకు మంచి మార్కులే పడ్డాయి.

ఆ మరుసటి ఏడాది 2019లో మలయాళ ఇండస్ట్రీలోకి కూడా రుహానీ ఎంట్రీ ఇచ్చింది. ఈమె కమల అనే సినిమాలో నటించింది. అజు వర్గీస్ నటించిన ఈ చిత్రంలో ఈమె టైటిల్ పాత్రలో నటించి మెప్పించింది. రంజిత్ శంకర్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఇందులో ఈమె ట్రావెలర్ పాత్రలో నటించారు.

2020లో తెలుగులో రెండు సినిమాల్లో రుహానీ శర్మ నటించింది. అందులో మొదటిది హిట్ కేస్1. విశ్వక్ సేన్ జంటగా నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. తర్వాత నటించిన డర్టీ హరి సినిమా కూడా ఘన విజయాన్ని సాధించింది. ఈ ఏడాది ఈమెకు బాగానే కలిసొచ్చిందనాలి.

రుహానీ తర్వాత హర్ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటించింది. ఇందులో ఆమె యాక్షన్ సన్నివేశాల్లో నటించింది. తర్వాత సైంధవ్, ఆగ్రా, ఆపరేషన్ వాలెంటైన్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తమిళంలో ఈమె మాస్క్ అనే సినిమాలో నటిస్తుంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.